వివా.. క్యూబా… వెల్‌కం ఒబామా..

వివా.. క్యూబా… వెల్‌కం ఒబామా.Obama_castro_2741532f

దాదాపు ఎనభై ఏళ్ల తర్వాత అమెరికా అద్యక్షుడు సోషలిస్టు క్యూబా గడ్డపై అడుగు పెట్టబోతున్నాడంటే అంతర్జాతీయ సంచలనం కాదూ? త్వరలో పదవీ కాలం పూర్తికాబోతున్న అద్యక్షుడు బారక్‌ ఒబామా మార్చిలో క్యూబా వెళతారని ఎబిసి వార్తాసంస్థ వెల్లడించింది. గత ఏడాది క్యూబా అద్యక్షుడు రావుల్‌ కాస్ట్రో తొలిసారి అమెరికాలో దౌత్యపర్యటన జరిపారు. క్యూబాలో 1959లో కాస్ట్రో చేగువేరా బృందం అధికారం చేపట్టిన నాటినుంచి ఆర్థిక ఆంక్షలు విధించి వేధించినా అమెరికా వారి మార్గం మళ్లించలేకపోయింది. అమెరికాకు అతి సమీపంలో వుంటూనే సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నం తర్వాత కూడా సోషలిజాన్ని వదులుకోవడానికి నిరాకరించిన క్యూబా దాని అద్యక్షుడు ఫైడెల్‌ కాస్ట్రోలు ప్రపంచానికి ఉత్తేజసూచికలయ్యారు.గత దశాబ్ది కాలంలో వెనిజులాలో హ్యూగో చావేజ్‌తో సహా అనేక మంది అమెరికా ఆధిపత్య వ్యూహాలను వ్యతిరేకిస్తూ క్యూబాతో చేతులు కలిపారు.రావుల్‌ కాస్ట్రో వెళ్లినప్పటి పరిస్థితి అది. ఇప్పుడు ఆ ప్రభుత్వాలు కూడా వరసగా ఓడిపోతున్నాయి. కాని డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా ముందుపీఠిన వున్న బిన్నీ సాండర్స్‌ సోషలిజం భావాల పేరుతో ప్రచారం చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒబామా ఈ నిర్ణయం తీసుకోవడం రానున్న అద్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపించే అంశమే అవుతుంది. అందుకే రిపబ్లికన్‌ అభ్యర్థుల ఎంపికలో ముందున్న ట్రంప్‌ ఒబాబా నిర్ణయంపై నిప్పులు కక్కుతున్నారు. తాను మానవ హక్కుల సమస్య తప్పక మాట్లాడతానని ఒబామా అంటుంటే ఆర్థిక ఆంక్షల తొలగింపు మా ప్రధమ ప్రాధాన్యత అని క్యూబా చెబుతున్నది. ఏమైనా మేము రాత్రికి రాత్రి మారిపోము కదా అని క్యూబా విదేశీ వాణిజ్యమంత్రి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *