గౌరీ హత్యకు ఖండనలో పవన్‌ కన్నా ప్రకాశ్‌ రాజ్‌ చాలా మెరుగు

ప్రగతిశీల సంపాదకురాలు గౌరీ లంకేశ్‌ దారుణహత్యపై దేశమంతా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. నేనే గౌరి అనే మాట పాత్రికేయుల నుంచి ప్రజాస్వామిక వాదుల నుంచి మార్మోగుతున్నది. అయితే కొంతమంది ప్రముఖుల తీరు ఇందుకు పూర్తి భిన్నంగా వుంది. తెలుగు రాష్ట్రాల అధినేతలు పాలకపక్షాలూ ఈ ఘాతుకాన్ని ఖండించడం లేదు. పైపై మాటలతో సరిపెట్టేస్తున్నారు. మరోవైపున జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గొప్ప భాసలోనే ఖండించారు. ఆమెను చంపితే అలాటి అనేక గొంతులు పుట్టుకొస్తాయన్నారు. తన బాధ మాటల్లో చెప్పలేనన్నారు. ఇదంతా బాగానే వుంది. కాని ఈ పని హిందూత్వ శక్తులదేనని విమర్శించడం తొందరపాటవుతుందని కూడా విమర్శించారు. తను అనదలచుకోకపోతే వదిలేయొచ్చు. కాని లక్షల మంది ఆ భావంతో విమర్శిస్తున్నప్పుడు వారిని తప్పు పట్టాల్సిన అవసరమేమిటి? పరోక్షంగా ఇది సంఘ పరివార్‌కే సంతోషం కలిగించడానికే పనికి వస్తుంది. పోనీ సంయమనం పాటించదలుచుకుంటే ఇరువైపులా అదే వుండాలి తప్ప విమర్శకులది తప్పయినట్టు మాట్లాడ్డమెందుకు? పవన్‌ అంతటితో ఆగి వుంటే అదో తీరు. పెరూలో సాయుధ గెరిల్లా సంస్థ షైనింగ్‌ పాత్‌ ప్రస్తావన తీసుకొచ్చారు. వారు ఒక బాంబు పేల్చడంతో ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. వారి మార్గం తప్పొప్పులు ఒక విషయం- ఇక్కడ పవన్‌ చెప్పదలుచుకున్నదేమిటి? గౌరీ లంకేశ్‌ను మావోయిస్టులు హత్య చేశారనా?
ఈ విషయంలో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్పందన చాలా మెరుగ్గా వుంది. గౌరీ లంకేశ్‌ విమర్శలు నిరసనలు నచ్చని వారే ఆమెను హత్య చేశారని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. హిందూత్వ శక్తులను చెప్పకపోయినా ఆయన ఉపయోగించిన అసహనం, స్వేచ్న గొంతు నులమడం వంటి పదజాలం ఆ విమర్శ ఎటు ఎక్కుపెట్టిందీ తెలుస్తుంది. పైగా లంకేశ్‌ కుటుంబానికి మూడు దశాబ్దాలుగా మిత్రుడుగా వున్నా ప్రకాశ్‌ రాజ్‌ ఆమె క్రియాశీల కృషిని కూడా గొప్పగా చెప్పడమే గాక ఆమెను చూసి గర్విస్తున్నానన్నారు.
సో.. తప్పును ఖండించడంలో కొన్నిసార్లు హీరోల కన్నా విలన్లే మెరుగా!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *