సూపర్‌స్టార్ల స్థాయిలో అమరావతి రియల్‌ వెంచర్స్‌

అమరావతిలో రాజధాని నిర్మాణం, రైతులకు స్థలాల కేటాయింపు నిధుల కొరత ఎలా వున్నా రియల్‌ ఎస్టేట్‌ వాణిజ్యం మాత్రం బాగా స్పీడందుకుంటున్నది. ఎంత అంటేmaheshbabuburripalem2 సాక్షాత్తూ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అక్కడ రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వచ్చేంత!నాగార్జున యూనివర్సిటీ వెనక కాజగ్రామంలో రామకృష్ణ రియల్‌ఎస్టేట్స్‌ వారు వెనిజీయా పేరుతో గేటెడ్‌కమ్యూనిటీ నిర్మిస్తున్నారట. 32 అంతస్తుల ఈ నిర్మాణాలకు గతంలో అనుమతి రాలేదన్నారు గాని ఇప్పుడు కొంత కదలినట్టుంది. ఈ వెంచర్‌ సభలో మహేష్‌బాబు పాల్గొన్నారు. ఆయన తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుండేందుకు ఒప్పుకున్నందుకు అనిల్‌ సుంకర ఒకటికి రెండుసార్లు కృతజ్ఞతలు చెప్పారు. మహేష్‌ తనశైలిలో శుభాకాంక్షలు చెప్పి ముగించారు.తన హృదయంలో విజయవాడకు ప్రత్యేక స్థానం వుందని ఒక్కడు దూకుడు విజయోత్సవాలు ఇక్కడే జరిగాయని సభలోనూ మీడియా గోష్టిలోనూ చెప్పారు. ఆయన బావ ఎంపి గల్లాజయదేవ్‌, ఎంఎల్‌ఎ ముళ్లపూడి నరేంద్ర కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రజలు కేరింతలు కొట్టారు. . దానికి ముందు తను దత్తత తీసుకున్న స్వగ్రామం బుర్రిపాలెంలో కూడా శ్రీమంతుడు తరహాలో పర్యటించారు మహేష్‌బాబు. అక్కడ సభలో వైద్య శిబిరం నిర్వహణ, అభివృద్ధి ప్రణాళికల గురించి ప్రస్తావించారు. అయితే ఉపాధికి సంబంధించి యువత ప్రశ్నలు వేసి సరైన జవాబులు రాక నిరుత్సాహ పడినట్టు సమాచారం.ఆంధ్ర ప్రదేశ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుంటానని బాలివుడ్‌ నటుడు అజరు దేవగన్‌ను నియమించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపాదన చేశారు.ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీ నిర్మిస్తామని ఆయన ప్రణాళిక సమర్పించి చర్చలు జరిపారు.మొత్తానికి అమరావతి తారలు దిగివచ్చే నేలగా మారుతున్నదన్నమాట. మరి వాస్తవాలు ఎలా వుంటాయో కాలమే చెప్పాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *