పొగడ్తలలో పోటీ లేని అనిల్‌ అంబానీ

పొగడ్తలలో పోటీ లేని అనిల్‌ అంబానీanil babu anil modi

రిలయన్స్‌ అధినేత అనిల్‌ అంబానీ వ్యాపార వ్యవహారాలు జనాకర్షణ, ప్రజా సంబంధాలు వంటి వాటిలోనే కాదు- పొగడ్తలలోనూ ఆరితేరినవారే. విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సులో చంద్రబాబును మాత్రమే గాక ఆయన కుమారుడైన లోకేష్‌ను కూడా విపరీతంగా ప్రశంసించేశారు. చంద్రబాబు దార్శనికతను తన తండ్రి ధీరూబారు అంబానీతో అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. ఇక లోకేష్‌తో మాట్లాడిన మేరకు తిరుగులేని విద్యార్హతలు, దూరదృష్టి గల అలాటి యువనేత వున్నందువల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు భవిష్యత్తులో నాయకత్వ సమస్య రాబోదని వారసత్వమూ తేల్చిపారేశారు. సభలూ సమావేశాల్లో నాలుగు మంచి ముక్కలు చెప్పడం తప్పు కాదని అతిగా పొగిడితే అపహాస్యమవుతుంది.
విశేషమేమంటే సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే 2013లో ఇదే జనవరి నెల 13వ తేదీన గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఇంతగానూ పొగడ్తలతో ముంచెత్తారు. కాకపోతే మరో అడుగు ముందుకేసి మహాత్మాగాంధీతోనే పోల్చారు. అప్పటికి మోడీ ఇంకా ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబడలేదు గాని దాని తర్వాత ఖాయమని అర్థమై పోయింది. అప్పుడు కూడా తన తండ్రి ధీరూభారు ప్రసక్తి తెచ్చారు. వాస్తవానికి అటు మోడీ ఇటు చంద్రబాబు ఉభయులతోనూ అంబానీలకు రిలయన్స్‌కు దీర్ఘకాలికంగా ప్రగాఢమైన సంబంధాలున్నాయి. తెలుగుదేశంతో పొత్తుపై మోడీకి పెద్ద ఆసక్తి లేకున్నా ఒప్పించడంలో ఇవి పాత్ర వహించాయని చెబుతుంటారు. విశాఖ ప్రశంసల పర్వం చూస్తుంటే ఇవన్నీ కట్టుకథలు కాదనే అనిపిస్తుంది.

నీ స్నేహితులు ఎవరో చెబితే నీవు ఎలాటి వాడివో చెబుతానని ఒక ఇంగ్లీషు సామెత. కార్పొరేట్‌ మహాకుబేరులకు ఇంతగా నచ్చిన నాయకుల విధానాలు ఏ దిశలో వుంటాయో వేరే చెప్పాలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *