కోట్లాది అక్రమ ఖాతాల గుట్టు రట్టు

pnma1111
విదేశాల్లో దాచిన అక్రమ సంపద గురించి దేశంలోఎప్పటికప్పుడు విమర్శలు వినిపిస్తూనే వున్నాయి. అధికారంలోకి వస్తే వెంటనే ఈ నల్లధనాన్ని తెప్పిస్తానని మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం వాగ్దానం చేసినా అమలు కాలేదు. . అయితే ఈలోగానే అంతర్జాతీయ సంచలనంగా కొన్ని లక్షల అక్రమ ఖాతాల వివరాలను ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టులు సేకరించి విడుదల చేశారు. ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆప్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌ తరపున సాindian2222 putin2222గిన ఈ వేటలో భారత్‌ నుంచి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పాలుపంచుకుంది. పనామాలోని మోనికామిన్స్క్‌ అనే కన్సల్టింగ్‌ సంస్థ బూటకపు కంపెనీలకు సృష్టించి అక్రమ ఖాతాలను కాపాడే పనిలో ఆరితేరింది. దానిదగ్గర వున్న 2,14,480 ఖాతాలను ఐసిఐజె సంపాదించగలిగింది.కోటిన్నర మందికి సంబంధించిన మొత్తాలు వాటిలో వున్నాయి. రష్యా అద్యక్షుడు వ్లదీమర్‌ పుతిన్‌, ఐస్‌లాండ్‌ ప్రధాని స్పెయిన్‌ అధినేతతో సహా అనేకమంది అంతర్జాతీయ నేతలు ఈ జాబితాలో వున్నారు.
ఇక భారత్‌ నుంచి అమితాబ్‌బచన్‌, ఐశ్వర్యారారు, డిసిఎల్‌ కంపెనీ అధినేత కెపిసింగ్‌, ప్రముఖ న్యాయకోవిదులు హరీష్‌ సాల్వే, మాజీఅటార్నీ జనరల్‌ సోలీసొరాబ్జీ కుమారుడు జహంగీర్‌ సోరాబ్జీతో సహా డజన్ల మంది వ్యాపార వేత్తల పేర్లు వున్నాయి. మొత్తం 500 మంది భారతీయుల ఖాతాలు వెల్లడైనాయి. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వీరి పేర్లతో పాటు ఇచ్చినవివరణలు కూడా జోడించి కథనాలు ఇచ్చింది. తాము విదేశాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తామే తప్ప కస్టమర్లు ఎందుకు వాడుmossack కుంటారనేదానితో సంబంధం లేదని పనామాలోని మొసాక్‌ న్యాయసలహా సంస్థ స్పష్టం చేసింది. పనామాతోపాటు కెవిన్‌ఐలండ్‌, బెర్మూడాలలో కూడా ఈ తరహా నకిలీ ఖాతాలు నడిపి పన్ను ఎగవేసినట్టు వెల్లడైంది. దీనిపై సుప్రీం కోర్టు దీనిపై ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇన్వెస్టిగేటివ్‌ టీం అద్యక్షుడు అర్జిత్‌ పర్సాయత్‌ ఈ వివరాలు తమకు అందజేయవలసిందిగా కోరారు. ఇలాటి దుస్సాహసాలు సమస్యలు తెచ్చిపెడతాయని అక్రమ ఖాతాల స్వచ్చంద వెల్లడికి తాము ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుండేదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు.
ఇది ఇలా వుంటే రష్యా ప్రభుత్వం మాత్రం ఈ కథనాలను కొట్టి పారేసింది. పుతిన్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు ఇలాటి కుట్రలు ఏవో నడుస్తున్నట్టు తమకు తెలుసని అధికార ప్రతినిధి అన్నారు.కొద్ది రోజుల కిందట తలాతోక లేని ఏవో ప్రశ్నలు వస్తే తాము తోసిపారేశామని ఇప్పుడు ఈ ఆరోపణలు ప్రకటించారని ఆయన అన్నారు. మిగిలిన దేశాధినేతలు కూడా తమ లావాదేవీలలో తప్పులేదని సమర్థించుకున్నారు. ఏమైనా ఐసిఐజె పేల్చిన ఈ బాంబు పెనుదుమారం రేపడం తథ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *