మోడీ అలీన స్వరం ,చైనా మైత్రి
ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా వున్నాయి. పరిణతిని ప్రదర్శించాయి. భారత దేశం అలీన విధానాన్ని విడనాడే ప్రసక్తి లేదని ఆయన అనడం మనం చూస్తున్న దానికి భిన్నంగా వుంది. ఈ మాటలు ఆచరణలోనూ అమలైతే సంతో
షమే. పాకిస్తాన్‌తో సంబంధాల మెరుగుదలకు వారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పెద్ద అవరోధంగా వుందన వ్యాఖ్య కూడా సరైందే. ఈ సందర్భంగా చైనాతో వివాదాన్ని కూడా ఆయన సరైన కోణంలోనే వివరించారు. 30 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం, వున్నా ఉద్రిక్తత లేదని ఒక్క ఘర్షణ కూడా జరగలేదని స్పష్టం చేశారు. ఒక్క బుల్లెట్ కూడా పేలలేదు అనివ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చైనా పర్యటనలో వుండగా ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు సత్సంబంధాలకు మరింత దోహదం చేస్తాయి. దేశంలోని మీడియాలో పెద్ద భాగం, అలాగే సంఘ పరివార్ కూడా చైనా వ్యతిరేకతను ఒక పెద్ద సమస్యగా చూపిస్తుంటారు. మోడీ వ్యాఖ్యలతోనైనా అలాటివారి ధోరణి మారుతుందేమో చూడాలి. ఇదంతా చెప్పడం చైనా కమ్యూనిస్టుల పాలనలో వున్నందుకు కాదు. మన పొరుగునే వున్నందుకు. రెండువేల సంవత్సరాలవున్నందుకు. చైనాతో ప్రజా సంబంధాలు వాణిజ్య సంబంధాల పెరుగుదలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ఈ రెండు దేశాలు ఒకటిగా వ్యవహరిస్తే ప్రపంచమే ప్రభావితమవుతుంది.ఇప్పటికైనా వీటి ఉనికి సాధారణ సంబంధాలు చాలా పాత్ర వహిస్తున్నాయనేది నిజం. భారత దేశపు అవకాశాలలో భాగం కోసమే అమెరికా ఆరాటపడుతున్నదని మోడీ సరిగానే చెప్పారు గాని అమెరికాకు అంతకంతకూ లొంగిపోతున్న భారత విదేశాంగ విధానాన్ని అలీన పంథాలో సవరించుకుంటే నిజంగా మేలు జరుగుతుంది. చైనాకు వెళ్లిన తొలి విదేశాంగమంత్రి వాజ్‌పేయి. అలీన విధానాన్ని కూడా అప్పుడు గట్టిగానే చెప్పేవారు. అయితే సరళీకరణ విధానాల తర్వాతనే ఇది మారిపోయింది. అమెరికా పెత్తనం పెరిగింది.