దేవుళ్లూ.. కుర్రాళ్లూ..

IndiaTvc23226_NaiduKanhaiya.

ౖ’అచ్చం మన తెలుగుబిడ్డ/ అభాకాం అధ్యక్షుడు/ సంజీవుని ఉపన్యాస /ఝంఝానిల ధాటి ముందు/ గతకాలపు అద్యక్షుల/ ఘనతలు తలవంచినాయి’ అని ఒకప్పుడు వికటకవి గజ్జెల మల్లారెడి కాంగ్రెస్‌ అద్యక్షుడు నీలం సంజీవరెడ్డిపై ్డ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు – ‘దేవుడు మనకిచ్చినట్టి/ మహావరం మోడియీంచు/ వెంకయార్య వినిపించిన/ వేదవాక్య ధాటిముందు/ ఇందిర కీర్తన పాడిన/ బారువాలు బావురనిరి’ ఇందిరే ఇండియా అన్న దేవకాంత బారువా భజన కన్నా నరేంద్ర మోడీ దేవుడిచ్చిన కానుక అన్న వెంకయ్య మాట నిజంగానే వేయిరెట్లు పెద్దది కదా! అసలు నరేంద్ర మోడీని నమో నమో అంటూ నమ:శ్శివాయ స్థాయికి తీసుకెళ్లడం ఎప్పుడో జరిగింది. మోడీపై వ్యతిరేకతను దేశంపై వ్యతిరేకతగా మార్చారని ప్రసార భారతి ‘స్వతంత్ర’ అద్యక్షుడు ఎ.సూర్యప్రకాశ్‌ చేసిన వ్యాఖ్య. అందులో ఆయననే దేశంగా చిత్రిస్తే వెంకయ్య నాయుడు ఏకంగా దైవదూతగా చేశారు. ఈ భజన ఆరెస్సెస్‌ పీఠాధిపతులు కూడా భరించలేక మందలించారని వినికిడి(నెల్లూరు జిల్లాలో మందలించడమంటే పరామర్శించడం కూడా) మోడీ గురించి ప్రజలు అలా అనుకుంటున్నారని తాను చెబితే మీడియా తప్పుగా రాసిందని వెంకయ్య నాయుడు షరామామూలుగా వివరణ ఇచ్చినట్టు ఒక సమాచారం. వాస్తవానికి గతంలో వాజ్‌పేయి ప్రధానిగా వుండగా ఆయన వికాస్‌ పురుష్‌ అనీ, అద్వానీ లోV్‌ాపురుష్‌ అని కీర్తించి రాజకీయ ప్రతిష్టంభనకు కారణమైన తీరు కూడా అందరికీ తెలుసు. ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అవకాశమొచ్చినప్పుడల్లా ఆకాశానికెత్తి మాట్లాడ్డం ఆయన అనుయాయులే భరించలేమంటున్నారు. అయినా ఎవరినైనా ఎంతైనా పొగిడేందుకు ఆయనకున్న స్వేచ్చను మనం కాదనలేం!

కాకపోతే మోడీని, చంద్రబాబును అదేపనిగా పొగిడే వెంకయ్య నాయుడు కన్నయ్య వంటి కుర్రాళ్లపై పదేపదే దాడి చేయడమే విపరీతం.కాంగ్రెస్‌ కొత్తకొత్త హీరోలను తయారు చేస్తున్నదని ఇటీవలి ఘటనల తర్వాత ఆయన అపహాస్యం చేశారు. రోహిత్‌ అయినా కన్నయ్య అయినా కాంగ్రెస్‌ చేసిన హీరోలు కాదు. వారి భావజాలం స్థూలంగా దళిత వాదానికి వామపక్ష స్రవంతికి చెందిందని తెలిసీ కాంగ్రెస్‌తో ముడిపెట్టడం ఒక కపటం. అదలా వుంచితే వారిని నిర్బంధానికి గురిచేసి నిలిచి పోరాడాల్సిన పరిస్థితి కల్పించింది కూడా మోడీ సర్కారే. రోహిత్‌ తన బలిదానంతో కదలిక తీసుకొస్తే కన్నయ్య కేంద్రం నిరంకుశత్వాన్ని రాజకీయ దుష్ప్రచారాలను ధైర్యంగా ఎదుర్కొని నూతనోత్తేజానికి సమకాలీన ప్రతీక అయ్యారు. ౖ దేశద్రోహం ముద్ర వేసిన వారిమొహం వాచేలా ప్రగతిశీల దేశభక్తికి నూతన నిర్వచనాలిచ్చిన యువ కిశోరం తను. అలాటివారిని విలన్లుగా విద్రోహులుగా చిత్రించేందుకు పన్నిన నానా కుట్రలూ విఫలమైనాయి గనకనే వారు హీరోలుగా కనిపిస్తున్నారు. సీనియర్‌ కేంద్ర మంత్రులుగా వున్న వారు ఈ పరిస్థితికి కారణమైన తమ కుత్సితాలకూ కుటిల నీతులనూ సరిచేసుకునే బదులు నవయువకులపై విరుచుకుపడటం విషం కక్కడం విజ్ఞత అవుతుందా? అసలు విద్యార్థి ఉద్యమాలే పొరబాటైనట్టు విద్యార్థులు రాజకీయాలతో పెడతోవ పడుతున్నట్టు ఆరోపించడం ఇంకా విచిత్రం. ఎందుకంటే ఆంధ్రా యూనివర్సిటీలో వెంకయ్య నాయుడు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చంద్రబాబు నాయుడుతో సహా అనేకులు తమవైన రాజకీయ భావాలతోనే రంగ ప్రవేశం చేసి పైకొచ్చారు. తమకైతే రాజకీయాలు లేదా తమవైతే రాజకీయాలు తప్ప ఇతర ఏ భావాలూ వుండకూడదని ఎవరైనా కోరుకుంటే అంతకన్నా అప్రజాస్వామికం ఏముంటుంది? హైదరాబాదులోనైనా ఢిల్లీలోనైనా ఇంత చిచ్చుకూ మూలకారణమైంది ఎబివిపి ఫిర్యాదులు వాటిపై కేంద్ర మంత్రుల స్పందనలే కదా?వాటిలో రాజకీయం లేదా? విద్యార్థి సంఘాల విభేదాలుగానే వదలివేసి వుంటే ఇక్కడి దాకా వచ్చేదా?

హెచ్‌సియు పరిణామాలలో ప్రధాన నిందారోపణలు ఎదుర్కొంటున్న విసి అప్పారావును లోపాయికారిగా లోపలికి రప్పించడం ఏ విధంగానూ సమర్థనీయం కానేరదు. తప్పక తీసుకురావాలనుకుంటే అధికారికంగా వివరణ ఇచ్చి అందరితో మాట్లాడి ముందుకుపోవాలి గాని ఏకపక్షంగా నిగూఢ రీతిలో తీసుకొచ్చి అస్మదీయులతో ఆంతరంగికంగా మంతనాలు జరిపితే విద్యార్థులకు ఆగ్రహం కలగదా? అప్పుడైనా వారితో సామరస్యంగా మాట్లాడి పరిష్కరించేబదులు తెలంగాణ ప్రభుత్వం పోలీసులను దించి ఆస్పత్రుల పాలయ్యేంతగా కొట్టడం ఇంకా దారుణం. ముఖ్యమంత్రులుగా కెసిఆర్‌ గానీ, చంద్రబాబు గాని వారి వారి మంత్రులు గాని ఇంతవరకూ హెచ్‌సియును సందర్శించి సామాజిక న్యాయ నినాదానికి మద్దతు పలక్కపోగా ఇప్పుడు రాష్ట్ర పోలీసులు విసి అప్పారావుకు మద్దతుగా ఆగమేఘాల మీద దిగిపోయారు. ఇంతకూ విసిగా ఈయన నియామకం కూడా వెంకయ్య నాయుడు ప్రాపకం వల్లనే జరిగిందనేది బహిరంగంగా చెప్పుకుంటున్న మాట. దీనిపై బిజెపి నేతలే చాలా మంది అసంతృప్తి వెలిబుచ్చారు. ఇప్పుడు కూడా ఆయనను తిరిగి తీసుకురావడం కోసం మనమెందుకు ఇంత వ్యతిరేకత కొనితెచ్చుకోవడం సరికాదంటూ తాను కేంద్రానికి మెసేజ్‌ పంపించానని బిజెపి ముఖ్యులొకరు నాతో అన్నారు. ఈ మధ్యలో కొత్త విసి నియామకంకోసం కొన్ని పేర్లు షికారు చేసిన సంగతి కూడా అధికార వర్గాలలో కొందరికి తెలుసు. అయినా మళ్లీ అన్యథా శరణం నాస్తి అన్నట్టే ఆ వివాదాస్పద వివక్షాయుత వ్యక్తినే తీసుకొచ్చి విద్యార్థులపై దాడి చేయడం దిగ్భ్రాంతికలిగిస్తుంది. కన్నయ్య ఎందుకొచ్చాడు ఎందుకు రావాలి అని విమర్శించే వారు విసీగా ఆయననే మళ్లీ పంపించి మంటలు ఎగదోయడమెందుకునే ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు? కన్నయ్య కుమార్‌ అక్కడకు వచ్చి రోహిత్‌కు నివాళి అర్పిస్తే ఏం ప్రమాదమని అడ్డుకున్నారు? అసలు తను లోపలికి వెళ్తానని అడగనే లేదని పోలీసు ఉన్నతాధికారి నమ్మబలకడం ఎంత హాస్యాస్పదం? వచ్చిందే అందుకైతే ఆ మాట అడక్కుండా వెళ్లిపోతాడా?
హెచ్‌సియు ఉదంతంలో దళితులు, వెనకబడిన వారిపట్ల వివక్ష సమస్య దేశమంతటి దృష్టికి రావడంతో కేంద్రం వెనక్కు తగ్టినట్టు నటించింది. ఇక్కడ అప్పారావును సెలవువై పంపించి అక్కడ జెఎన్‌యులో నిప్పు రాజేసింది. రెండు చోట్ల అగ్గిపుల్ల గీచే పని తమ విద్యార్థిసంస్థకే అప్పగించి ఆ పైన అధినేతలు రంగంలోకి దిగారు. మంత్రులు స్వయానా లేఖలు తాఖీదులు పంపించి అధికారులను అదరగొట్టారు. ఆ పైన పోలీసులనూ నిఘా సంస్థలనూ దించారు. ప్రతిచోటా కుల దురహంకారం కాదనలేని నిజం గనక, రోహిత్‌ దళితుడు కాదనే వాదన పెద్దగా పనిచేయలేదు గనక జెఎన్‌యులో దేశద్రోహం అనే కొత్త పాచిక తీేశారు. మన పిల్లలనే జాతి వ్యతిరేకులుగా చిత్రించేందుకు వెనుకాడలేదు. ఇంత చేసినా ఇప్పటి వరకూ హెచ్‌సియులో గానీ, జెఎన్‌యూలో గాని విద్యార్థులెవరూ దేశ ద్రోమ నినాదాలు చేసినట్టు ఒక్కటంటే ఒక్క ఆధారం చూపింది లేదు. అధికారిక నివేదికలు గాని దర్యాప్తు సంఘాల నిర్దారణలు గాని ఒక్కటంటే ఒక్క ఆరోపణను నిరూపించలేదు. రేపైనా అంతేనని వారికి బాగా తెలుసు. కనుకనే మళ్లీ హెచ్‌సియులో అగ్నికి ఆజ్యం పోసేందుకు సిద్ధమైనారు. ఇన్నివారాలు పోరాడుతున్నా ఎలాటి దౌర్జన్య ఘటన లేకపోవడం విద్యార్థుల బాధ్యతాయుత ప్రవర్తనను తెల్పుతుంది. అయినా వారిని రెచ్చగొట్టేందుకే విసిని మళ్లీ తీసుకొచ్చి ప్రశాంతతను భగం చేశారు. ప్రతిఘటించిన వారిపై లాఠీలు ప్రయోగించి అన్నం పళ్లేలు లాగేసుకున్నారు. రూములకు తాళాలు వేశారు. ఈ స్థితిలో విద్యార్థి సంఘాలే వారిని ఆదుకోవలసి వచ్చింది. ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత అత్యున్తన ప్రతిష్గాత్మక సంస్థల్లోనే పరిస్థితి ఇంత అప్రజాస్వామికంగా మారినందుకు సిగ్గుపడవలసిందిపోయి విద్యార్థులు హీరోలయ్యారని ఆడిపోసుకోవడం అర్థరహితం. ఎవరేమన్నా నిస్పందేహంగా వారే రేపటి మన హీరోలు. దేశానికి నిజమైన కానుకలు. వెంకయ్య నాయుడి గారి దృష్టిలో మోడీ దేవదూత కావచ్చు గాని వాస్తవికంగా ఆలోచించేవారెవరైనా ఈ యువ నేతలనే ముందు యుగం దూతలుగా పావన నవజీవన బృందావననిర్మాతలుగా ఆదరిస్తారు. అభిమానిస్తారు. ఒకప్పుడు విద్యాలయాల గోడలపై విలసిల్లిన మహాకవి శ్రీశ్రీ వాక్యాలు మళ్లీ ప్రత్యక్షమవుతాయి. రాజకీయ భజనలు తెరమరుగై విద్యార్థి యువజన చైతన్యం వర్థిల్లుతుంది. చరిత్ర హీరోలను సృష్టిస్తుంది గాని హీరోలే చరిత్ర సృష్టించరు. (ఆంధ్రజ్యోతి గమనం, 24.3.16)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *