మన వేమన.. ఘన వేమన.. వినవేమన ఒకే ఒక్క వేమన వేగుచుక్క లెక్కన .. వేమనకు నా నివాళిరూపకం

నేను కవితలూ పాటలు కథలూ నాటికలు రాస్తానని చాలా మందికి తెలియదు. సాహిత్యసృజనలోనూ విమర్శలోనూ నేను రాసినవి తెలిసిన చాలా మంది పెద్దలు వాటి గురించి మా సభల్లో తప్ప మాట్లాడరు.నేను మీడియా మనిషిననే అనుకుంటుంటారు. అదలా వుంచితే నేను రాసిన వాటిలో చాలా సంతోషం సంతృప్తి కలిగించిన వాటిలో వేమన రూపకం ఒకటి. 2017లో అనంతపురంలో వివిధ సాహిత్య సంస్థలు ప్రభుత్వ సాంసృతిక శాఖ సహకారంతో నిర్వహించిన వేమన సమాలోచన ఒక గొప్ప జ్ఞాపకమైతే అందులో నేను రాసిన వేమన రూపకం మరింత సంతోషకరమైన అనుభవం. దాన్ని అలా మలచిన వారు ప్రజానాట్యమండలి మిత్రులే. గాయకులు సంగీతకారులు నటీనటులు ముఖ్యంగా అమ్మాయిలు గొప్పగా నటించి ప్రేక్షకులను ఉర్రూతలూపారు. చాలా కాలంగా అనుకుంటూ కూడా పోస్టు చేయలేకపోయిన నా వేమన రూపకం ఇక్కడ ఇస్తున్నాను. . ఈ రూపకాన్ని అనంతపురం కూడలిలో మునిసిపల్‌ కార్యాలయం ముందు వేసినప్పుడు లైటింగ్‌ సౌండ్‌ వంటివి తక్కువగా వుంటాయి. తర్వాత హాలులో వేసినప్పుడు మరింత బాగుంటాయి.(ఇందులో రెండవ భాగంలో మిత్రుడు కవి రాసిన రూపకం కూడా వుంటుంది) నటీనటుల కృషిలో పెద్ద తేడా లేదు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *