రవి శంకర్ రాందేవ్ పోటి
దేశ రాజధానిలో కొత్త కోణాన్ని ముందుకు తెచ్చాయి. అనేక వివాదాలు ముసిరినా ప్రధాని మోడీ , వెంకయ్య నాయుడు వంటివారు రవి శంకర్ గురువు వేడుకలకు హాజరై ప్రసంసలు కురిపించారు. ఆ తర్వాత అక్కడ కళాప్రదర్సనలు ఇచ్చేందుకు వచ్చిన వారుకూడా విమర్శలు చేసారు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన కథాకళి నర్తకి ఓల్గా చేపలేన్స్కియా అసలు పాల్గోనకుండానే నిరసనగా తిరిగి వెళ్ళారు. తన సమయం వృథా అయిపోయిందని బాధ పడ్డారు. పిల్లలలను తెచ్చిన తలిదండ్రులు టీచర్ల బాధ వర్ణనాతీతం. ఆ బురదలో దోమల తాకిడికి జ్వరాలు వచ్చాయి. బాధ్యతా తీసుకొని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తమైంది. పాశ్చాత్య దేశాల వారి శృంగార దృశ్యాలు వెగటు తెప్పించాయి. .
మోడీ జనాకర్షణ కోసమే రవి శంకర్ బాబా రాందేవ్ వంటి వారి చుట్టూ తిరుగుతున్నారని సీనియర్ ఎడిటర్ ప్రభు చావ్లా వ్యాఖ్యానించారు. వీరిలో ఒకరు పై తరగతుల వారిని మరొకరు దిగువ , మధ్య తరగతుల వారిని ఆకట్టుకోవాదానికి అక్కరకు వస్తారని అయన రాసారు.
ఇక ఈ గురువుల మార్కెట్ పోటి గురించి మింట్ పత్రిక కథనం ప్రచురించింది. బాబా వ్యాపార విజయం చుసిన శ్రీ శ్రీ అంటే రవి శంకర్ తన ఆయుర్వేద ఉత్పత్తులను భారీగా మార్కెట్ చేయాలనీ భావిస్తున్నారట. బాబా రాందేవ్ పతంజలి ఉత్పత్తులు టీవీ లలో అత్యధిక సమయం తీసుకుంటున్నాయని సర్వేలో తేలింది. తన శ్రీ శ్రీ ఆయుర్వేద ట్రస్ట్ ( ఎస్ ఎస్ ఎ) కూడా ఆ స్థాయికి చేరాలని పెట్టుబడులు పెడుతున్నారట. యోగ , ఆయుర్వేద మతానికి సంబంధించినవి కావు గాని ఆ పక్కనే వీరు మత ఆధ్యాత్మిక క్రతువులు నడపడం బిజెపి ని బలపరచడం తెలిసిన విషయమే. పరిపూర్నానంద స్వామి మోడిపై పుస్తకమే రాసారు. అది టిటిడికి ప్రాంగణంలోని పుస్తకశాలల్లో విక్రయిస్తున్నారు. అయన ఒక ఛానల్ కుడా నడుపుతున్నారు.. జీయర్ స్వామితో సహా పలువురికి కెసిఆర్ తో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం తెలిసిందే. ఇదం ధర్మం ఇదం వ్యవహారం ..తథాస్తు.
