అమెరికాకు ప్రతిగా చైనా, ఇరాన్

బ్రిక్స్‌దేశాలలో బ్రెజిల్,రష్యా,ఇండియా,చైనా, దక్షిణాఫ్రికా వుండగా వీటిలో చైనా రష్యాలు ఇప్పటికే అమెరికా ఆధిపత్య వ్యూహాలకు ఎదురు నిలబడ్డాయి. ఇక బ్రెజిల్ గతంలో తన మాట వినలేదని ఆదేశాద్యక్షురాలిపై ఏదో సాంకేతిక సాకుతో అభిశంసన ప్రహసనం నడిపిస్తున్నది అమెరికా. ఈ కూటమిలో లేని ఇరాకూడా ఇప్పుడు అమెరికా ఇజ్రాయిల్‌ల బెదిరింపులకు భయపడనవసరం లేదని అరబ్‌దేశాలకు హామీ నిచ్చింది. ఎటొచ్చీ ఒక్క ఇండియాయే ఈ జాబితాలో అమెరికాకు పూర్తిగా లొంగిపోవడానికి సిద్ధమైంది.
దక్షిణచైనా సముద్రంలో చైనాతో వున్న వైరుధ్యాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి బదులు చుట్టుపక్కల దేశాలను కూడగట్టి ఉద్రిక్తత పెంచుతున్నది అమెరికా. పిలిప్పయిన్స్‌తో కలసి విన్యాసాలు కూడా ప్రారంభించింది.జపాన్, దక్షిణ కొరియా మొదటినుంచి స్నేహంగా వున్నవే. ఇక ఇటీవల ఇండియాను కూడా ఆ జట్టులో చేర్చుకున్నది. అమెరికా భారత్‌ల ఒప్పదంపై చైనా నేరుగా దాడిచేయకపోయినా తన ప్రయోజనాలు కాపాడుకుంటానని ప్రకటించింది. మొత్తంపైన అక్కడ పరిస్థితి వేడెక్కుతున్నదనేది నిజం.
ఇంకో వైపున అమెరికా అండదండలతో నడిచే యూదుజాత్యహంకార ఇజ్రాయిల్ ప్రభుత్వం పశ్చిమ తీరంలో కొత్తగా వందలాది ఆవాసాలను ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. టెర్రరిజంపై యుద్ధం పేరిట అమెరికా అంతకు ముందు నుంచి హడావుడి చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ యుద్దం నుంచి ఇజ్రాయిల్ విస్తరణ నుంచి కాపాడేందుకు తానున్నానని భయం అవసరంలేదని ఇరాన్ అరబ్ దేశాలకు హామీనిచ్చింది.ఇరాక్ అద్యక్షుడు హసన్ రోహిని ఆ మేరకు తన ప్రసంగంలో హామీ ఇచ్చారు. ఇదే గాక విదేశాంగ మంత్రి కువైట్ తదితర దేశలలో పర్యటించుతున్నా
రు. కాగా బహరిన్ మాత్రం ఇరాన్‌ను వ్యతిరేకిస్తున్నది.మొత్తంపైన టెర్రరిజంపేరిట ముస్లిం దేశాలపై దాడిని కలసికట్టుగా ఎదుర్కోవడానికి ఇరాన్ చొరవ తీసుకోవడం అంతర్జాతీయంగా చెప్పుకోదగిన పరిణామం. షియాలు ఎక్కువగా వుండే ఇరాన్ నాయకులు ఇరాక్‌లో కూడా పర్యటించాలని భావిస్తున్నారు. సద్దాం హుస్సేన్ సున్ని గనక వ్యతిరేకించిన ఇరాన్ ఇప్పుడు అక్కడ షియా అనుకూల ఐఎస్‌ఐఎస్ మూడో వంతు భూభాగం స్వాధీనంలోకి తెచ్చుకోవడాన్ని స్వాగతిస్తూ సహకారం అందిస్తున్నది. ఇరాన్ అణ్వస్త్రాలు చేస్తున్నదనే ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత విదేశాంగ విధానంలో చొరవ పెంచడం విశేషం. ఈ విషయంలో చైనా రష్యాలు కూడా దానికి మద్దతు నిస్తున్నాయి. మొత్తంపైన అంతర్జాతీయ కూటములు కలయికల్లో ఆసక్తికరమైన పొందికలు పెరుగుతున్నాయి. వైరుధ్యాలు కూడా తీవ్రమవుతున్నాయి.