మెడికల్‌ ప్రొఫెసర్ల రిటైర్మెంట్‌ 65 ఏళ్లు?

2006020705280201_995238e
ప్రభుత్వ వైద్యశాలల్లో బాగాసీనియర్లుగా వున్న ప్రొఫెసర్లకు 65 ఏళ్ల వరకూ పదవీ కాలం పొడగించాలని మినేఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇది కూడా బాగా సీనియర్లయిన వారికేనని ఆరోగ్య మంత్రి  శ్రీనివాస్‌ చెబుతున్నారు ప్రభుత్వ వైద్యుల సంఘం మాత్రం దీని వల్ల తమ ప్రమోషన్లు దెబ్బతింటాయని విమర్శిస్తున్నది.పైన తిష్ట వేసిన కొద్దిమంది సీనియర్లు కుట్ర పన్ని ఈ ప్రతిపాదన చేయించారనీ. కావాలంటే తమకు ప్రమోషన్లు ఇచ్చి వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయాలని ఆ సంఘం ప్రతినిధి ఒకరు మా చర్చలో వాదన చేశారు. విభజన తర్వాత ఏపిలో పదవీ విరమణవయస్సు 60కి పెంచారు. (తెలంగాణలో యథాతథంగా వుంది.) మనుషుల జీవన ప్రమాణం పెరగడంతో పాటు ప్రత్యేక నైపుణ్యం గల వారికోసం ఇలాటి నిర్ణయం తీసుకుంటే తప్పులేదని ఒక వాదన. అయితే అంతకన్నా ముఖ్యమైన అంశం రాజధాని ప్రాంతం వైద్య కేంద్రంగా పెంపొందాలంటే అక్కడ ఆరితేరిన వైద్య నిపుణులు వుండాలనేది. వారంతా హైదరాబాదులోనే వుండిపోయినందున అలాటి అభివృద్ధికి ఆటంకంగా వుందని ఇటీవల విజయవాడలో వైద్య రంగ ప్రముఖులు నాతో అన్నారు.ఎన్టీఆర్‌ ప్రత్యేక నిబంధనలతో నిమ్స్‌లో నియామకాలకు అనుమతించినందునే హైదరాబాదులో అంతగా కార్పొరేట్‌ వైద్య విస్తరణ జరిగిందని వారంటారు. ఆ పరిస్థితి విజయవాడలో రావాలంటే అదనపు సదుపాయాలు కల్పించడంఅనివార్యమంటున్నారు. విభజన తర్వాత కూడా హైదరాబాదులోని ప్రముఖ డాక్టర్లు విజయవాడ రావడానికి ఇష్టపడకపోవడం, ఆప్షన్లపై తెలంగాణ డాక్టర్ల సంఘం నిరసన దృష్ట్యా కూడా వారిని ఆకర్షించడానికి ఇలాటి చర్యలు అవసరమవుతున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితిదయనీయంగా వుండటంలో సిబ్బంది కొరత ముఖ్య కారణం. కొత్తవారిని నియమించడం,న్యాయమైన ప్రమోషన్లు మంజూరు చేయడం కూడా తప్పక చేయాల్సిన పనులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *