ఉజ్జయనిలో అమిత రాజకీయ షా పుష్కరాలు

amit-shah-in-ujjain_4eb0c7e4-1804-11e6-976e-c52fa8d2ca82
మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయని ప్రాచీన భారత దేశ చరిత్రతో ముడిపడిన అతి గొప్ప నగరం. కాళిదాసు నడయాడిన నేల. అలాటి చోట వచ్చిన సింహస్థ పుష్కరాలను బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా రాజకీయ భరితం చేయడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంలో సమరసతా స్నాన్‌, సమరసతా భోజ్‌ అంటూ ఆయన దళితులను తీసుకొచ్చి బిజెపి రాజకీయ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమైనారు. వాస్తవానికి ఇక్కడ
సామాన్యుల స్నానానికి వేరే ఘాట్‌ పెట్టారు. ి అక్కడ దళితుల వంటివారికే అది ఏర్పాటు చేశారన్న విమర్శలు వున్నాయి. అమిత్‌ షా వారితో కలసి స్నానాలు చేయడమే గాక దళిత స్వాములు సాధుసంతుల కేంద్రమైన వాల్మీకీ ధామ్‌ కూడా సందర్శించి రాజకీయ evening-collapsed-simhastha-mangalnath-reportedly-injured-thursday_b65dc310-1377-11e6-a855-9958039a7c6dసందేశమిచ్చారు. అయితే ,, అన్న పదం మాత్రం వాడకపోవడం విశేషం! ఇవన్నీ చాలనట్టు సిద్ధాంత మహాకుంభ పేరిట బిజెపి రాజకీయ మేళా కూడా నిర్వహించారు. 2004లో వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ఇక్కడ కుంభమేళా జరిగినప్పుడు ఇలాటి తతంగాలేమీ లేవు. కాని ఈసారి అమిత్‌ షా చాలా హంగామా చేయడంతో పోలీసులు అధికారులు పూర్తిగా ఆ పనిలోనే మునిగిపోయారు.దీంతో భద్రత ఎక్కడ దెబ్బతింటుందోనని యాత్రీకులు స్థానికులు భయపడుతున్నారు. 1954లో ఇక్కడ పుష్కరాలలో వందలాది మంది తొక్కిసలాటలో మరణించారు. ప్రస్తుత కుంభమేళాకు అయిదుకోట్ల మంది వస్తారని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం ప్రచారం చేసింది. అయితే ఇటీవల గాలివాన తుపాను కారణంగా అంతా అస్తవ్యస్తమైంది. ఏడుగురు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాజకీయ వేత్తల రాక ప్రచార కాండ మంచిది కాదని బిజెపి వారు కూడా భావించినా అమిత్‌ షా తన ఆలోచన మార్చుకోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *