మహిళల అసభ్య చిత్రణకు శిక్ష , చట్టాలు

స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం అని ఆర్టీసీ బస్సుల్లోనూ ఇతర చోట్ల రాసి వుంటుంది. నిజంగా అదే మన సంప్రదాయమైతే ప్రత్యేకంగా రాసుకోవాల్సిన అవసరమే వుండదు. ి భారత దేశంలో సంప్రదాయంగా చెప్పబడే చాలా అంశాలు తలకిందులుగా వుంటాయన్నది స్త్రీల విషయంలో మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు రమిస్తారు (రమంతే తత్ర దేవత:) అని చెప్పడంలో గౌరవానికి ఏ ప్రతీక ఎన్నుకున్నారో తెలుస్తుంది.దేవతలను వర్ణించేప్పుడు కూడా కుచోన్నతే అనీ, చనుకట్టు అనీ కచకుచ భారాలనీ రాయకుండా పాతకాలపు కవులే ఆగింది లేదు. అదంతా మన సంప్రదాయమే. కాటికి కాళ్లు చాచుకున్న తాతలు కూడా కన్నెలను పసికందులను కూడా పెళ్లిమీద పెళ్లి చేసుకుంటుంటే అభంశుభం తెలియని బాల వితంతువులను చితిపై సజీవ దహనం చేసిన సంప్రదాయం మనది. కనుక కళా సాహిత్యాలను సంసృతి సంప్రదాయాలను గౌరవిస్తూనే ఈ కఠోర వాస్తవాలను కర్కశ నిబంధనలను నిరసించవలసి వుంటుంది. స్త్రీ పురుషులను ప్రకృతి పురుషులగా చెబుతుంటారు సనాతనులు. స్త్రీని అర్ధాంగిగా వర్ణిస్తుంటారు. ఈ రెండు కోణాల్లోనూ స్త్రీ చులకన చేయబడుతూనే వుంది. ఎందుకంటే రక్త మాంసాలూ సజీవ స్పందనల ఆలోచనా శక గల స్రీని ప్రకృతితో ఎలా పోలుస్తారు? ఇప్పుడు మానవుడు ప్రకృతిని నాశనం చేసినట్టే మహిళలపై కూడా ఆధిపత్యం చలాయించవచ్చుననా?ి్త వాకిటి కళ్లాపి నుంచి రాత్రి దీపాలార్పే వరకూ స్ర ల్తీతో చాకిరీ చేయించుకోవడం, తర్వాత వారినే భోగ్యవస్తువులుగా చేసుకోవడం, అసలు ఇందుకోసం కొన్ని కులాలను తరగతులనే అట్టిపెట్టడం ఇవన్నీ మన ఘన సంప్రదాయంలో భాగాలే. వీటన్నిటినీ బాగా వంటబట్టించుకుని సహగమనాన్నిపునరావృతం చేయాలనే వాళ్లు ఇప్పుడు మన పాలకులు.స్త్రీలు చీకటి పడితే బయిటకు రాకూడదని, నీళ్లలో దిగినా బికినీ వేసుకోరాదని చెప్పే వారు పాలకులు. ఇంతటి మత చాందస పాలకులు మరోవైపున మార్కెట్‌ శక్తులకు వంతపాడుతుంటారు. మానవత్వాన్ని మరిచిపోయి మహిళను సరుకుగా చూపే విష సంసృతి ఇప్పుడు కొత్త రూపాల్లో ప్రత్యక్షమవుతుంటుంది. ఎందుకంటే స్త్రీలను గౌరవించడం మన మత సంప్రదాయం!
ఉదయం లేస్తే వార్తా కథనాలు వ్యాపార ప్రకటనలూ సీరియళ్లు చిత్రాలు ఫీచర్లు అన్నిటిలోనూ ఆకర్షణకోసం అసహ్యంగా చిత్రించబడేది మహిళలు.. ఇది మార్కెట్‌ సమాజ సంప్రదాయం. ఏది అమ్ముకోవాలన్నా ముందు ఆడవారి ఆత్మగౌరవాన్ని అంగాంగ గౌరవాన్ని ఎర చూపించాల్సిందే. వ్యాపారం శృంగారం సౌందర్యం సంప్రదాయం ఏ పేరు పెట్టినా బలయ్యేది వారే. నిత్యానంద స్వాముల నుంచి డేరాబాబాల వరకూ ఇటీవల వరుసగా దొరికిపోయిన చాలామంది స్వాముల చేతుల్లో బలైపోయింది వారే. ఎవరిని పట్టివ్వాలన్నా ఎరలుగా వేయబడుతున్నవారు, రహస్య కేమెరాలలో చిత్రించబడుతున్న వారు అమ్మాయిలే! ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినట్టు నటించే కపట ప్రేమికులు దొంగచాటుగా చిత్రిస్తే బ్లాక్‌మెయిలింగుకు గురవుతున్నదీ వారే. ఏ కారణం చేతనైనా ప్రేమించి మనసు మార్చుకుంటే కాదంటే ప్రేమించడానికి అయిష్టత కనపరిస్తే యాసిడ్‌ దాడికి మాడిపోతున్నది యువతులే. ఈ జాబితా ఇంకా చాలా చెప్పొచ్చు గాని ఈ వ్యాసం ప్రధానాంశం అది కాదు.
రామ్‌గోపాల్‌ వర్మ చాలా ఆర్బాటంగా జిఎస్‌టి ప్రారంభం ప్రకటించారు. తాను కెమెరా పట్టుకుని మిల్కోవా అనే నటిని నగంగా చూపిస్తూ నెట్‌లో ప్రోమో పెట్టారు. దానికి చాలా రకాలైన వర్ణనలిచ్చారు. ఆ దశలోనే ఛానళ్ల చర్చలలో చెలరేగిపోయారు. తర్వాత ఎక్కడో విదేశాలలో చిత్రం షూటింగు పూర్తి చేసినట్టు చెబుతూ నెట్‌లో పోస్టు చేశారు. చూసి భరించలేని దేవి, మణి వంటి సామాజిక మహిళా కార్యకర్తలు ఆక్షేపిస్తే వారిని ఉద్దేశించి అసభ్య భాషణం చేశారు. మిల్కోవాను అలా దిగంబరంగా చిత్రించడంలో మహత్తర సౌందర్య సృజన వున్నట్టు గొప్పలు పలికారు. కత్తి మహేష్‌ వంటి విమర్శకులు కూడా వర్మ సృజనకు వంతపాడేందుకు పోటీ పడ్డారు. అలాటి వాదనల ప్రభావంతోనో లేక స్వీయ ప్రలోభాలతోనో కోందరు యువతీమణులు కూడా వర్మపట్ట సానుకూలంగా స్పందించారు. చవకబారు ప్రశ్నలు వేశారు. వీటన్నిటితో రెచ్చిపోయిన ఆయనమహిళా ప్రతినిధులను అవమానించేలా మాట్లాడ్డమే గాక మీతోనూ జిఎస్‌టి 2 తీస్తానని దుర్భాషలాడారు. పోలీసులకు ఫిర్యాదు చేశాక మాట మార్చారు. భారత దేశ నిబంధనలు అనుమతించని జిఎస్‌టిని ఎ లా తీసి విడుదల చేశావనే ప్రశ్నకు పొంతనలేని సమాధానాలిచ్చారు, హైదరాబాద్‌ పోలీసులు పిలిచి ప్రశ్నించినపుడు .తాను దర్శకుడిని కాదని వూరికే వూహ ఇచ్చానని వాదించారు. ఇదంతా పచ్చిఅబద్దమని అందరికీ తెలుసు. జిఎస్‌టి కోసం వర్మ ఎంత డబ్బా మోగించాడే అందరూ చూశారు. కాని పోలీసలు మాత్రం సూటిగా చర్య తీసుకోకుండా వదిలేశారు. ఇక ఈ వాదనలో అవమానానికి గురైన మహిళా ప్రతినిధులు సంఘాల నాయకులు వర్మపై చర్చ తీసుకోవాలంటూ విశాఖ పట్టణం వంటిచోట్ల నిరాహారదీక్షలు నిరసనలు చేస్తే పోలీసులు చట్టాలు అందుకు అనుమతించవంటూ నిరాకరించారు. మరి సైబర్‌ క్రైమ్‌ అనేది ప్రాంతాలకూ రాష్ట్రాలకు అతీతమైందైనప్పుడు ఎక్కడైనా ఎందుకు చర్య తీసుకోరాదనే ప్రశ్నకు సమాధానం రాలేదు. అత్యద్భుత దర్శకుడుగా అనేక మంది ఆకాశానికెత్తే అరాచక భావుకుడు రాం గోపాల్‌ వర్మ తీసిన జిఎస్‌టి ముందుకు తెచ్చిన అంశాల పూర్వాపరాల విశ్లేషణ మహిళల అశ్లీల చిత్రణ చట్టం స్వభావం తెలుసుకోవడానికి దోహదపడుతుంది.
భారత రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానులేనని చెబుతుంది. (14వ అధికరణం) కులం మతం జాతి, లింగం, పుట్టిన చోటు వంటి కారణాల వల్ల ఎవరిపట్టా వివక్ష వుండరాదు(15(1) అధికరణం) మహిళలు పిల్లలకు అనుకూలంగాప్రభుత్వం చట్టాలు చేయాలి(అధికరణం 15(3) మహిళల గౌరవానికి భంగం కలిగించే దురాచారాలను తుదముట్టించడం కోసం దేశ ప్రజలలో సహౌదర భావాన్ని పెంపొందించాలి(అధికరణం51(ఎ)(ఇ).ఇవేగాక 16, 39(ఎ) 39(డి),42,46 అధికరణాలు కూడా మహిళలకు మేలు చేసేందుకు ఉద్దేశించాయి. ఇవిగాకుండా వివిధ కేసులలో న్యాయస్థానాలు కూడా విలువైన తీర్పులిచ్చాయి.స్త్రీలకు భౌతికంగా రక్షణ కల్పించడమే గాక వారి గౌరవాన్ని కాపాడ్డం, వారిని అసభ్యంగా అశ్లీలంగా చిత్రించడాన్ని అడ్డుకోవడం కోసం ప్రత్యేకంగా చట్టాలు వచ్చాయి.
1860 భారత శిక్షాస్రృతి(ఐపిసి) సెక్షన్‌ 292 అశ్లీల చిత్రణ లేదా అలాటి సామగ్రి చలామణి నేరంగా పేర్కొంటున్నది.292(1) అశ్లీలత అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించింది. అవాంఛనీయమైన లైంగిక కాంక్షను ప్రదర్శించడం, అవతలివారిలో అతిగా కామవాంఛను రేకెత్తించేలా వ్యవహరించడం నీతిబాహ్యతను ప్రోత్సహించడం,బలహీనులను ప్రేరేపించడం,ఇలాటి చిత్రాలు పుస్తకాలు కాగితాలు బొమ్మలు వస్తువులురాతలు పంపిణీలో పెట్టడం ఇలాటివన్నీ అశ్లీలత కిందకు వస్తాయి. వీరికి రెండువేల జరిమానాతో పాటు అయిదేళ్ల జైలు శిక్ష వేయవచ్చు. ఇవన్నీ ప్రధానంగా అచ్చుపుస్తకాలు పత్రికలకు సంబంధించినవి గనక తర్వాత మరింత నవీకరణ అవసరమైంది. అందుకోసమే 1986లో మహిళల అసభ్య చిత్రణ (నిషేద)చట్టం వచ్చింది. అడ్వర్టయిజ్‌మెంట్లలోనూ పుస్తకాలలోనూ చిత్రాలలోనూ ముద్రిత చిత్రాలలోనూ కూడా స్త్రీలను అలా చూపించడం నేరంగా చేసింది.
1986చట్టం ముద్రణా యుగానికి చెందినదైతే దాన్ని ఎలక్ట్రానిక్‌ యుగానికి అంటే టీవీలు ఇంటర్‌ నెట్‌ వంటి వాటికి వర్తింపచేయడానికి మరిన్ని నిబందనలు అవసరమైనాయి. ఇందుకోసం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటి)2000 చట్టం చేశారు. ఇందులో సెక్షన్‌ 67 కింద అసభ్యశృంగార చిత్రాలను(పోర్నోగ్రఫీ)ని అత్యంత తీవ్ర నేరంగా పేర్కొన్నారు. ఐపిసి 292,అలాగే 1986 అశ్లీల నిరోధ చట్టం వర్తించే వాటినే ఎలక్ట్రానిక్‌ రూపంలో పంపిణీ లేదా ప్రసారం చేసేట్టయితే అవే శిక్షలు పడతాయని ఐటిచట్టం 2000 సెక్షన్‌ 67 చెబుతున్నది. ఇప్పుడు వెబ్‌సైట్లలో ప్రసారమయ్యే అంశాలు దీనికింద శిక్షార్హమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ సెక్షన్‌ ప్రకారం సర్వీసు ప్రొవైడర్లు వెబ్‌సైట్స్‌ సృష్టికర్తలూ సెర్చి ఇంజన్లూ నిర్వాహకులూ కూడా శిక్షకు పాత్రులవుతారు. ఇందులో ప్రత్యక్ష బాధ్యులు కాని వారిని పక్కనపెట్టినా ప్రత్యక్ష సృష్టికర్తలు తప్పించుకునే అవకాశం వుండకూడదు. భారత దేశంలో పోర్నో గ్రఫీ అనుమతించబడదు గనక తాను విదేశాల్లో చిత్రించానని వర్మ మొదట చెప్పారు. అయితే దాన్ని విస్తారంగా పంపిణీలో పెట్టి కోట్టు గడించాడు. కాబట్టి ఇప్పుడున్న ఐటి చట్టాల ప్రకారమే ఆయన శిక్ష తప్పించుకోవడానికి లేదు.పైగా ఆ విషయమై చర్చలో మహిళలను దుర్బాషలాడటం కూడా రికార్డయి వుంది గనక అదనపు శిక్షకూడా భరించాల్సి వుంటుంది. అంతేగాని దేశంలో పోర్నోగ్రపీనిషేదచట్టం లేదన్న వాదన అసలు నిలిచేది కాదు.
మోక్షం రాని2012 బిల్లు
ఇవన్నీ గాక మహిళల అశ్లీల చిత్రీకరణ నిషేద బిల్లు(ఇండీసెంట్‌రెప్రజెంటేషన్‌ ఆఫ్‌ విమెన్‌(ప్రొహిబిషన్‌) సవరణ 2012 బిల్లు లోక్‌సభ ఆమోదించింది గాని రాజ్యసభలో అయిదేళ్లుగా ఆమోదం పొందక అలా పడివున్నది. ఇందులో అసభ్య అశ్లీల చిత్రీకరణ, ప్రచురణ, అడ్వర్టయిజ్‌మెంట్‌ నిర్వచనాలను విస్తరించి అధునీకరించేందుకై మాగెటిక్‌ ఆప్టికల్‌ ప్రసారాలను కూడా చేర్చింది. ఈ బిల్లుప్రకారం ఇన్‌స్పెక్టర్‌ హౌదా గల ఏ పోలీసు అధికారి అయినా ఈ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు. ఇందులో మొదటిసారి నేరం చేస్తే మూడేళ్లు వరకూ జైలు లక్ష జరిమానా వేయొచ్చు. మళ్లీ అలాటితప్పే చేస్తే ఏడేళ్ల వరకూ జైలు అయిదు లక్షలు జరిమానా వేయొచ్చు.
ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభ సమావేశాల ముందు కూడా అనామోదితంగా పడి వుంది. ఎందుకంటే స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం గనక! దాన్ని త్వరగా ఆమోదించి చట్టంగా తెచ్చుకోవడం అవసరం. ఆలోగా కూడా ఇప్పుడున్న ఐటి సైబర్‌ నేరాల చట్టం నిబంధనలు జిఎస్‌టి వంటి కేసుల్లో సరిపోతాయి.వాటికి పరిధి సమస్య కూడా లేదు. మరి మొక్కుబడిగా ఏదో చేశామని చెబుతున్న మన పోలీసులు నిజంగా కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి.తీసుకునేదాకా పోరాడాలి. ( written on the occasion of women’s day 2018)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *