అయినా అమ్మ మారలేదు!

jaya111
గతంలో ఇందిరాగాందీ అమ్మ పేరిట చాలా కాలం దేశాన్ని పాలించారు. ఇప్పుడు ఆ టైటిల్‌ అక్షరాలా తమిళనాడు ముఖ్యమంత్రి పురుచ్చి తలైవి జయలలిత స్వంతంచేసుకున్నారు. నిరంకుశాధికారం, అవినీతి ఆరోపణలు, తీర్పులు శిక్షలూ ఎలా వున్నా ఆమె మాట్లాడ్డం మాత్రం చాలా స్పష్టంగా వుంటుంది. ఇంగ్లీషు ఆధునికంగానూ వుంటుంది. విషయం మాత్రం మహా కక్ష పూరితంగానేవుంటుంది. ఇటీవలి ఘన విజయం తర్వాత ఆమె ప్రమాణ స్వీకారానికి హాజరైన డిఎంకె నాయకుడు స్టాలిన్‌కు వెనకవరసలో సీటు వేయడంపై ఆయన తండ్రి కరుణానిధి మండిపడ్డారు. అసలు వెళ్లవలసింది కాదని ఆమె మారే మనిషి కాదని అన్నారు. నిజంగానే దాదాపు వందస్థానాలు కలిగిన ప్రతిపక్ష నేతను అలా తక్కువ చేయడం పెద్ద పొరబాటు. విstalinచిత్రమేమంటే జయలలిత దీనిపై విచారం వెలిబుచ్చడం. స్టాలిన్‌ తిరిగివెళ్లిన తర్వాత ట్వీట్‌ చేస్తూ ఆమె ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. జయలలిత ప్రతిస్పందనగా ఆయన వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆ సంగతి తెలిసివుంటే ముందే సీటు వేయించేదాన్నని అధికారులు ప్రొటోకోల్‌ ప్రకారం చేసి వుంటారని అన్నారు. తమాషా ఏమంటే ప్లాష్‌బ్యాక్‌లోకి వెళితే 2002లోనూ ఇదే సన్నివేశం .. ఆప్పుడు డిఎంకె ప్రతిపక్ష నేత అంబుజగన్‌కు ఇలాగే జరిగింది. అమ్మ ఖచ్చితంగా ఇదే మాట్లాడారు. తెలిస్తే ముందు సీటు కేటాయించమని చెప్పేదాన్ని అన్నారు. అంతటితో ఆగక ఈ ప్రొటోకోల్‌ నిబంధనలు మార్చింద 1996లో డిఎంకె హయాంలోనేనని గుర్తు చేశారు కూడా.కనక కడుపులోకక్ష వున్నంత కాలం కమ్మటి మాటలతో ప్రయోజనమేమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *