రాజన్‌పై స్వామి విషం

raghuram111
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక వివిధ రంగాలలో ఆరెస్సెస్‌ బిజెపి నేతల ప్రత్యక్ష జోక్యం ప్రతికూల వ్యాఖ్యలు సర్వసాధారణమైనాయి. ఈ మధ్యనే రాజ్యసభకు నామినేట్‌ చేయబడని దారితప్పిన మిసిలీలాటిసుబ్రహ్మణ్యస్వామి వరుసగా ఎవరో ఒకరిపై పడుతూనే వుంటారు. విద్యారంగం, చరిత్ర రచన, న్యాయవ్యవస్థ, ఇవన్నీ చాలనట్టు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థపై పడ్డారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌ రఘురామరాజన్‌ను వెంటనే తొలగించాలని బహిరంగ వివాదం లేవనెత్తారు. మొదట మామూలుగా ఆరోపణలు చేసిన స్వామి ఇప్పుడు నేరుగా ప్రధాని మోడీకే లేఖ రాశారు. గవర్నర్‌ను నియమించేది ప్రభుత్వమే గనక ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. నిజానికి రఘురామరాజన్‌ రూపాయ విలువ స్థిరపరచడంలోనూ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలోనూ బ్యాంకు రుణాల ఎగవేతను నిలవరించడంలోనూ మంచి పాత్ర నిర్వహించారనే అభిప్రాయం వుంది. అయతే ఆయన స్వతంత్ర భావాలు వెలిబుచ్చుతుండటమే ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. పైగా బడాబాబుల బ్యాంకు రుణాల వడ్డీరేట్టు బాగా తగ్గించేయాలని సుబ్రహ్మణ్యస్వామి వంటివారు ఇచ్చే సలహాలు ఆయన స్వీకరించలేదు. నిజానికి రఘురామ్‌ రాజన్‌ ఐఎంఎప్‌లో పనిచేసిన అధికారి. చికాగో యూనివర్సిటీ ఆర్థిక విభాగంలో పనిచేస్తూ ఈ బాధ్యతలు తీసుకున్నారు. అందుకే రాజన్‌కు అసలు భారతీయ మనస్తత్వం లేదనీ, ఆయన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని స్వామి అనేకవిధాల తిట్టిపోస్తున్నారు.. ఈ విషయమై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అభిప్రాయడం అడగ్గా మీడియాతో పంచుకోలేని విషయాలుంటాయని దాటేశారు.రాజన్‌తో విభేదించడం వేరు, ఆయనపై విషం కక్కడం వేరు. గత పాతికేళ్లలోనూ రిజర్వుబ్యాంకు గవర్నర్లందరూ అయిదేళ్లు పూర్తి చేశారు. 2013లో పదవి చేపట్టిన రాజన్‌ మూడేళ్లే పూర్తి చేశారు. అయితే ఆయనను తొలగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *