గుజరాత్‌ గుల్బర్గ్‌ హత్యాకాండలో శిక్షలు

GUJRAT_RIOTS_GULBA_2877523fప్రస్తుతం ప్రధానిగా దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి హయాంలో గుజరాత్‌లో జరిగిన మారణహౌమంలో ఒక కేసైనా శిక్షల వరకూ వెళ్లింది.గుల్బర్గ్‌ సొసైటీ అపార్ట్‌మెంట్లలో 2002 ఫిబ్రవరి 8న కాంగ్రెస్‌ ఎంపి ఇషాన్‌ జాఫ్రీతో సహా 69 మంది ప్రాణాలు బలిగొన్నందుకు 24 మందికి కోర్టు జైలుశిక్ష విధించింది. 36 మందిని విడుదల చేసింది. హత్యలతో సంబంధం లేకుండా కేవలం అల్లర్లకు పాల్పడిన మరో 36 గురిపై తీర్పు తర్వాత ప్రకటిస్తానని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి పి.వి.దేశాయి తన తీర్పు వెలువరించారు. సిబిఐ మాజీ అధిపతి ఆర్‌కెరాఘవన్‌ అద్యక్షతన నియమించిన సిట్‌ దీనిపై 2009లో నివేదిక నిచ్చింది. అయితే ఎంపి తుపాకితో కాల్పులు జరపడం వల్లనే మూకలు రెచ్చిపోయి హత్యలకు పాల్పడినట్టు అభిప్రాయపడింది. చర్యకు ప్రతిచర్య అన్న న్యూటన్‌ సిద్ధాంతం ప్రకారం ఆయన కాల్పులు జరిపినందుకు ప్రతిగానే ఈ దారుణంజరిగిందని వ్యాఖ్యానించిన అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు ఇందుకు కారణం కాదని సిట్‌ తనే కితాబునిచ్చింది.2002 మార్చి1న జీటీవీ ఇంటర్వ్యూలో దారుణమైన ఈ వ్యాఖ్యలు చేసిన మోడీ 2010లో సిట్‌ దానిపై ప్రశ్నించినప్పుడు సరిగ్గా ఏ పదాలు వాడానో గుర్తు లేదని తప్పించుకున్నారు. గోద్రా ఘటనకు ప్రతీకారంగా ఇలాటివి చేయొద్దని చెప్పడానికే అలా అనివుంటానని వాదించారు. మొత్తంపైన ఈ కేసు దర్యాప్తు విచారణ ఆలస్యమవుతున్నా10_jafri_1079610eయని భావించిన సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షించడం మొదలుపెట్టింది. మే 31లోగా తీర్పునివ్వాలని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ తీర్పు వచ్చాక జాఫ్రీ భార్య జకియా జాప్రీ మాట్లాడుతూ కొందరికైనా శిక్షలు పడటం స్వాగతించదగిందని అన్నారు.విచారణ వేగంగా జరిగివుంటే మరింత బాగుండేదని వ్యాఖ్యానించారు. మొత్తం 66 మందిపై కేసు పెట్టగా ఆరుగురు విచారణ కాలంలోనే మరణించారు.ఇప్పుడు శిక్షపడిన వారిలో విహెచ్‌పి నాయకులు కూడా వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *