తెలుగునాట ‘మరో చరిత్ర’

చరిత్ర నిరంతరం నిర్మించబడుతూనే వుంటుంది. తెలుగునాడు ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విభజితమై మరో చరిత్ర నడుస్తున్నది. గత చరిత్ర పట్ల కూడా దృష్టికోణాలు మారుతుంటాయి.రెండు రాష్ట్రాలకే గాక కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు కూడా కలసి పాలకులుగా వ్యవహరించిన నిజాంల గురించిన వాదన అలాటిదే. కెసిఆర్‌ నిజాంనూ కాటన్‌నూ పోల్చి చూపడం పొరబాటని ౖ గతసారి రాశాను.దానిపై ప్రొ.. అడపా సత్యనారాయణ ‘నిజాం పట్ల నిష్పాక్షిక దృష’ి్ట శీర్షికతో రాసిన వ్యాసం(నవంబరు 29) ఆ వాదనల కొనసాగింపే. పైగా సాధారణ సూత్రీకరణలూ, నేను రాయని ఉటంకింపులు, నాపై మార్క్సిస్టు ముద్రలూ వేయడం మాత్రమే జరిగింది. నిజాం కాటన్‌ పోలిక చారిత్రికంగా సరైందా కాదా చెప్పకుండా ఆ పాలనలో ‘మంచి’ జాబితా ఇచ్చారు. యాబైలలో తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే 2000 వరకూ ఎవరూ ఎన్నడూ నిజాం గురించి ప్రస్తావించింది కూడా లేదు. (పాటల్లో తప్ప) దాశరధి పద్యంలో చివరి చరణం తీసుకుని మిగిలిన మూడు చరణాలు వదిలేయడం పాక్షికత్వమనే నేను రాశాను. నిస్పాక్షిక దృష్టి గురించి చెప్పాల్సింది అతిగా కీర్తించే ముఖ్యమంత్రికీ, హైదరాబాద్‌ను చూస్తూనే సర్దార్‌ పటేల్‌ గుర్తుకు వచ్చే ప్రధానికీ తప్ప నాలాటి వాడికిే ి కాదు.
నా వ్యాసాన్ని పదే పదే మార్క్సిస్టు కోణం, పాత పాటల కోణం అంటూ అపహాస్యం చేసిన వ్యాసకర్త అవి ఆ ప్రజా గీతాలను చరిత్రలో భాగంగా చూడరా? పోనీ వారి స్వీయ సంపాదకత్వంలో వెలువడిన ‘ఆంధ్ర ప్రదేశ్‌ సమగ్ర చరిత్ర-సంసృతి’- ఆరవ సంపుటాన్ని అందులో స్వయంగా ఆయనే ే రాసిన ‘అసఫ్‌ జాహీల పాలనలో సామాజిక వ్యవస్థ’ అన్న అధ్యాయాన్ని చదివితే సరిపోతుంది. ప్రొఫెసర్‌ గారు నేను రాశానని ఆపాదించినట్టు ” నిజాం సాగర్‌ నిర్మాణం యాదృచ్చికం’ అని వ్యాసంలో లేదు. తీవ్రమైన కరువు నేపథ్యంలో కట్టారని రాశాను. అతి తీవ్ర పరిణామాల కాలం 1946-48 పై చరిత్రకారుల మధ్య భేదాభిప్రాయాలున్నాయని ఆయన అంటున్నది వాస్తవం కాదు. ప్యూడల్‌ ప్రభువులలో విధ్వంసం నిర్మాణం రెండూ వుంటాయని ప్రొ.సత్యనారాయణ అంటున్నారు గాని అది ఆయా ప్రభువులపై పరిస్థితులపై ఆధారపడి వుంటుందని పరిశోధకుల మాట. పైన పరాయి బ్రిటిష్‌ ప్రభుత్వంతోనూ దిగువన పీడకులైన దేశ్‌ముఖ్‌దొరలతోనూ కుమ్మక్కైన నిజాం పెద్ద నిర్మాణాత్మకంగా పనిచేసే అవకాశ మెక్కడీ రెండు రాష్ట్రాల చరిత్రకారులు కలసి అవిభక్త ఎపి చరిత్ర కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో తీసుకొచ్చిన సమగ్ర సంపుటాలు ఇంకా ఇతర రచనలు చూస్తే నిజంగా నిస్పాక్షిక దృష్టి పెరుగుతుంది. నిజాంను కొలిచే ఈ ప్రభుత్వం సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటే నిజంగా నిస్పాక్షికత కొంతైనా మిగులుతుంది.
ఈ కొత్తచరిత్రలో మరో భాగం హైదరాబాదులో వచ్చే నెల జరిగోే ప్రపంచ తెలుగు మహాసభలు. 1975లో తెలుగు మహాసభల చరిత్ర వేరు, 2012లో తిరుపతిలో జరిగిన మహాసభల తీరు వేరు, ఇప్పుడు స్వతహాగా సాహిత్య ప్రియుడైన ముఖ్యమంత్ర్‌ి ఈ సభలు తలపెట్టడం ఆహ్వానించదగిన పరిణామం.కొంతమంది తెలంగాణ భాష అనాలన్నా కెసిఆర్‌ ఆమోదించకపోవడం కూడా సముచితంగావుంది. భాషను తల్లిలాగా చూసుకోవాలని ఆయన అన్నటు పత్రికల్లో వచ్చింది. ఉద్యమ కాలంలో తెలుగుతల్లి గురించి నడిచిన వివాదాలు ఇప్పుడు గతచరిత్రే. లిపి ఒక్కటే అయినప్పుడు రాసే మాట్లాడే ముప్పాతిక పదాలు ఒకటే అయినప్పుడు వేరుగా చూడటం కుదిరేపని కాదు. వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అని సినారె అన్నది అక్షరాల నిజం. ఇంకా వచ్చినాడు అని రాయలసీమలోనూ వచ్చీసీనాడు అని ఉత్తరాంధ్రలోనూ అనేది జోడిస్తే తెలుగు సంపూర్ణమవుతుంది. తెలుగులో ప్రశ్న వేయాలంటే ఒకో చోట ఒక మాట- ఏటి ఏంటి ఏంది ఏమిడ్డి – ఇవన్నీ ఇంకా అనేకం కూడా తెలుగులే. భద్రిరాజు కృస్ణమూర్తి సంపాదకత్వంలో హిస్టరీ ఆఫ్‌ద తెలుగు లాంగ్వేజ్‌ (1974)అనే ఇంగ్లీషు పేరుతో వెలువడిన తెలుగు పుస్తకేం గొప్ప అవగాహన వస్తుంది. అందులో ఆయన రాసిన ‘మాండలికాలు ప్రమాణ భాష మరింత కీకలమైంది.ే. గ్రాంధికం, వ్యావహారికం, ప్రాంతీయం, మాండలికం, అన్యభాషా పదాలు అత్యాధునిక పదాలు ఇలా అనేక వాదనలున్నా అవేవీ తెలుగు భాష ఏకత్వాన్ని పోగొట్టేవి కావు. ఏకతలో అనేకతను కూడా గుర్తించి ప్రోత్సహించి వుంటే తెలుగు మరింతగా వికసించేది. ఆదికవులను పూజిస్తూ సోది కవులను మర్చిపోయామని నేనెప్పుడూ అంటుంటాను.
నన్నయ్య నన్నె చోడుడు తిక్కన ,పోతన సోమనాథుడు, భీమకవి, మొల్ల, వేమన, అన్నమయ్య ,రామదాసు, వీరేశలింగం, గురజాడ, రాయప్రోలు, జాషవా, కుసుమ ధర్మన్న, భాగ్యరెడ్డి వర్మ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, విశ్వనాథ, దాశరది సోదరులు¸, కాళోజీ, ఆరుద్ర, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి, ఆదిభట్ల ,నాజర్‌,యాదగిరి,సుద్దాల హనుమంతు, కనపర్తి వరలక్ష్మమ్మ, బండారు అచ్చమాంబ ఇలా ఎందరెందరో మహానుభావులు లేకుంటే తెలుగు భాషా సాహిత్యాల వికాసమే వుండేది కాదు. ఈ జాబితా సమగ్రమేమీ కాదు. మొదట్లో సినిమాలు మద్రాసు కేంద్రంగా, పత్రికలువిజయవాడ కేంద్రంగా వుండటం వల్ల, ఎవరైనా కొందరి సంకుచిత దృష్లి వల్ల తెలంగాణలో ప్రతిభకు ి తగినంత గుర్తింపు రాలేదని భాధవుండొచ్చు. సామాజికంగానో మరో విధంగానో ఇతరులకూ అలాటి కొరతలు వుండొచ్చు. గ్రాంధిక భాషా కవులు రచయితల విషయంలో మాత్రం తెలంగాణలోనూ ఆంధ్ర ప్రదేశ్‌లోనూ కూడా ఆధునికులకు వచ్చినంత ఆమోదం రాదనే వాస్తవాన్ని అంగీకరించాలి. ఎందుకంటే విస్మ్రత జాబితాలో వినిపించే చాలా పేర్లు ఆ కోవకు చెంది వున్నాయి. కరుణశ్రీ,జాషవా, తిరుపతి వెంకట కవుల వంటివారే ఇందుకు మినహాయింపు కావడానికి కారణాలున్నాయి.
భిన్నమైన ఉచ్చారణలు పదప్రయోగాల మధ్య అతిశయాలు అపహాస్యాలు కూడా వాస్తవం. మూడు భాషా ప్రాంతాలలోనూ(నిజానికి నాలుగు) దీర్ఘకాలం నివసించి రచనా రంగంలో పనిచేస్తున్న నాలాటి వారికి ఈ సమస్యను అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ. సహృదయులైన సాహిత్య కారులకూ సామాన్య ప్రజలకూ ప్రగతిశీలులకూ అలాటి తేడాలు లేవని ా చెప్పొచ్చు. వారు కూడా పొరబాటు చేశారనుకుంటే విమర్శించనూవచ్చు. అవన్నీ ఏం చేసినా తెలుగు మహాసభల వేళ వివాదాలకు పెద్దపీట వేయడం గాక తెలుగు భాషాబివృద్ధికి మనుగడకూ ఎదురవుతున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం కీలకం. తెలుగు బోధన గురించి చెబుతున్నా ఆచరణలో ఆంగ్లమే ఆధిపత్యం చలాయిస్తున్నది వాస్తవం..విభజన తర్వాత పాఠ్య పుస్తకాల తయారీలో కూడా ఇంతవరకూ సంపూర్ణమైన శాస్త్రీయ అవగాహనకు రాలేని స్థితి కూడా నిజం.
ఇక నడుస్తున్న చరిత్రలో చివరిది హైదరాబాద్‌లో మెట్రో, జిఇఎస్‌ సంరంభం. తెలంగాణ ఏర్పడ్డాక భారీ సందర్భాలివి. మెట్రో ఇప్పటికి ఒక దశపూర్తి చేసుకోవడం సంతోషమైనా ఆలస్యం ప్రజలపై మరింత భారంగా మారకుండా చూడాల్సి వుంది. అమెరికా ఛత్రఛాయలో జిఇఎస్‌ ప్రపంచ ప్రచారానికే పనికిరావచ్చు గాని దానితో ముడిపడిన ప్రభావాలు చాలా వుంటాయి. జిఇఎస్‌ జరిగే హైటెక్స్‌ కట్టించిందీ, మెట్రో ఆలోచనకు అంకురార్పణ చేసిందీ తనేనని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం పాత బంధాల పునశ్చరణే. వాటిని సమతుల్యంగా ఎలా కాపాడుకోవాలనే సంయమనం పాలకులకు చాలా అవసరం. ఇటీవల నంది అవార్డుల వివాదం వచ్చినప్పుడు ఒక్కదెబ్బతో నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌ వంటి విమర్శలు చేయడం,ఆధార్‌ ఆసుపాసులు తీయడం దీనితో పొసగదు. తెలుగు మహాసభలకు ‘వారినిపిలుసుడేంది’ అని తమ వాళ్లు అంటున్నారని చెప్పడం కూడా. నిజాం రాజ్యం గురించిన వాస్తవికత అంటున్నట్టే ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత జంట రాష్ట్రాల ప్రభుత్వాల పట్ల కూడా పరస్పరం విశాల దృక్పథం కావాలి. ఉభయులలో అది లోపించబట్టే కేంద్రంలోని బిజెపి రెండు రాష్ట్రాలకూ రిక్తహస్తం చూపిస్తున్నది. చక్రవ్యూహాల్లో ఇరికిస్తున్నది. హైదరాబాద్‌ పర్యటనలో ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు, పోలవరంపై కొత్తపేచీలు తెచ్చి నిధులు బిగబట్టడం ఇందుకు తాజా ఉదాహరణలు. అందుకే వైరుధ్యాలున్నా రెండు రాష్ట్రాలూ చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అనాల్సిందే.
(ఆంధ్రజ్యోతి గమనం- డిసెంబరు 1న ప్రచురితం- పోస్టు చేయడం ఆలస్యమైంది)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *