న్యూస్ టు నోట్…
. కేరళలో ఎన్నికల వేళ సిపిఎం మాజీ శాసనసభ్యుడు జయరాజ్‌ను అరెస్టు చేయడం రాజకీయంగా సంచలనం కలిగించింది. 2014లో ఆరెస్సెస్ కార్యకర్త మనోజ్ హత్య కేసులో 25వ నిందితుడుగా ఆయనను సిబిఐ కస్టడీలోకి తీసుకున్నారు. 2012లో ఒక ముస్లింలీగ్ కార్యకర్త హత్య కేసులోనూ జయరాజన్ అరెస్టయి బయిటకు వచ్చారు. రాజకీయంగా ఇది సిపిఎంకు కొంత నష్టం కలిగిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆదివారం కూడా కన్ననూర్‌లో బిజెప్‌ి కార్యకర్త ఒకరిని కత్తితో పోడిచారు. కన్ననూర్ జిల్లాలో మొదటినుంచి సిపిఎం ఆరెస్సెస్‌ల మధ్య ఘర్షణ హత్యలు జరుగుతున్నాయి. అయితే జయరాజన్‌ను ఇంటరాగేషన్ చేసేప్పుడు సంబంధిత సిబిఐ అధికారి మాత్రమే వుండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యుడిఎప్ ప్రభుత్వం ఈ కేసును రాజకీయంగా ఉపయోగించుకుంటున్నదనే ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఇలా ఆదేశించింది.
.
.ఇపిఎప్‌పై పన్ను విధిస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదన చేసిన ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ
.కార్మిక సంఘాలు ప్రతిపక్షాల నుంచి వచ్చిన నిరసనతో వెనక్కు తగ్గారు. ఇది తన విజయమేనని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రకటించుకున్నారు కాని నిజానికి కార్మిక ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వ్యతిరేకతతోనే ప్రభుత్వం సంకోచించింది. అయితే తాను ఎక్కువ మందిని జాతీయ పెన్షన్‌పథకంలో చేరేలా ప్రోత్సహించేందుకోసమే ఈ ప్రతిపాదన చేశానని జైట్లీ ఇంకా సమర్థించుకోవడం కొసమెరుపు.బడ్జెట్‌లోని మరిన్ని ప్రజా వ్యతిరేక ప్రతిపాదనలు కూడా చర్చ సందర్భంలో విమర్శకు గురవడం తథ్యం.
.నిన్న డియోజియో సంస్థనుంచి విజరుమాల్యాకు వచ్చే స్వీట్‌హార్ట్ ఒప్పందం మొత్తాన్ని ట్రిబ్యునల్ స్తంభింపచేస్తే ఈ రోజు ఆయన విదేశాలకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది.
.రిలయన్స్ ముఖేష్ అంబానీ కేబుల్ వ్యాపారంలో 20బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా మీడియా రంగం మొత్తంపై అదుపు సాధించే దిశలో అడుగులు వేస్తున్నారు. దీనివల్ల స్థానిక కేబుట్ ఆపరేటర్ల సంగతి అటుంచి తమ్ముడు అనిల్ అంబానీ రిలయన్స్ కాంకు కూడా సవాలు ఎదురవుతుందని భావిస్తున్నారు.
.విశ్వవిద్యాలయాలలో జోక్యం ద్వారా కేంద్రం ఫాసిస్టు వ్యవస్థను రుద్దేందుకు పథకాలు వేస్తున్నదని రాజ్యసభలో జరిగిన చర్చలో సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి తదితరులు విమర్శించారు.
.తెలుగుదేశం పార్టీలో మిగిలిన అయిదుగురిలోనూ మరో ఇద్దరు అరికెపూడి గాంధీ, మాగుంట ి గోపీనాథ్‌లు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది.వీరిద్దరూ చేరతారన్నది చాలా కాలంగా తెలిసిన విషయమే. ఇక చివరకు రేవంత్ రెడ్డి మాత్రమే టిటిడిపిలో మిగలవచ్చునన్నది జనవాక్యం. ఆయన కూడా సామాజిక వర్గం పేరిట చాలా కాలంగా కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నారనేది మరో ఆరోపణ.ఇప్పటికైతే ఆయన గట్టిగానే మాట్లాడుతున్నారు.
.యమునా తీరంలో శ్రీశ్రీ రవిశంకర్ ఆర్ట్‌ఆఫ్‌లివింగ్ షోకు వెళ్లరాదని రాష్ట్రపతి నిర్ణయించుకున్నారు.కాని ఆయన మాత్రం తమ కార్యక్రమం వల్ల పర్యావరణకు ఎలాటినష్టం జరగదని గట్టిగా సమర్థించుకుంటున్నారు.నేసనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంరాలను కూడా ఆధ్యాత్మిక గురువు అంత తేలిగ్గా కొట్టివేయడం ఆశ్చర్యకరం.
