ఎపి ప్రత్యేక కోర్టుల ప్రచారంలో సాధ్యాసాధ్యాలు

అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు వినియోగించేందుకు  ఎపిjagan111 ప్రత్యేక కోర్టుల చట్టం ప్రయోగిస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది శాసనసభలో ఆమోదించిన ఈ చట్టంపై తాజాగా రాష్ట్రపతి ముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థగా వున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌త, సిబిఐతోో ముడిపడివుంది గనకే రాష్ట్రపతి ముద్ర అవసరమైంది. వచ్చిన వెంటనే దీన్ని ప్రతిపక్ష వైసీపీ నేత జగన్‌ అటాచ్డ్‌ ఆస్తులపై ప్రయోగిస్తారని కథలు వస్తున్నాయి. కొంత మంది తెలుగుదేశం నాయకులు ఆ మేరకు మాట్లాడుతున్నారు కూడా. అసలు బిల్లు సభలో ప్రవేశపెట్టినప్పుడే మంత్రి యనమల రామకృష్ణుడు ఆ విధమైన వ్యాఖ్యలు చేశారు. 43,000 కోట్ల విలువైన ఆస్తి ఈ విధంగా కేంద్ర సంస్థల స్వాధీనంలో వుండి ఆలస్యం జరిగిపోతుందని చెప్పారు. గతంలో ఒరిస్సా బీహార్‌లలో ఈ సమస్యపైనే ప్రత్యేక కోర్టుల చట్టం తెచ్చారు. ఎపి చట్టం కూడా ఆ మార్గంలోనే రూపొందింది. కాని న్యాయనిపుణులు చెప్పే ప్రకారం కూడా వాస్తవం ఏమంటే ఈ చట్టం అంత వెనువెంటనే ఆస్తులను అమ్మేయడానికి అవకాశమిచ్చేదిగా వుండదు. రకరకాల అవినీతి వ్యవహారాలు అక్రమాలలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఏళ్లతరబడి కొనసాగించడం వల్ల విశ్వసనీయత దెబ్బతింటుందని తమకు పాత్ర లేకుండా పోతన్నదని రాష్ట్ర ప్రభుత్వ వాదన. . ఈ విషయంలో సిబిఐ న్యాయస్థానాల్లో ఆలస్యం జరుగుతుంది గనక ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసి త్వరితంగా తేల్చాస్తామని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అయితే అలాటి ఏర్పాట్ల.తర్వాత విచారణజరగాలి. ఒక వేళ ఇప్పటికే ఉన్న త న్యాయస్థానాల్లో వుంటే వాటి అభిప్రాయం తీసుకోవాలి.అయితే అక్రమాస్తులుగా న్యాయస్థానాలు నిర్ధారించి తీర్పు చెప్పకుండా ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీన పర్చుకోవడం కుదరదు ే సాక్షి సంస్థ ప్రభుత్వ ఆధీనంలో వుంది గనక దాన్నిస్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి వున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌'(ఈడీ) స్వాధీనం అంటే అది తాత్కాలికమే.సాధారణ కోర్టులు లేదా ప్రభుత్వ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు తేల్చవలసి వుంటుంది.దర్యాప్తు వేగవంతం చేస్తే మంచిదే. అయితే ఈ చట్టం ప్రకారంకూడా కేంద్ర సంస్థల ఆధీనంలోని ఆస్తులను రాష్ట్రం అంటుకోలేదు. దానికోసం ప్రత్యేకంగా నిబంధన చేర్చినా నడుస్తున్న విచారణలు పూర్తి కావలసి వుంటుంది.
నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిఇన్నాళ్లయినా అంతకు ముందే తామే అనేక ఆరోపణలు చేసిన జగన్‌కు సంబంధించిన అదనంగా ఆధారాలేమీ బయిటపెట్టకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. హైదరాబాదులో భూములు వేల ఎకరాలు కబళించారని పదేపదే ఆరోపించిన టిఆర్‌ఎస్‌ నాయకులు కూడా అధికారంలోకి వచ్చాక అలాటి నిర్దిష్ట ఉదాహరణ ఒక్కటంటే ఒక్కటైనా ఈ రెండేళ్లలో వెల్లడించింది లేదు. దీనికి రెండు కారణాలు కనిపిస్తాయి. మొదటిది- ఎవరు అధికారంలోకి వచ్చినా ఇలాటి వాటిని సర్దుబాటు చేయడం రెండవది- మరొకరి పై ఆరోపణల గురించి రభస చేస్తే రేపు తమకు అవసరమైన ఆర్థిక వనరుల సమస్య వస్తుందనే భయం, ఏమైతేనేం- ప్రసంగాలలో తప్ప ప్రభుత్వాలు రాజకీయ అవినీతిపై తీసుకునే చర్యలు చాలా పరిమితంగానే వుంటాయని తేలిపోతుంది. నిజంగా జగన్‌ ఆస్తులకు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడుగు ముందుకేస్తే పెద్ద విషయమే. పైగా ఆయన కేసు విచారణలో వుండగానే ఎలా తను నిర్ణయం తీసుకుంటుందనేది కూడా సాంకేతిక సమస్య. ఇవన్నీ చెప్పడం ఎవరినీ సమర్థించడానికి కాదు. లేనిపోని మాటల వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేయడానికే. తాజా చట్టం ప్రకారం కోర్టుల ఏర్పాటు ఎప్పుడు ఎలా జరుగుతుందనేది తదుపరి ఘట్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *