గొప్పల కోరస్‌లు ఇప్పుడెక్కడీ

మన దేశంలో కొంతమందికి సరళీకరణ విధానాలంటే విపరీతమైన వ్యామోహం. ప్రపంచస్థాయిలో మోత మోగిస్తున్నామని వూగిపోతారు. కార్పొరేట్ మీడియా కూడా బడా సంస్థల లావాదేవీలకు ఎక్కడలేని ప్రచారమిచ్చి ఆకాశానికెత్తుతుంది. 2008లో టాటా స్టీల్స్ యూరప్‌లోని కోరస్ ఉక్కు ఫ్యాక్టరీలను కొన్నప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద టేకోవర్ అని మహాసంబరపడ్డారు. ఎదిగే భారత్ శక్తికి ఇది సంకేతమన్నారు. అంబానీల వంటి వారితో పోలిస్తే ఆదికాలం నుంచి అగ్రభాగాన వున్న పెట్టుబడిదారులైన టాటాలు మళ్లీ పుంజుకొంటున్నారనడానికి ఇదో నిదర్శనమని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు టాటాలు కోరస్‌ను వదిలించుకోవాలని నిర్ణయించడం ముఖ్యంగా బ్రిటన్ను కుదిపేస్తున్నది. ఇప్పటికి 200 కోట్ల పౌండ్లు నష్టం పేరుకుపోయిన కారణంగా ఇక సంస్థను నడపలేమని టాటాలు ప్రకటించారు.(బ్రిటిష్ పౌండ్ మారక విలువ రు.95పైనే) ఇంగ్లాండులోని టాల్బోట్‌లో వున్న కోరస్ కంపెనీని అమ్మకానికి పెడుతున్నట్టు టాటాల సిఇవో కౌశిక్ ఛటర్జీ ప్రకటించారు.2008 ఆర్థిఖ సంక్షోభం కారణంగా తాము తీసుకున్నప్పటి నుంచి నష్టాలు పేరుకుపోతున్నాయని ఉక్కు పరిశ్రమ మాంద్యంలో చిక్కుకుపోయిందని ఆయన తెలిపారు.వాస్తవానికి చైనా 2013, 2014 సంవత్సరాల్లో చేసిన ఉక్కు ఉత్పత్తి మాత్రమే 1870 నుంచి బ్రిటన్ చేసిన మొత్తం ఉత్పత్తిని దాటిపోతుందట! అదలా వుంచితే టాల్బోట్లోని టాటా కోరస్లో 15 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. దానిపై ఆధారపడిన వారు మరో 25 వేలమంది. కంపెనీని కాపాడేందుకు వారు ఒక పరిష్కారపథకం సూచించారు గాని యాజమాన్యం ఒప్పుకోలేదు.టాటా వంటి సంస్థక ఇలా అమ్మకం దారుడు దొరక్కుండానే మూసేయడం బాధ్యతారాహిత్యమవుతుంది అని కార్మిక నా
యకులు ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు. దీనికన్నా ముందు స్కాట్లండ్‌లోని ఫ్యాక్టరీలను టాటాలు ఆ ప్రభుత్వానికే విక్రయించారు. అయితే బ్రిటన్‌లో అలాటి అవకాశం లేదని ప్రధాని కామెరూన్ స్పష్టం చేశారు. కోరస్ మూత గురించి తెలియగానే ప్రభుత్వం పలుసార్లు చర్చలు జరిపింది. యూరోపియన్ యూనియన్ నిబందనల ప్రకారం జాతీయంచేయడం గాని, బెయిలవుట్ ఇవ్వడం గాని నిషిద్దం. కనకనే కార్మికులు ఉద్యోగులు వీధుల పాలవడం అనివార్యంగా జరుగుతుంది. మొత్తంగానే ఇనుము ఉక్కు పరిశ్రమ సంక్షోభం మరెన్ని మూసివేతలకు దారితీస్తుందోనని కార్మికులు భయపడుతున్నారు.