అచ్చేదిన్‌కాదు.. కక్షే దిన్‌.. అసహన్‌!

అచ్చేదిన్‌ పేరిట కేంద్రంలో అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ ఆచరణలో తెచ్చిన కక్షేదిన్‌ చరిత్రలో మున్నెన్నడూ చూడలేదని దేశం ఘోషిస్తున్నది. చారువాలా గారువాలాగా మారిపోయిన ఉదంతానికి భరత మాత విస్తుపోతున్నది. నాలుగేళ్లపాలనలో ప్రతి రోజూ ప్రతి రంగం మత విద్వేషంతో కమిలిపోతున్నది. నిత్య జీవితమూ రాజకీయమూ సమాజ గమనమూ మాత్రమే గాక విద్యా పరిశోధన వైజ్ఞానిక రంగాలు కూడా మతం రంగు పులుముకున్నాయి. విద్యా సంస్థలు విద్వేష కేంద్రాలైనాయి. జనాభాలో సగమైన మహిళలు, బహుజనులనిపించుకున్న దళిత బలహీనవర్గాలూ, దిశా నిర్దేశంచేసే మేధావులు బుద్దిజీవులూ, రాజ్యాంగం రక్షించాల్సిన ఆదివాసులు అల్పసంఖ్యాకులూ ఇలా ప్రతి తరగతిపైనా ప్రతీప శక్తులు దాడులుచేస్తున్నాయి.
”ఇలాటి మాటల్లో ఉద్దేశం ఏమిటి? ఆయన హిందూస్థాన్‌కే రాజు. ఆయన తల్చుకుంటే ఈ హత్యలను ఆపలేరా? ఒక్కరాత్రిలోనే నోట్లన్నీ రద్దు చేసిపారేయలేదా?” అని ప్రశ్నించాడు జలాలుద్దీన్‌. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌ జిల్లా ఖండేవాలీ గ్రామంలో హిందూత్వ ఛాందస ముఠా ఊచకోతకు గురైన 16 ఏళ్ల జునాయిద్‌ ఖాన్‌ తండ్రి ఆయన. గోరక్షణ పేరిట జరిగే హత్యలను మహాత్మాగాంధీ ఆమోదించివుండేవారు కాదని ప్రధాని మోడీ సబర్మతి ఆశ్రమంలో సన్నాయి నొక్కులు నొక్కడంపై ఆ తండ్రి ఆవేదన అది.చాలా ఆమాయకంగా అడిగిన ఈ ప్రశ్న నిజానికి దేశంలో పరిస్థితికి చక్కటి ప్రతిబింబం. మరోవైపున ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేంద్ర సచార్‌ ఇదే పరిస్థితిని ఇలా సూటిగా చెప్పేశారు:” దీన్ని కేవలం అసహనం అనడం ఇంకెంతమాత్రం కుదరదు.భారత దేశంలో మైనారిటీలను నిర్మూలించి ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు కోరుకున్నట్టుగా హిందూరాష్ట్రను ప్రకటించడమే దీని ఉద్దేశం” 2005లో ముస్లింల పరిస్థితులపై అధ్యయనం చేయడానికి నియమితమైన కమిటీకి ఆధ్వర్యం వహించిన జస్టిస్‌ సచార్‌ కంటే ఈ సమస్య తీవ్రత మరెవరూ అర్థం చేసుకోలేరు.
పశుమాంసం తిన్నాడన్న అనుమానంతో జునాయిడ్‌ ఖాన్‌ను గడ్డం పట్టి లాగి కొట్టి చంపడమే గాక అతని కపాలాన్ని తొక్కి తొక్కి ఆనందించారని కథనాలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన తర్వాత దేశ వ్యాపితంగా నిరసన పెల్లుబికింది. నా పేరుతో చేయొద్దు అంటూ దేశంలోని 17 నగరాల్లో యువత ప్రదర్శనలు చేశారు. కాని అదే సమయంలో జార్ఖండ్‌లోనూ ఇలాటి హత్య మరొకటి జరిగింది. మూడేళ్లలో మొత్తం ముప్పై మందికి ఆవుల పేరిట హత్య గావించబడ్డారు. గుజరాత్‌లోని ఉనా వంటి చోట్ల దళితులపై సాగిన హింసాకాండ దేశవ్యాపిత సంచలనమైంది. కాని మోడీ మాత్రం ముచ్చటగా మూడు సార్లు ముక్తసరి ప్రస్తావనలతో సరిపెట్టారు. మరోవైపున ఆరెస్సెస్‌ సర్వాధినేత మోహన్‌ భగవత్‌ గో రక్షణకు చట్టం తీసుకురావాలని ఆదేశించగా ప్రభుత్వ పశువధపై ఆంక్షలు ప్రకటించింది.దీనివల్ల పశుచర్మం శుద్ధి చేసుకుని విక్రయించి జీవించే దళితుల జీవనోపాధిపైనే దెబ్బ పడింది. పైగా మృతపశువులను తొలగించలేదంటూ వారిపై అగ్రవర్ణాల దాడులు పెరిగాయి. దళితులపై అత్యాచారాల నిరోధ చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టును అడిగిమరీ సడలింపచేశారు. తర్వాత నిరసనకు జడిసి మళ్లీ తామే వ్యతిరేకంగా వెళ్లి చివాట్లు తిన్నారు.ఆదివాసులను వనవాసులుగా అవమానించేవీరు వారి రక్షణ కోసం ఉద్దేశించిన కంపా చట్టాన్ని, గనుల చట్టాన్ని కూడా సడలించారు. చోటానాగపూర్‌ సంథాలుల హక్కులకు చేటు తెచ్చారు. సైద్ధాంతికంగా బిజెపి ఆరెస్సెస్‌ల తిరోగమన వాదం ఫలితాలే ఇవన్నీ. మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంలోనే దీనదయాళ్‌ ఉపాధ్యాయను తప్ప అంబేద్కర్‌ను తల్చుకోలేదు.
అరవై ఏళ్ల స్వాతంత్రంలో ఏనాడూ ఎరుగని ఈ పరిస్థితి మోడీ హయాంలోనే ఎందుకొచ్చిందనేది పెద్ద ప్రశ్న. సమాధానం సులభమే. దేశంలో మొదటిసారి బిజెపికి స్వంతంగా మెజార్టి వచ్చింది గనక. దేశంలో మతతత్వ రాజకీయాలకు మూలపీఠమైన ఆరెస్సెస్‌ విహెచ్‌పిల విజృంభన 1967లో గో సమస్యపైనే మొదలైంది గనక! ఆ రోజున విహెచ్‌పి సాధువులు ఏకంగా ప్రధాని నివాసంపైనే దాడికి దిగారు. అప్పటి నుంచి తదుపరి యాభై ఏళ్లలోనూ కాంగ్రెస్‌ , వివిధ ప్రాంతీయ పార్టీల అవకాశవాదం పలితంగా పెరిగిన హిందూమతతత్వ కూటమి ఆరెస్సెస్‌ బిజెప పూర్గిగాి అధికార పగ్గాలు చేపట్టింది గనక. 8 రాష్ట్రాలకు పరిమితమైన ఆ శక్తి ఇప్పుడు ఏకంగా 20 రాష్ట్రాలలో స్వంతంగానో భాగస్వామ్యంతోనో పాలన చేస్తున్నది గనక తన విద్వేష పూరిత వివక్షతా విధానాలను విచ్చలవిడిగా రుద్దుతున్నది.
మోడీ ప్రధాని అభ్యర్థి అవుతారన్న వాతావరణంలో మహారాష్ట్రలో గోవింద పన్సారే హత్య జరిగింది. ఆయన ప్రధాని అయ్యాక అక్కడే … కర్ణాటకలో కల్బుర్గి హత్యలు జరిగాయి. కొద్ది మాసాల కిందట గౌరీ లంకేశ్‌ ప్రాణాలు తీశారు. వీరంతా హేతువాదులు హిందూమతోన్మాద వ్యతిరేకులే. (తమను ప్రశ్నించే వారిని లేకుండా చేయడం అందుకోసం హంతక ముఠాలను పురికోల్పడం సంఘ పరివార్‌ 1948జనవరి 30 మహాత్మాగాంధీ హత్యనాటికే మొదలుపెట్టింది.) ఈ విధమైన విద్వేష హత్యలకు వ్యతిరేకంగా రచయితలూ కళాకారులూ తమ అవార్డులు వెనక్కు ఇచ్చి నిరసన తెల్పడంతో వారిపైనా దుష్ట్రచారం చేసింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ల ప్రేరణతో వీరంతా వ్యతిరేకిస్తున్నారని అసత్యాలు గుమ్మరించింది. నేరుగా తమను వ్యతిరేకించిక పోయినా స్వతంత్రంగా ఆలోచించే రచయితలు దర్శకులపై దాడులు నిత్యకృత్యమైనాయి. పద్మావతి చిత్రం విడుదల కాకముందే షూటింగ్‌ దశలోనే దాడి చేసి తర్వాత సెన్సార్‌ దశలోనూ ముప్పు తిప్పలు పెట్టారు. థియేటర్లు ధ్వంసం చేశారు. తీరా ి ఆ చిత్రం రాజపుత్రులను కీర్తించే పునరుద్ధరణ దిశలోనే వుండటంతో మౌనం పాటించారు. అంతకుముందు పికెపైనా అదే దాడి జరిగింది. చిత్రకారులు క్రీడాకారులు నటీనటులు పాత్రికేయులు ఎందరో ఈ తరహా దాడులకు గురైన పరిస్థితి గతంలో లేదు.
ఈ తరహా విద్వేషాలు వివక్షతలు కలిపి విశ్వవిద్యాలయాలపై ప్రయోగించడం మరో విపరీత పరిస్థితికి దారి తీసింది.హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో దళితులపై వివక్షత వేధింపులు బహిష్కరణలూ ప్రతిభావంతుడైన రోహిత్‌ వేములను బలిగొన్నాయి. దేశమంతా రగిలిపోవడంతో మోడీ కూడా మొసలికన్నీరు కార్చారు.కాని ఆయన అనుయాయులు మాత్రం అప్పటికీ ఇప్పటికీ అదే విద్వేష కాండ సాగిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన జెఎన్‌యులో దేశద్రోహుల ముద్ర వేసి కన్నయ్య కుమార్‌ తదితరులను బహిష్కరించిన ఘటన నిప్పుకణికలా రాజుకుంది. ఆ సమయంలో మంత్రులు వెంకయ్య నాయుడు, సృతి ఇరానీలు విచ్చలవిడిగా రెచ్చిపోయి విషం గక్కారు(వారిద్దరూ ఇప్పుడు ఆ పదవుల్లో లేరు) బెనారస్‌ విద్యాలయంలో యువతులపై దాడికి తెగబడ్డారు. తాజాగా ఆలిఘర్‌ యూనివర్సిటీలో దశాబ్దాల నుంచి వుంటున్న జిన్నా చిత్రపటం తొలగింపు పేరిట రభస చేస్తున్నారు.ఇలా మొత్తం విద్యా వాతావరణాన్ని విషపూరితం చేసి కరుడుగట్టిన ఆరెస్సెస్‌ సిద్ధాంత కర్తలను విసిలుగా నియమిస్తున్నారు. యుజిసి,ఎన్‌సిఇఆర్‌టి,ఐసిఐహెచ్‌ఆర్‌,ఐసిసిఆర్‌ వంటి గొప్ప సంస్థలన్నీ కాషాయ కర్తలతో కుతకుతలాడుతున్నాయి!వీరు పాఠ్యపుస్తకాలను సిలబస్‌లనూ మాత్రమే గాక చరిత్రనే తలకిందులుచేసే ప్రయత్నంలో తలమునకలవుతున్నారు. అందుకోసం గతంలో గొప్ప కృషి చేసిన మహా మేధావులపై మార్క్సిస్టు ముద్ర వేసి వేటాడుతున్నారు.తాజాగాజెఎన్‌యులో విశ్వ విఖ్యాత ఆర్థిక వేత్తలైన ప్రభాత్‌ పట్నాయక్‌, ఉత్సా పట్నాయక్‌ల గదికి తాళం వేసి కుసంస్కారం చాటుకోవడం ఇందుకో దారుణ ఉదాహరణ
ఆరెస్సెస్‌ బిజెపి చెప్పే ఫాసిస్టు తరహా ఆలోచనా విధానం సంప్రదాయికంగా భారత సమాజంతో సరిపోలేది కాదు ఈ దేశ చరిత్రలో మతం అనేది యూరప్‌లో వలెనో పశ్చిమాసియాలో వలెనో గాక కులాలు విశ్వాసాలు సంప్రదాయాల ద్వారా ప్రధానంగా వ్యక్తీకరించబడుతున్నదంటారు చరిత్ర కారిణి రోమిలా థాపర్‌. మతాచారం అనేది ఇక్కడ సాంఘిక సంప్రదాయం ద్వారా వస్తుంది. మతాలు మారిన వారు కూడా పాత ఆచారాలు పాటిస్తుంటారు. రాజ్యాధికారం చలాయించిన వారు ఏ మతానికి చెందిన వారైనా వివిధ మతాలకు రక్షణ కల్పించాల్సి వచ్చింది. కాని మోడీకి పూర్తి మెజార్టి వచ్చింది గనక మెజార్టి మతం హిందువులు గనక మిగతావారు లోబడి వుండాలనే ఆరెస్సెస్‌ మూలసూత్రాన్ని ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే అల్ప సంఖ్యాకులకు కూడా రక్షణ కల్పించడం తప్ప అధిక సంఖ్యాకుల ఆధిపత్యం కాదన్నది అసలు విషయం. ఒకే దేశం ఒకే ప్రజ అంటూ పరోక్షంగా ఒకే మతం అన్న భావం రుద్దబడుతున్నది. అది ఒకే నేత ఒకే పార్టీ అన్న స్థాయికి దిగజారుతున్నది.
ఈ క్రమంలో ముస్లిం మైనార్టిలపై టెర్రరిస్టుల ముద్ర వేయడం నుంచి వారికి జీవనోపాధిగా వున్న పశువథ్యశాలలపై నిషేదం వరకూ అనేక రూపాల్లో దాడి సాగుతున్నది. లవ్‌ జిహాద్‌ నినాదం ఆ ౖ మహిళలపై దాడిగా మారింది. అసోంలోనైతే విదేశాల నుంచి వలస వచ్చిన హిందువులకు పౌరసత్వం ముస్లింల గెంటివేత అంటూ ద్వంద్వనీతితో రాజ్యాంగ మూల సూత్రానికే ఎసరు పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలలోనూ అనైతికంగా అధికారం చేజిక్కించుకుని క్రైస్తవ సంస్థలపైన కూడా దాడి మొదలెట్టారు. రోడ్లపై ఏడాది పొడుగునా ఎన్నో పండుగ పందిర్లు వేసే ఈ హిందూత్వ వర్గాలు ముస్లింలు ఎక్కడొ ఒక చోట రోడ్లపై ప్రార్థన చేస్తే మహాపరాధమని చర్చలు నడుపుతున్నారు! ఈ తరహా మత రాజకీయాల దుష్ఫలితం మనకు జమ్మూ కాశ్మీర్‌లో కళ్లకు కడుతుంది. స్థానిక ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని ప్రశాంతత పునరుద్ధరించేబదులు సైనిక చర్యలూ మతతత్వ ప్రచారాలతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది.
ఈ అసహన రాజకీయాలకు అందరికంటే ఘోరంగా బలైన వారు మహిళలే. మహిళలపై అత్యాచారాలు 30 శాతం పెరిగితే అందులో 82శాతం బాలికలపై సాగుతున్న ఘోరకలి. అత్యాచారాల విషయంలోనూ మతతత్వ సులోచనాలతో నేరస్తులను బట్టి వ్యవహరిస్తున్నారు. కాశ్మీర్‌లో మైనర్‌ బాలికపై అమానుష అత్యాచారం హత్య దేశాన్ని కలచి వేసింది. అదే సమయంలో యుపిలో మరో దరంతంలో బిజెపి ఎంపినే అరెస్టు చేయాల్సి వచ్చింది. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగితే అపరాధమని నైతిక పోలీసులుగా పహారా గాచే దుష్టపోకడ అన్నా చెల్లెళ్లకు పెళ్లిల్లు చేసే వరకూ వచ్చింది.గర్భస్థ శిశు పరీక్షల నిషేదాన్ని నీరుగార్చడమే గాక మహిళలకు సంబంధించిన గర్భస్రావ హక్కువంటివాటిపైనా దాడి పెరిగింది.లవ్‌జీహాద్‌ ప్రచారాలకు గురైన కేరళ యువతికి సుప్రీం కోర్టు రక్షణ కల్పించడమే గాక తీవ్రంగా విమర్శించింది. ఇంతా చేసి మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం తెచ్చింది లేకపోగా స్త్రీలు ఇంటికే పరిమితం కావాలనీ బాల్య వివాహాలు మేలనీ, బికినీలు వేసుకోరాదని కాలం చెల్లిన మను వాదాలు వినిపించే వికృతం. గృహ హింస నిరోధ చట్టాన్నికూడా సడలించేస్తున్నారు. తలాక్‌పై ఏదో వీరోచిత విన్యాసాలు చేసిన వారు పరువు హత్యల నిరోధంపై చిటికెన వేలు కదల్చకపోవడం అభివృద్ది నిరోధకత్వానికి మచ్చుతునక. మోడీ హయాంలో ప్రపంచ వ్యాపితంగా మన ప్రతిష్ట వెలిగిపోతుందని వూదరగొడుతున్నారు గాని ఈ అసహన రాజకీయాలపైన అంతర్జాతీయంగానే విమర్శలు పెరిగాయి. న్యూయార్క్‌ టైమ్స్‌, అల్‌జజీరా వంటి మీడియా సంస్థలే గాక అమెరికా పార్లమెంటుకు సంబంధించిన మత వ్యవహారాల అధ్యయన కమిటీ యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ప్రపంచ మానవ హక్కుల వేదిక వంటి వాటి నివేదికలలోనూ ఈ అసహన చర్యలు ఏకరువు పెట్టారు. లండన్‌పర్యటనలో మోడీని నిరసించిన పరిస్థితి. నోబుల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ స్వయానా ఈ వివాదాలకు గురై ‘ స్వాతంత్రహరింపు దిశగా’ అని వ్యాసం రాశారు!సెన్సార్‌ బోర్డు చైర్మన్‌ ఒకరు ఒత్తిళ్లుతట్టుకోలేక రాజీనామా చేశారు. న్యాయ వ్యవస్థలోనూ జోక్యాలు పెరిగి సీనియర్‌ సుప్రీం కోర్టు జడ్జీలే నిరసన ప్రకటించడం దేశ చరిత్రలోనే ఎరగని పరిణామం.ఇలాటి ఉదాహరణలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు.

అట్టడుగు వర్గాల నుంచి అత్యున్నత న్యాయ, విద్యాపీఠాల వరకూ బిజెపి పాలనలో అల్లకల్లోలానికి అమానుషదాడులకు గురి కావడం ఆందోళనకరం. దీనిపై ప్రతిఘటన నిరసన వ్యక్తమవుతున్నా ఇంకాఉధృతం చేయడం అవసరం. దీనికి సంబంధించి సంఘ పరివార్‌ ఆలోచనా సమావేశం జరిపింది. ఈ దేశంలో ఇప్పటి వరకూ ప్రముఖంగా వున్న ప్రజాస్వామిక ఉదారవాద భావజాలం స్థానే మితవాద సంప్రదాయ భావధారను జొప్పించే ప్రక్రియను ఎలా పటిష్టం చేయాలని ఆలోచన చేసినట్టు ప్రకటించారు. హిందూత్వ భావజాలాన్ని జనామోదయోగ్యంగా మింగించడమెలాగన్నదే దీని లక్ష్యం. ఈ సమయంలోనే ఆరెస్సెస్‌ సమావేశాలకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆహ్వానించారు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ జాబితాలో వున్నారు. ఎపిలో రాజకీయ ప్రవేశం చేసిన సిబిఐ మాజీ అధికారి వివిలక్ష్మీనారాయణ కూడా వెళ్లి వచ్చారు. ఆరెస్సెసక్‌ు కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నినాదంతో సంబంధం లేదని గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఇవన్నీ చూడాలి. వాజ్‌పేయి పాలనతో పోలిస్తే మోడీ హయాంలో ఆరెస్సెస్‌ రాజకీయ పాత్ర బహిరంగమైంది. దాన్ని మరింత ఆమోదయోగ్యం చేసుకుని బిజెపి యేతర పార్టీలను కూడా ప్రభావితం చేసే తతంగం ఇప్పుడు మొదలు కావచ్చు. . యూరప్‌ అమెరికాలలో వలె పచ్చి మితవాద మతవాద జాత్యహంకార భావజాలం భారత దేశంలో వ్యాపించకుండా జాగ్రత్త పడాల్సి వుంది. అలా జరగాలంటే ప్రాంతీయ పార్టీల నేతలు అవకాశవాద రాజకీయాలు విడనాడాలి. వామపక్షాలు ప్రజాసంఘాలు సామాజిక న్యాయ శక్తులూ ఆ పోరాటంలో ఇప్పటికే నిమగమై వున్నాయి. కాని సవాలు తీవ్రతను తక్కువ అంచనా వేయడానికి లేదు.

అచ్చేదిన్‌ పేరిట కేంద్రంలో అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ ఆచరణలో తెచ్చిన కక్షేదిన్‌ చరిత్రలో మున్నెన్నడూ చూడలేదని దేశం ఘోషిస్తున్నది. చారువాలా గారువాలాగా మారిపోయిన ఉదంతానికి భరత మాత విస్తుపోతున్నది. నాలుగేళ్లపాలనలో ప్రతి రోజూ ప్రతి రంగం మత విద్వేషంతో కమిలిపోతున్నది. నిత్య జీవితమూ రాజకీయమూ సమాజ గమనమూ మాత్రమే గాక విద్యా పరిశోధన వైజ్ఞానిక రంగాలు కూడా మతం రంగు పులుముకున్నాయి. విద్యా సంస్థలు విద్వేష కేంద్రాలైనాయి. జనాభాలో సగమైన మహిళలు, బహుజనులనిపించుకున్న దళిత బలహీనవర్గాలూ, దిశా నిర్దేశంచేసే మేధావులు బుద్దిజీవులూ, రాజ్యాంగం రక్షించాల్సిన ఆదివాసులు అల్పసంఖ్యాకులూ ఇలా ప్రతి తరగతిపైనా ప్రతీప శక్తులు దాడులుచేస్తున్నాయి.
”ఇలాటి మాటల్లో ఉద్దేశం ఏమిటి? ఆయన హిందూస్థాన్‌కే రాజు. ఆయన తల్చుకుంటే ఈ హత్యలను ఆపలేరా? ఒక్కరాత్రిలోనే నోట్లన్నీ రద్దు చేసిపారేయలేదా?” అని ప్రశ్నించాడు జలాలుద్దీన్‌. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌ జిల్లా ఖండేవాలీ గ్రామంలో హిందూత్వ ఛాందస ముఠా ఊచకోతకు గురైన 16 ఏళ్ల జునాయిద్‌ ఖాన్‌ తండ్రి ఆయన. గోరక్షణ పేరిట జరిగే హత్యలను మహాత్మాగాంధీ ఆమోదించివుండేవారు కాదని ప్రధాని మోడీ సబర్మతి ఆశ్రమంలో సన్నాయి నొక్కులు నొక్కడంపై ఆ తండ్రి ఆవేదన అది.చాలా ఆమాయకంగా అడిగిన ఈ ప్రశ్న నిజానికి దేశంలో పరిస్థితికి చక్కటి ప్రతిబింబం. మరోవైపున ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేంద్ర సచార్‌ ఇదే పరిస్థితిని ఇలా సూటిగా చెప్పేశారు:” దీన్ని కేవలం అసహనం అనడం ఇంకెంతమాత్రం కుదరదు.భారత దేశంలో మైనారిటీలను నిర్మూలించి ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకులు కోరుకున్నట్టుగా హిందూరాష్ట్రను ప్రకటించడమే దీని ఉద్దేశం” 2005లో ముస్లింల పరిస్థితులపై అధ్యయనం చేయడానికి నియమితమైన కమిటీకి ఆధ్వర్యం వహించిన జస్టిస్‌ సచార్‌ కంటే ఈ సమస్య తీవ్రత మరెవరూ అర్థం చేసుకోలేరు. అచ్చేదిన్‌కాదు.. కక్షే దిన్‌.. అసహన్‌!
పశుమాంసం తిన్నాడన్న అనుమానంతో జునాయిడ్‌ ఖాన్‌ను గడ్డం పట్టి లాగి కొట్టి చంపడమే గాక అతని కపాలాన్ని తొక్కి తొక్కి ఆనందించారని కథనాలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన తర్వాత దేశ వ్యాపితంగా నిరసన పెల్లుబికింది. నా పేరుతో చేయొద్దు అంటూ దేశంలోని 17 నగరాల్లో యువత ప్రదర్శనలు చేశారు. కాని అదే సమయంలో జార్ఖండ్‌లోనూ ఇలాటి హత్య మరొకటి జరిగింది. మూడేళ్లలో మొత్తం ముప్పై మందికి ఆవుల పేరిట హత్య గావించబడ్డారు. గుజరాత్‌లోని ఉనా వంటి చోట్ల దళితులపై సాగిన హింసాకాండ దేశవ్యాపిత సంచలనమైంది. కాని మోడీ మాత్రం ముచ్చటగా మూడు సార్లు ముక్తసరి ప్రస్తావనలతో సరిపెట్టారు. మరోవైపున ఆరెస్సెస్‌ సర్వాధినేత మోహన్‌ భగవత్‌ గో రక్షణకు చట్టం తీసుకురావాలని ఆదేశించగా ప్రభుత్వ పశువధపై ఆంక్షలు ప్రకటించింది.దీనివల్ల పశుచర్మం శుద్ధి చేసుకుని విక్రయించి జీవించే దళితుల జీవనోపాధిపైనే దెబ్బ పడింది. పైగా మృతపశువులను తొలగించలేదంటూ వారిపై అగ్రవర్ణాల దాడులు పెరిగాయి. దళితులపై అత్యాచారాల నిరోధ చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టును అడిగిమరీ సడలింపచేశారు. తర్వాత నిరసనకు జడిసి మళ్లీ తామే వ్యతిరేకంగా వెళ్లి చివాట్లు తిన్నారు.ఆదివాసులను వనవాసులుగా అవమానించేవీరు వారి రక్షణ కోసం ఉద్దేశించిన కంపా చట్టాన్ని, గనుల చట్టాన్ని కూడా సడలించారు. చోటానాగపూర్‌ సంథాలుల హక్కులకు చేటు తెచ్చారు. సైద్ధాంతికంగా బిజెపి ఆరెస్సెస్‌ల తిరోగమన వాదం ఫలితాలే ఇవన్నీ. మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంలోనే దీనదయాళ్‌ ఉపాధ్యాయను తప్ప అంబేద్కర్‌ను తల్చుకోలేదు.
అరవై ఏళ్ల స్వాతంత్రంలో ఏనాడూ ఎరుగని ఈ పరిస్థితి మోడీ హయాంలోనే ఎందుకొచ్చిందనేది పెద్ద ప్రశ్న. సమాధానం సులభమే. దేశంలో మొదటిసారి బిజెపికి స్వంతంగా మెజార్టి వచ్చింది గనక. దేశంలో మతతత్వ రాజకీయాలకు మూలపీఠమైన ఆరెస్సెస్‌ విహెచ్‌పిల విజృంభన 1967లో గో సమస్యపైనే మొదలైంది గనక! ఆ రోజున విహెచ్‌పి సాధువులు ఏకంగా ప్రధాని నివాసంపైనే దాడికి దిగారు. అప్పటి నుంచి తదుపరి యాభై ఏళ్లలోనూ కాంగ్రెస్‌ , వివిధ ప్రాంతీయ పార్టీల అవకాశవాదం పలితంగా పెరిగిన హిందూమతతత్వ కూటమి ఆరెస్సెస్‌ బిజెప పూర్గిగాి అధికార పగ్గాలు చేపట్టింది గనక. 8 రాష్ట్రాలకు పరిమితమైన ఆ శక్తి ఇప్పుడు ఏకంగా 20 రాష్ట్రాలలో స్వంతంగానో భాగస్వామ్యంతోనో పాలన చేస్తున్నది గనక తన విద్వేష పూరిత వివక్షతా విధానాలను విచ్చలవిడిగా రుద్దుతున్నది.
మోడీ ప్రధాని అభ్యర్థి అవుతారన్న వాతావరణంలో మహారాష్ట్రలో గోవింద పన్సారే హత్య జరిగింది. ఆయన ప్రధాని అయ్యాక అక్కడే … కర్ణాటకలో కల్బుర్గి హత్యలు జరిగాయి. కొద్ది మాసాల కిందట గౌరీ లంకేశ్‌ ప్రాణాలు తీశారు. వీరంతా హేతువాదులు హిందూమతోన్మాద వ్యతిరేకులే. (తమను ప్రశ్నించే వారిని లేకుండా చేయడం అందుకోసం హంతక ముఠాలను పురికోల్పడం సంఘ పరివార్‌ 1948జనవరి 30 మహాత్మాగాంధీ హత్యనాటికే మొదలుపెట్టింది.) ఈ విధమైన విద్వేష హత్యలకు వ్యతిరేకంగా రచయితలూ కళాకారులూ తమ అవార్డులు వెనక్కు ఇచ్చి నిరసన తెల్పడంతో వారిపైనా దుష్ట్రచారం చేసింది. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ల ప్రేరణతో వీరంతా వ్యతిరేకిస్తున్నారని అసత్యాలు గుమ్మరించింది. నేరుగా తమను వ్యతిరేకించిక పోయినా స్వతంత్రంగా ఆలోచించే రచయితలు దర్శకులపై దాడులు నిత్యకృత్యమైనాయి. పద్మావతి చిత్రం విడుదల కాకముందే షూటింగ్‌ దశలోనే దాడి చేసి తర్వాత సెన్సార్‌ దశలోనూ ముప్పు తిప్పలు పెట్టారు. థియేటర్లు ధ్వంసం చేశారు. తీరా ి ఆ చిత్రం రాజపుత్రులను కీర్తించే పునరుద్ధరణ దిశలోనే వుండటంతో మౌనం పాటించారు. అంతకుముందు పికెపైనా అదే దాడి జరిగింది. చిత్రకారులు క్రీడాకారులు నటీనటులు పాత్రికేయులు ఎందరో ఈ తరహా దాడులకు గురైన పరిస్థితి గతంలో లేదు.
ఈ తరహా విద్వేషాలు వివక్షతలు కలిపి విశ్వవిద్యాలయాలపై ప్రయోగించడం మరో విపరీత పరిస్థితికి దారి తీసింది.హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయంలో దళితులపై వివక్షత వేధింపులు బహిష్కరణలూ ప్రతిభావంతుడైన రోహిత్‌ వేములను బలిగొన్నాయి. దేశమంతా రగిలిపోవడంతో మోడీ కూడా మొసలికన్నీరు కార్చారు.కాని ఆయన అనుయాయులు మాత్రం అప్పటికీ ఇప్పటికీ అదే విద్వేష కాండ సాగిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన జెఎన్‌యులో దేశద్రోహుల ముద్ర వేసి కన్నయ్య కుమార్‌ తదితరులను బహిష్కరించిన ఘటన నిప్పుకణికలా రాజుకుంది. ఆ సమయంలో మంత్రులు వెంకయ్య నాయుడు, సృతి ఇరానీలు విచ్చలవిడిగా రెచ్చిపోయి విషం గక్కారు(వారిద్దరూ ఇప్పుడు ఆ పదవుల్లో లేరు) బెనారస్‌ విద్యాలయంలో యువతులపై దాడికి తెగబడ్డారు. తాజాగా ఆలిఘర్‌ యూనివర్సిటీలో దశాబ్దాల నుంచి వుంటున్న జిన్నా చిత్రపటం తొలగింపు పేరిట రభస చేస్తున్నారు.ఇలా మొత్తం విద్యా వాతావరణాన్ని విషపూరితం చేసి కరుడుగట్టిన ఆరెస్సెస్‌ సిద్ధాంత కర్తలను విసిలుగా నియమిస్తున్నారు. యుజిసి,ఎన్‌సిఇఆర్‌టి,ఐసిఐహెచ్‌ఆర్‌,ఐసిసిఆర్‌ వంటి గొప్ప సంస్థలన్నీ కాషాయ కర్తలతో కుతకుతలాడుతున్నాయి!వీరు పాఠ్యపుస్తకాలను సిలబస్‌లనూ మాత్రమే గాక చరిత్రనే తలకిందులుచేసే ప్రయత్నంలో తలమునకలవుతున్నారు. అందుకోసం గతంలో గొప్ప కృషి చేసిన మహా మేధావులపై మార్క్సిస్టు ముద్ర వేసి వేటాడుతున్నారు.తాజాగాజెఎన్‌యులో విశ్వ విఖ్యాత ఆర్థిక వేత్తలైన ప్రభాత్‌ పట్నాయక్‌, ఉత్సా పట్నాయక్‌ల గదికి తాళం వేసి కుసంస్కారం చాటుకోవడం ఇందుకో దారుణ ఉదాహరణ
ఆరెస్సెస్‌ బిజెపి చెప్పే ఫాసిస్టు తరహా ఆలోచనా విధానం సంప్రదాయికంగా భారత సమాజంతో సరిపోలేది కాదు ఈ దేశ చరిత్రలో మతం అనేది యూరప్‌లో వలెనో పశ్చిమాసియాలో వలెనో గాక కులాలు విశ్వాసాలు సంప్రదాయాల ద్వారా ప్రధానంగా వ్యక్తీకరించబడుతున్నదంటారు చరిత్ర కారిణి రోమిలా థాపర్‌. మతాచారం అనేది ఇక్కడ సాంఘిక సంప్రదాయం ద్వారా వస్తుంది. మతాలు మారిన వారు కూడా పాత ఆచారాలు పాటిస్తుంటారు. రాజ్యాధికారం చలాయించిన వారు ఏ మతానికి చెందిన వారైనా వివిధ మతాలకు రక్షణ కల్పించాల్సి వచ్చింది. కాని మోడీకి పూర్తి మెజార్టి వచ్చింది గనక మెజార్టి మతం హిందువులు గనక మిగతావారు లోబడి వుండాలనే ఆరెస్సెస్‌ మూలసూత్రాన్ని ఇప్పుడు అమలు చేయాలనుకుంటున్నారు. ప్రజాస్వామ్యం అంటే అల్ప సంఖ్యాకులకు కూడా రక్షణ కల్పించడం తప్ప అధిక సంఖ్యాకుల ఆధిపత్యం కాదన్నది అసలు విషయం. ఒకే దేశం ఒకే ప్రజ అంటూ పరోక్షంగా ఒకే మతం అన్న భావం రుద్దబడుతున్నది. అది ఒకే నేత ఒకే పార్టీ అన్న స్థాయికి దిగజారుతున్నది.
ఈ క్రమంలో ముస్లిం మైనార్టిలపై టెర్రరిస్టుల ముద్ర వేయడం నుంచి వారికి జీవనోపాధిగా వున్న పశువథ్యశాలలపై నిషేదం వరకూ అనేక రూపాల్లో దాడి సాగుతున్నది. లవ్‌ జిహాద్‌ నినాదం ఆ ౖ మహిళలపై దాడిగా మారింది. అసోంలోనైతే విదేశాల నుంచి వలస వచ్చిన హిందువులకు పౌరసత్వం ముస్లింల గెంటివేత అంటూ ద్వంద్వనీతితో రాజ్యాంగ మూల సూత్రానికే ఎసరు పెట్టారు. ఈశాన్య రాష్ట్రాలలోనూ అనైతికంగా అధికారం చేజిక్కించుకుని క్రైస్తవ సంస్థలపైన కూడా దాడి మొదలెట్టారు. రోడ్లపై ఏడాది పొడుగునా ఎన్నో పండుగ పందిర్లు వేసే ఈ హిందూత్వ వర్గాలు ముస్లింలు ఎక్కడొ ఒక చోట రోడ్లపై ప్రార్థన చేస్తే మహాపరాధమని చర్చలు నడుపుతున్నారు! ఈ తరహా మత రాజకీయాల దుష్ఫలితం మనకు జమ్మూ కాశ్మీర్‌లో కళ్లకు కడుతుంది. స్థానిక ప్రజలను విశ్వాసంలోకి తీసుకుని ప్రశాంతత పునరుద్ధరించేబదులు సైనిక చర్యలూ మతతత్వ ప్రచారాలతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది.
ఈ అసహన రాజకీయాలకు అందరికంటే ఘోరంగా బలైన వారు మహిళలే. మహిళలపై అత్యాచారాలు 30 శాతం పెరిగితే అందులో 82శాతం బాలికలపై సాగుతున్న ఘోరకలి. అత్యాచారాల విషయంలోనూ మతతత్వ సులోచనాలతో నేరస్తులను బట్టి వ్యవహరిస్తున్నారు. కాశ్మీర్‌లో మైనర్‌ బాలికపై అమానుష అత్యాచారం హత్య దేశాన్ని కలచి వేసింది. అదే సమయంలో యుపిలో మరో దరంతంలో బిజెపి ఎంపినే అరెస్టు చేయాల్సి వచ్చింది. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగితే అపరాధమని నైతిక పోలీసులుగా పహారా గాచే దుష్టపోకడ అన్నా చెల్లెళ్లకు పెళ్లిల్లు చేసే వరకూ వచ్చింది.గర్భస్థ శిశు పరీక్షల నిషేదాన్ని నీరుగార్చడమే గాక మహిళలకు సంబంధించిన గర్భస్రావ హక్కువంటివాటిపైనా దాడి పెరిగింది.లవ్‌జీహాద్‌ ప్రచారాలకు గురైన కేరళ యువతికి సుప్రీం కోర్టు రక్షణ కల్పించడమే గాక తీవ్రంగా విమర్శించింది. ఇంతా చేసి మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం తెచ్చింది లేకపోగా స్త్రీలు ఇంటికే పరిమితం కావాలనీ బాల్య వివాహాలు మేలనీ, బికినీలు వేసుకోరాదని కాలం చెల్లిన మను వాదాలు వినిపించే వికృతం. గృహ హింస నిరోధ చట్టాన్నికూడా సడలించేస్తున్నారు. తలాక్‌పై ఏదో వీరోచిత విన్యాసాలు చేసిన వారు పరువు హత్యల నిరోధంపై చిటికెన వేలు కదల్చకపోవడం అభివృద్ది నిరోధకత్వానికి మచ్చుతునక. మోడీ హయాంలో ప్రపంచ వ్యాపితంగా మన ప్రతిష్ట వెలిగిపోతుందని వూదరగొడుతున్నారు గాని ఈ అసహన రాజకీయాలపైన అంతర్జాతీయంగానే విమర్శలు పెరిగాయి. న్యూయార్క్‌ టైమ్స్‌, అల్‌జజీరా వంటి మీడియా సంస్థలే గాక అమెరికా పార్లమెంటుకు సంబంధించిన మత వ్యవహారాల అధ్యయన కమిటీ యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, ప్రపంచ మానవ హక్కుల వేదిక వంటి వాటి నివేదికలలోనూ ఈ అసహన చర్యలు ఏకరువు పెట్టారు. లండన్‌పర్యటనలో మోడీని నిరసించిన పరిస్థితి. నోబుల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ స్వయానా ఈ వివాదాలకు గురై ‘ స్వాతంత్రహరింపు దిశగా’ అని వ్యాసం రాశారు!సెన్సార్‌ బోర్డు చైర్మన్‌ ఒకరు ఒత్తిళ్లుతట్టుకోలేక రాజీనామా చేశారు. న్యాయ వ్యవస్థలోనూ జోక్యాలు పెరిగి సీనియర్‌ సుప్రీం కోర్టు జడ్జీలే నిరసన ప్రకటించడం దేశ చరిత్రలోనే ఎరగని పరిణామం.ఇలాటి ఉదాహరణలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు.

అట్టడుగు వర్గాల నుంచి అత్యున్నత న్యాయ, విద్యాపీఠాల వరకూ బిజెపి పాలనలో అల్లకల్లోలానికి అమానుషదాడులకు గురి కావడం ఆందోళనకరం. దీనిపై ప్రతిఘటన నిరసన వ్యక్తమవుతున్నా ఇంకాఉధృతం చేయడం అవసరం. దీనికి సంబంధించి సంఘ పరివార్‌ ఆలోచనా సమావేశం జరిపింది. ఈ దేశంలో ఇప్పటి వరకూ ప్రముఖంగా వున్న ప్రజాస్వామిక ఉదారవాద భావజాలం స్థానే మితవాద సంప్రదాయ భావధారను జొప్పించే ప్రక్రియను ఎలా పటిష్టం చేయాలని ఆలోచన చేసినట్టు ప్రకటించారు. హిందూత్వ భావజాలాన్ని జనామోదయోగ్యంగా మింగించడమెలాగన్నదే దీని లక్ష్యం. ఈ సమయంలోనే ఆరెస్సెస్‌ సమావేశాలకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆహ్వానించారు. ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ జాబితాలో వున్నారు. ఎపిలో రాజకీయ ప్రవేశం చేసిన సిబిఐ మాజీ అధికారి వివిలక్ష్మీనారాయణ కూడా వెళ్లి వచ్చారు. ఆరెస్సెసక్‌ు కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నినాదంతో సంబంధం లేదని గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఇవన్నీ చూడాలి. వాజ్‌పేయి పాలనతో పోలిస్తే మోడీ హయాంలో ఆరెస్సెస్‌ రాజకీయ పాత్ర బహిరంగమైంది. దాన్ని మరింత ఆమోదయోగ్యం చేసుకుని బిజెపి యేతర పార్టీలను కూడా ప్రభావితం చేసే తతంగం ఇప్పుడు మొదలు కావచ్చు. . యూరప్‌ అమెరికాలలో వలె పచ్చి మితవాద మతవాద జాత్యహంకార భావజాలం భారత దేశంలో వ్యాపించకుండా జాగ్రత్త పడాల్సి వుంది. అలా జరగాలంటే ప్రాంతీయ పార్టీల నేతలు అవకాశవాద రాజకీయాలు విడనాడాలి. వామపక్షాలు ప్రజాసంఘాలు సామాజిక న్యాయ శక్తులూ ఆ పోరాటంలో ఇప్పటికే నిమగమై వున్నాయి. కాని సవాలు తీవ్రతను తక్కువ అంచనా వేయడానికి లేదు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *