హీరో విలన్లు ,విలన్‌ హీరోలు!

jagapathi111
అందాల నటుడు శోభన్‌ బాబుకు అపరవారసుడుగా పేరొంది అనేక విజయాలు సొంతం చేసుకున్న హీరో జగపతిబాబు విలన్‌గా మారడం పెద్ద వార్తగా వుంది.ఆయన దానిపై బాగానే మాట్లాడుతున్నారు. ఈయన రాకతో విలనిజం మళ్లీఆకర్షణ సంతరించుకుంది. ఒకప్పుడు రాజనాల వంటివారు హీరోలతో సమానంగా వుండేవారు. తర్వాత కూడా సత్యనారాయణ,నాగభూషణం,రావుగోపాల రావు,ప్రభాకరరెడ్డి,నూతన్‌ప్రసాద్‌,కోట శ్రీనివాసరావు, గిరిబాబు వంటి వారు బాగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత ప్రకాశ్‌ రాజ్‌ చాలా గ్లామర్‌ సంపాదించారు. ఆ తర్వాత మాత్రం హీందీ విలన్లదే హవాగామారింది.ఇందుకొక కారణం హీరోలతో సమానమైన పేరు తెచ్చుకునే విలన్లు వుండకూడదన్న భావమేనని అనిపించేది. ఈ తరహా విలన్లలో కొందరు అమ్రిష్‌పురి వంటివారు తర్వాత సోనూ సూద్‌ తదితరులు బాగాపాతుకుపోయారు. సినిమా అన్నాక ప్రతినాయకుడు గట్టిగావుంటేనే నాయకుడి గొప్పతనం తెలుస్తుందనే ప్రాథమికసూత్రం మన పరిశ్రమ గుర్తించలేకపోయింది. పైగావిలన్లంటే శాడిజమే నన్నట్టు మార్చేసిందికూడా.

సినిమాల్లో నాటకాల్లో హీరోలు విలన్ల పాత్రలు ముందే నిర్ణయమై వుంటాయి.కాని జీవితంలో అన్ని కలగలసి వుంటాయి. పాత్రల సంగతి ఎలావున్నా పాత్ర ధారులను పరిశీలిస్తే హీరోలు విలన్ల మధ్య శాశ్వత విభ’జన ఏదీ వుండదని కూడా తెలుస్తుంది. కాకపోతే ఎవరు ఏ తరహా పాత్రలు ఎక్కువగా ధరిస్తే దాన్నిబటిy వారిపట్ల అభిప్రాయం ఏర్పడుతుంటుంది. హీరోగా పాతుకు పోయిన వారు ప్రతికూల పాత్ర వేసినా ఆరాధనా భావం వుంటుంది. అదే విలన్లుగా ప్రసిద్ధులైన వారు మంచి పాత్ర వేసినా దాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఇదో సినీ లాజిక్‌.

వాస్తవానికి మన నటుల్లో హీరోలు విలన్లు అని రేఖ గీయదగిన వారు కొద్ది మందే.అక్కినేని చాలా వరకు సాత్విక పాత్రలే ధరించారు. మిగిలిన వారంతా ఎప్పుడో అప్పుడు ఏదో మేరకు ప్రతికూల పాత్రలు దుషyపాత్రలు కూడా ధరించిన వారే. వీరిలో అగ్రగణ్యుడు ఎనీyఆర్‌. అసలు మనదేశంలో ఆయన ప్రవేశమే విలన్‌గా(అంటే దుషy పోలీసు అధికారిగా) తర్వాత కూడా పల్లెటూరి పిల్ల పరివర్తన వంటి చిత్రాల్లో కొంచెం నెగిటివ్‌ పాత్రల్లో కనిపించాడు. అన్నిటినీ మించి పౌరాణిక చిత్రాల్లో రావణాసురుడు దుర్యోధనుడు వంటి విలన్‌ పాత్రలు వేసి వాటికి హీరోయిజం అద్దారు! అలాగే ద్విపాత్రాభినయ చిత్రాల్లోనూ ఒక పాత్ర నెగిటివ్‌గా కనిపించే ఉదాహరణలున్నాయి. ఈ తరంలో జగ్గయ్య కూడా విలన్‌గానూ రెండవ హీరోగానూ కూడా ఏకకాలంలో రాణించారు. అలాగే హీరో కృష్ణ కూడా అంతం కాదిది ఆరంభ’ం వంటి చిత్రాల్లో ప్రతికూల పాత్రలు వేశారు.శోభ’న్‌ బాబు మానవుడు దానవుడు లో అలాటి ప్రయోగం చేశారు. కృష్ణం రాజు రావడమే విలన్‌గా వచ్చి కొన్ని చిత్రాలయ్యాక హీరోగా మారారు.
ఈ కోవలో బాగా చెప్పుకోవలసిన వ్యక్తి మోహన్‌ బాబు. స్వర్గం నరకంలో హీరోగా వచ్చి తర్వాత విలన్‌గా మారాడు. వందల సినిమాల్లో మెప్పిస్తూ హీరో కావడానికి కృషి చేశాడు. కొన్ని పరాజయాల తర్వాత మళ్లీ విలన్‌ వే’ాలేస్తూ క్రమంగా హీరోయిజం నిరూపించుకున్నారు. రెండు రకాలుగానూ తనదైన ముద్ర వేశారు.చిరంజీవి కూడా మొదట్లో నెగిటివ్‌ షేడ్స్‌ వున్న పాత్రలతోనే ఆకర్షించి అగ్రకథానాయకుడైనారు. బాలకృష్ణ కూడా సుల్తాన్‌ వంటి చిత్రాల్లో నెగిటివ్‌ పాత్ర వేశారు. భాను చందర్‌,వినోద్‌ కుమార్‌, పృధ్వీ, జెడిచక్రవర్తి వంటివారంతా ఇంతే. గోపీచంద్‌ మొదట హీరోగా వచ్చి పెద్ద విజయాలు లేక జయంతో విలన్‌గా మారి మళ్లీ హీరోపథం వైపు నడిచారు. అన్నమయ్యలో విష్డుమూర్తిగా అలరించిన సుమన్‌ శివాజిలో విలన్‌గా ఆహా అనిపించాడు. విలన్లుగా వేస్తూనే క్యారెకyర్‌ నటులైన వారికి లెక్కేలేదు.కనక ఖచ్చితంగా విలన్లు హీరోలు అని నటులను విభ’జించడం కొద్ది మంది విషయంలోనే సాద్యం.

హీరోయిన్లలా విలనిన్‌లన్నమాట కొత్తగా వుందా? మామూలుగా ఆడ విలన్లు మనకు తెలుసు.అలాటివారిలో అగ్రస్థానం సూర్యకాంతమ్మదే. ఇద్దరు హీరోలున్న రక్తసంబంధంలో ఆమె ఒక్క చేతిమీద విలనిజం చూపించింది. చాయాదేవి, సుకుమారి,ఎస్‌.వరలక్ష్మి వంటివారు కూడా ఆ తరహా పాత్రలు వేసేవారు. కాకపోతే వీటన్నిటినీ గయ్యాళి పాత్రల కింద తీసేస్తారు. తర్వాత కాలంలో శారద,వాణిశ్రీ, నగ్మా వంటివారు ఇలాటి పాత్రలు వేశారు. ఇప్పుడు టీవీ సీరియళ్లలో వీటిసంఖ్య బాగా ఎక్కువగా వుంటోంది.కాకపోతే చెప్పదల్చుకున్నది అలాటి వారి గురించి కాదు. ప్రధాన విలన్‌పాత్రల్లో కనిపించిన నటీమణుల గురించే. దొంగల మురవా నాయకురాళ్లుగానో భ’ూస్వామ్య స్త్రీలుగానో నటించిన వారి సంగతి. ఈ కోవలో భానుమతిని,కన్నాంబను చెప్పుకోవాలి(ఇద్దరూ పల్నాటి యుద్ధంలో నాగమ్మలే) తర్వాత జి.వరలక్ష్మి(దొంగల్లో దొర). చాంగురే బంగారు రాజా అంటూ నర్తించిన రత్న కూడా విలనిన్‌గా కొన్ని చిత్రాల్లో వేశారు. ఇటీవల కాలంలో నళిని వీడేలో భ’యంకరమైన విలనిజం చూపించారు. శకుంతల గురించి చెప్పనవసరం లేదు. ఇలా విలనిన్ల కథ చాలా వుంది. గుండమ్మ కథలో సూర్యకాంతం గయ్యాళి అని చూపించే సన్నివేశం ఒక్కటీ లేదట. ఆమె ఆ పాత్రలో కనిపించాక వేరే సన్నివేశాలెందుకన్నాడట చక్రపాణి. అదీ విషయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *