రాజకీయ తెరపై రజనీబాబా

ఇప్పటికి 175 చిత్రాల్లో నటించి దక్షిణభారత దేశంలో శిఖరాగ్ర కథానాయకుడుగా వున్న రజనీకాంత్‌ ఒక చిత్రంలోనేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అంటారు. రాజకీయ రంగంలో మాత్రం వందరకాలుగా మాట్లాడి చివరకు ఏడాది ముగింపురోజున రాజకీయ రంగంలో ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. స్వంత పార్టీని పెడతాననీ మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తాననీ వెల్లడించారు. అవినీతిపై పోరాటం,వాగ్దానాల అమలు ప్రధానాంశాలుగా ‘ఆధ్యాత్మిక రాజకీయాలు’ నడుపుతానని కొత్త పదం తీసుకొచ్చారు. తనపార్టీ గుర్తుగా తను నటించిన బాబా చిత్రం బొమ్మ తీసుకున్నారు. రాష్ట్రం గురించి తప్ప దేశం గురించి మాట్లాడలేదు. పార్లమెంటు ఎన్నికలపై ఆలోచిస్తానని మాత్రమే అన్నారు. తన పార్టీకి కార్యకర్తలు వుండరనీ, స్వయం సేవకులు(వలంటీర్లు) వుంటారని మరో మాట చెప్పారు. ఒకో నియోజకవర్గంలో కోటి రూపాయలు ఖర్చు పెట్టుకోగలిగిన వారు అభ్యర్థులుగా ముందుకు రావాలని ఆయన అన్నట్టు వార్తలు వచ్చాయి. ఒకో దానిలో కనీసం 25 మంది వీరాభిమానులు వుండే యాభై వేల అభిమానసంఘాలు రజనీ కొత్తపార్టీకి పునాదిగా వుండబోతున్నాయని తెలుస్తుంది.
ఇరవై ఏళ్లకిందటే రాజకీయాల్లోకి వచ్చేశానంటున్న రజని 1996లో ఆయన అప్పటి ముఖ్యమంత్రి జయలలితను ఓడించాలని పిలుపునివ్వడం ద్వారా పరోక్షంగా డిఎంకె విజయానికి దోహదం చేశారు. (ే 1998లోనూ, 2001లోనే అదే పిలుపునిచ్చినా జయ గెలిచారు.) అప్పటి నుంచి రాజకీయాల్లోకి ఇదిగో వస్తారు అదిగో వస్తారని అంటున్నా ఇప్పటికి గాని వాస్తవం కాలేదు. రజని సమకాలిుకుడైన కమల్‌ హాసన్‌ కాస్త ముందుగానే రాజకీయ ప్రవేశం ప్రకటించారు గాని ఇంకా స్పష్టమైన సంస్థాగత ప్రకటన రాలేదు. కర్ణాటకలో నటుడు ఉపేంద్ర అన్ని చోట్లా పోటీ చేస్తానని చెప్పేశారు. ఎపిలో పవన్‌ కళ్యాణ్‌ 2014లోనే జనసేనగా టిడిపి బిజెపిలను బలపర్చి గత ఏడాదిగా సమస్యలపై తనదైన శైలిలో పర్యటనలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ గౌరీ లంకేశ్‌ హత్యను ఖండించిన తర్వాత అనేక వ్యాఖ్యలతో రాజకీయ కోణాలు వెల్లడిస్తున్నారు. ఇప్పుడు రజని రంగ ప్రవేశంతో వారి అవకాశాల పైనా దృష్టి పెరిగింది.
తమిళనాడులో కరుణానిధి, ఎంజిఆర్‌, శివాజీ గణేశన్‌, జయలలిత, భాగ్యరాజా, శరత కుమార్‌్‌, విజయకాంత్‌, విశాల్‌,కుష్బూ వంటి చాలా మంది తమ తమ జయాపజయాలతో రాజకీయ పాత్రలు పోషించిన వారే. కరుణ ఎంజిఆర్‌ జయలలితల దీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రులుగా వెలిగారు. తమిళనాడుకే స్వంతమైన మరో ప్రత్యేకత ఏమంటే ఇప్పటికి అర్థశతాబ్దిగా అక్కడ ఏ జాతీయ పార్టీ విజయం సాధించింది లేదు. హేతువాద బ్రాహ్మణేతర ఉద్యమ పునాదులపై పెరిగిన ద్రావిడ పార్టీలే పాలన చేస్తున్నాయి. 1916 నవంబరులో పెరియార్‌ ఇవి రామస్వామి నాయకర్‌ తదితరుల నాయకత్వంలో ఏర్పడిన సౌత్‌ ఇండియన్‌ లిబరల్‌ ఫెడరేషన్‌(ఎస్‌ఐఎల్‌ఎఫ్‌), ఉత్తరోత్తరా జస్టిస్‌పార్టీ దీనికి పునాదులు వేశాయి. పెరియార్‌ రాజకీయాలు వద్దనడంతో అన్నాదురై డిఎంకెను స్థాపించి కాంగ్రెస్‌ను ఎదుర్కొన్నారు. 1953లో ఎంజిఆర్‌ కాంగ్రెస్‌నుంచి డింఎకెలోకి వచ్చారు. అప్పటి డిఎంకె సభల్లో ఎంజిఆర్‌, కరుణానిధి ఆకర్షణగా వుండేవారట. 1967లో ముఖ్యమంత్రి అయిన అన్నాదురై 1969లో మరణించగా కరుణానిధి ఆ స్థానంలోకి వచ్చారు. ఆ దశలో హిందీ రుద్దడానికి వ్యతిరేకంగానూ కేంద్రం పెత్తనానికి నిరసనగానూ బలమైన పాత్ర పోషించారు. 1972నాటికి ఎంజిఆర్‌తో విభేదాలు పెరిగి ఆయనను బహిష్కరించుడంతో అన్నా డిఎంకె ఏర్పాటు చేశారు. 1977లో అధికారంలోకి వచ్చారు. మరో అయిదేళ్లకు జయలలిత ప్రవేశించారు. ఇప్పటివరకూ 26 ఏళ్లు అన్నా డిఎంకె, 12 ఏళ్లు డిఎంకె పాలించాయి. ి ద్రవిడ రాజకీయాలతో పాటు విస్తార సంక్షేమ పథకాలు వారి రాజకీయ సంసృతిలో భాగంగా మారాయి. మరోవైపున అవధులు లేని అవినీతి, అవతలి వారి ఉనికిని సహించలేని అసహనం కూడా తిష్టవేశాయి.
జయ మరణంతో రాజకీయ శూన్యం ఏర్పడింది గనక రజనీకాంత్‌కు అవకాశముంటుందని, నిజానికి ద్రావిడోద్యమ అనంతర దశ ప్రారంభమవుతుందని చెప్పడం వూహే తప్ప ఆధారం లేదు. ఆధ్యాత్మిక రాజకీయాలు అన్న మాట బిజెపి సంఘ పరివార్‌ రాజకీయాలను తలపించడం వాస్తవం. రజనీ ప్రకటన ఏ ఒక్కరి కన్నా మాకే దగ్గరగా వుందని ఆరెస్సెస్‌ సిద్ధాంత కర్త గురుమూర్తి చెప్పేశారు కూడా. ్తతున్నారు. మొర్సెల్‌ సినిమా విషయంలో తప్ప ఆయన లౌకిక ప్రజాస్వామిక భావాలు వెలిబుచ్చింది లేదు. ఈ విషయంలో కమల్‌ హాసన్‌ వంటి వారు మెరుగ్గా వున్నా రాష్ట్రంలో వారు వామపక్ష భావాలకు దగ్గరగా వున్నట్టు మీడియా చెబుతున్నది పాక్షిక సత్యం.
ఈ ప్రకటనకుముందే ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో స్వతంత్రుడుగా పోటీ చేసిన శశికళ బంధువు దినకరన్‌ ఘన విజయం రజనీ వంటి వారిని హతాశులను చేసింది. . అనేక ఆరోపణల వూబిలో కూరుకుని జైలుకు కూడా వెళ్లివచ్చిన దినకరన్‌ చేతిలో డింఎకె ఓడిపోవడమే గాక మొదటి సారి చెన్నై పరిధిలో డిపాజిట్‌ కూడా తెచ్చుకోలేకపోయింది. ి ప్రస్తుత పరిస్తితుల్లో డిఎంకె గెలుపు నల్లేరు మీద బండి అనుకున్నది తలకిందులైంది.ఓటర్లు డిఎంకెను తిరస్కరించడం రజనీకాంత్‌లో ఆశలు పెంచి వుండొచ్చు. కాని ఆ తీర్పులో ప్రధాన కోణం కేంద్ర బిజెపి కుట్రల పట్ల ఆగ్రహం. మొదట శశికళను తర్వాత పన్నీరు సెల్వంను ఆ పైన ఫలని స్వామిని ఇలా రకరకాలుగా వ్యూహం మారుస్తూ తమ పట్టు పెంచుకోవడానికి బిజెపి ప్రయత్నించడం రాష్ట్ర ప్రజలకు రుచించలేదు. మరి ఇప్పుడు రజనీ కాంత్‌ కూడా అదే బిజెపితో మంచిగా వుండాలనుకుంటే ప్రజలు హర్షిస్తారా అనేది ప్రశ్న. తమిళనాడులో ఓట్లుసీట్లతో నిమిత్తం లేకుండా వామపక్షాలు సామాజిక న్యాయశక్తులు పోరాడుతూనే వున్నాయి. రజనీ ప్రకటనలో ఆ వూసే లేదన్న విమర్శ కూడా వుంది. రెండేళ్ల కిందట వరదలు వస్తే చిన్న చితక నటుల కన్నా రజని ఇచ్చిన విరాళం తక్కువగా వుండటంపైనా విమర్శలు వచ్చాయి.
ఎంజిఆర్‌ జయలలిత వంటివారికే ఓట్ల శాతం 33-38 మధ్యనే వుంటూ వచ్చింది.(ఒక్కసారితప్ప) దానికోసం ఎంజిఆర్‌ చిత్రాలలోనూ బయిట కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. మేకప్‌ లేకుండా ఒక్కసారి కూడా కనిపించేవారుకాదు. చిత్రాలలో ఆయన పాత్రలు కూడా ఎలాటి వ్యసనాలు గాని అమ్మాయిల వెంటపడి కలలు గనడం గాని చేయవు. ఒక ముసలి రోగిష్టి తల్లి పాత్రతో సెంటిమెంటు తప్పనిసరి. వీలైనప్పుడల్లా పేదల గురించి డైలాగులుంటాయి. ఈ విధంగా తనను తల్చుకోగానే ఒక సజ్జన నాయకుడు గుర్తుకు వచ్చేలా ఎంజిఆర్‌ శ్రద్ధ తీసుకున్నారు. పదవిలోకి రాకముందే పేదలకు దాన ధర్మాలు చేస్తూ ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ పథకాలపై శ్రద్ధ పెట్టారు. ఎంజిఆర్‌ను మించిన రాజకీయ సంచలన విజయం సాధించిన ఎన్టీఆర్‌ సంక్షేమ వాగ్దానాలు చేయడం వెనక సత్యమిదే. అయితే పాత్రల పరంగా మాత్రం ఎన్టీఆర్‌ అన్ని రకాలవీ పోషించారు.నిజానికి ఆయనకు కృష్ణుడే గాక దుర్యోధన రావణ వంటి ప్రతికూల పాత్రలు గొప్ప పేరు తెచ్చాయి. ఏమైనా ఈ ఇద్దరి విజయాలతో దక్షిణాదిన సినీ రాజకీయ రంగాల కలయిక స్థిరపడింది.ఆ కోవలో చిరంజీవి మరోప్రయోగం చేసి చివరకు కాంగ్రెస్‌లో కలిశారు.

రజనీ పాత్రలు కూడా ఎంజిఆర్‌తో పోలిస్తే చాలా తేడాగా వుంటాయి.దూకుడుతో పాటు స్టైల్‌ ప్రధానంగాచూపిస్తూ రజని ప్రేక్షకులకుో దగ్గరయ్యారు. తను ఒక నటుడుగా కన్నా స్టైల్‌నే గుర్తు చేస్తాడు. ఆయన రాజకీయాల్లోకి రావడం అంటే ఈ అవాస్తవ ఇమేజితో భ్రమలు పెంచడమే నని కొందరి వాదన. . ఇది సినిమా ప్రమోషన్‌కు అనేవారూ వున్నారు. అందుకు తగినట్టే ఇప్పుడు ఆయన 2.0ి సినిమా రావలసి వుంది కూడా. నిజానికి అలాటి వ్యాఖ్యలే పవన్‌పైనా వున్నాయి గాని తను ఏదో మేరకు ప్రజల్లో సంచరిస్తూ సమస్యలు తెలుసుకుంటున్నారు. మోడీని ముందే బలపర్చినా ప్రదాని అయ్యాక పవన్‌ కలిసింది లేదు. రజని మాత్రం అవకాశం దొరికితే మోడీని కీర్తిస్తుంటారు. ఇవన్నీ తేడాలు. తమపార్టీలో చేరాలనే బిజెపి వత్తిడి తట్టుకోలేకే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని ఒక వాదన వుంది. జయలలిత మరణం తర్వాత ఢనాధ్య వర్గాలు ఆయనకు బాగా మద్దతు ఇవ్వడమే గాక వనరులు సమకూర్చడానికి కూడా సిద్ధంగా వున్నాయట.
్‌ ఘన విజయం తర్వాత, మూడు మాసాల్లో ప్రభుత్వాన్ని పడగొడతానని చెప్పిన దినకరన్‌ ఏం చేస్తారనేదానిపై తదుపరి ఘట్టం ఆధారపడి వుంటుంది. అనర్భత వేటుపడిన ఆయన అనుయాయులైన 18 మంది ఎ ంఎల్‌ఎలపై హైకోర్టు జనవరి9న తీర్పు నిస్తుంది. ఆ తీర్పునుబట్టి ఇతరులు బయిటకు వస్తారా లేదా అనేది తేలిపోతుంది. వారు బయిటకు వస్తేనే ప్రభుత్వం పడిపోయి శాసనసభ ఎన్నికలు వస్తాయి.. లేదంటే 2019 లోక్‌సభ ఎన్నికలే బలపరీక్షకు సందర్భమవుతాయి. రజని అప్పుడేమి చేస్తారన్నది కూడా అస్పష్టమే. ఇప్పుడు ఆయన చేసిన ప్రకటన కథ మధ్యలో విశ్రాంతి వంటిది తప్ప పతాక సన్నివేశం కాదు. మొత్తం పరిణామాలూ సమీకరణాలు స్పష్టమైతే గాని భవిష్యత్తును అతిగా వూహించడం వల్ల ప్రయోజనం వుండదు.అందుకే మ్రుఖ మీడియా వ్యాఖ్యాతలూ మేధావులు కూడా రజనీ రాకడపై ఆచితూచి స్పందిస్తున్నారు. ఈ లోగానే రజని పార్టీ పేరు ఏర్పాటు ఈనెలలో వుండవని చెప్పేశారు. అంటే కేవలం తన ప్రవేశాన్ని ప్రకటించడానికే పరిమితమైనారన్న మాట. ఈ తారామయ రాజకీయంలో పతాక సన్నివేశం ఎలాగైనా వుండొచ్చు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *