మహిళా అభ్యర్థికే శతాబ్ధాలు…
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ ఎంపిక గొప్ప చారిత్రాత్మక పరిణామమని మోత మోగుతున్నది. తనకు పోటీగా ఉన్న బెన్ని సాండర్స్‌పై ఆమె ఆధిక్యత సాధించడం విశేషమే. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఇష్టానుసారం మాట్లాడుతున్న ట్రంప్‌ను ఆమె ఎదుర్కోవాల్సి ఉంది. బరాక్ ఒబామా ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారం చేశారు గనుక ఈ దఫా రిపబ్లికన్లకు అవకాశం రావడం ఆనవాయితి. కనుక హిల్లరీ క్లింటన్ కేవలం పోటీదారుగానే మిగిలిపోవచ్చు. శతాబ్ధాల తర్వాత గాని ఒక మహిళకు పోటీ అవకాశం రాలేదంటే అమెరికా ప్రజాస్వామ్యం ఎంత పురుషస్వామ్యంగా ఉందో తెలుస్తుంది. ఇండియాలో ఇందిరాగాంధీ, శ్రీలంకలో సిరిమావోలతో సహా అరవయ్యవ దశకంలోనే మహిళా ప్రధానులు అధ్యక్షులను చూశాం. భారత ఉపఖండంలో అన్ని దేశాలను మహిళా నాయకురాళ్లు పాలించారు. యూరప్‌లో కూడా మార్గరెట్ థాచర్ నుంచి ఇప్పుడు ఏంజెలా మార్కెల్ వరకు మహిళా నేతలున్నారు. మరి అత్యంత అభివృద్ధి చెందిన మాట నిజమైతే అమెరికా ఒక మహిళా అభ్యర్థిని తీసుకోవడానికే ఇంతకాలం పట్టిందా? నిజంగా విచిత్రం కదూ!.
