కరుణలేని మతమౌఢ్యం

priyanka

మతాలు ఏవైనా సరే మత చాందసం మాత్రం ఒకటే విధంగా ఉంటుంది. అది ఎంత ప్రముఖులు, సామాన్యులను కూడా వదిలిపెట్టదు. బ్రిటీష్‌ యువరాజు పెళ్లికి చర్చి అడ్డుపడడం వల్లనే అక్కడ పోటీశాఖ ఏర్పడిందని చెబుతుంటారు. బాలీవుడ్‌ అగ్రతార ప్రియాంక చోప్రాకు అంతకన్న విచారకరమైన అనుభవం మిగిల్చింది. కేరళ క్యాథలిక్‌ చర్చి ఆమె బామ్మ మధు జ్యోత్స్న అఖోరీ ఇటీవల మరణించారు. అఖోరీ క్రైస్తవ మతాన్ని ఎంతో విధేయంగా అనుసరించిన వ్యక్తి. తన భౌతికకాయాన్ని స్వస్థలమైన కొట్టాయంలోని అట్టమంగళం చర్చి సమాధిలో ఖననం చేయాలని ఆమె కోరుకున్నారు. అందుకే ప్రియాంక ఆమె మృతదేహాన్ని ముంబయి నుంచి కొట్టాయం తీసుకొచ్చారు. కానీ అఖోరీ క్రైస్తవ మతేతరున్ని పెళ్లి చేసుకుందనే కారణంతో ఆ చర్చి అధికారులు అందుకు నిరాకరించారు. చాలా కాలంగా ఆమె ఇక్కడికి రాలేదని కూడా వారు వాదించారు. అయితే అఖోరీ అక్కడే క్రైస్తవం స్వీకరించిందని అప్పుడప్పుడు వచ్చేదని బంధువులు చెప్పారు. అయినా మతాధిపతులు అంగీకరించలేదు. చివరకు పొంకున్నం అనే మరో గ్రామంలోని క్యాథలిక్‌ స్మశానవాటికలో ఆమెను ఖననం చేశారు. ఇది కూడా కొందరు మతాధిపతుల సహకారంతో సాధ్యమయింది. అంత్యక్రియలకు సంబంధించిన అఖోరీ తన ఆఖరి హక్కును కూడా నిరాకరించడం అమానవీయమని అనేక మంది వ్యాఖ్యానించారు. ప్రియాంక చోప్రా మాత్రం బామ్మ చివరి కోరిక తీర్చలేకపోయాననే బాధతో వెనుదిరిగారు. మనిషి పోయాక కూడా మానవత్వం చూపలేని మతాధిపతులు ఏ కరుణామయుడు ప్రతినిధులు?.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *