బెల్లు లెక్కకు చెల్లు!

bell11111
విపరీతమైన పని ఒత్తిడి కారణంగా జపాన్‌లో వేలమంది చనిపోతున్న వైనం
చెప్పుకున్నాం. ఉద్యోగులకు అతిభారీ లక్ష్యాలు నిర్ణయించి ఆ పైన వారి
సమర్థతను అంచనా వేయడం పేరిట ఎప్పటికప్పుడు వెంటాడ్డం ఆధునిక యాజమాన్యాలకు అలవాటుగా మారింది. ఉద్యోగులలో ఎక్కువ భాగం
ఎప్పుడూ సగటు గీతపైనే వుండిపోతారనీ కొద్ది మంది మాత్రమే బాగా పైకి
బాగా కిందకు మారుతుంటారని ఒక థియరీ. దీనికే బెల్‌(గంట) ధియరీ అని ముద్దుపేరు. గంట మోగించినపుడు అటూ ఇటూ వూగినట్టే అత్యుత్తమ అధ్వాన్న
ఉద్యోగులుగా ముద్రలు వేసి ప్రమోషన్లు డిమోషన్లు ఇస్తుంటారు. దీర్ఘకాలంగా అమలవుతున్న ఈ విధానం నిజానికి అంత మంచిది కాదన్న భావన ఇటీవలి కాలంలో పెరుగుతున్నది. ఏమంటే దీనివల్ల 70-75 శాతం మంది ఉద్యోగులు
ఎప్పటికీ సగటుదగ్గరే వుండిపోయి చేసినా లాభం లేదనే నిరుత్సాహానికి గురవుతున్నారు. నిజానికి
అధిక సంఖ్యలో వుండే అలాటి వారి వల్లనే కార్యాలయాలు నడుస్తుంటాయి. బెల్‌ పద్ధతిలో వారిని పూర్తిగా విస్మరించడం వల్ల పనులు దెబ్బతింటున్నాయి. ఇక పైనున్న వారు ఎలాగూ గుర్తింపు పొంది వున్నారు లక్ష్యం చేరినట్టే భావించి ఇక పని చేయకపోయినా కొంత కాలం అలాగే నడుస్తుందన్న అతి విశ్వాసం ప్రదర్శిస్తారు. చివరి రకం ఇంతగా డిమొట్‌ చేసిన తర్వాత మళ్లీ విశ్వాసం పొందలేమని భావించి పూర్తిగాచేతులెత్తేయడం లేదా సంస్థనుంచి బయిటకు వెళ్లిపోవడం కద్దు. ఒక అనారోగ్యకరమైన పోటీకీ, శాశ్వత దొంతరల సృష్టికి ఇది కారణమవుతున్నది.
కార్మిక ఉద్యోగ సంఘాలు ఎప్పటినుంచో చెబుతున్నా ఈ వాస్తవాలు ఒప్పుకోని యాజమాన్యాలు ఇప్పుడు తామే కళ్లు తెరిచి బెల్‌కు స్వస్తిచెబుదామని నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *