రజనీ రైట్‌, కమల్‌ లెఫ్ట్‌?

తమిళ చిత్ర రంగంలో కమల్‌హాసన్‌,రజనీకాంత్‌లు ఇద్దరూ మంచి మిత్రులైనా ప్రత్యర్థులు కూడా. ఇద్దరినీ తీసుకొచ్చింది బాలచందరే. రాను రాను కమల్‌ క్లాస్‌, రజనీ మాస్‌ అన్న విభజన ఏర్పడింది. వసూళ్లలో రజనీది పైచేయి అయినా తనకన్నా కమల్‌ గొప్ప నటుడని ఆయన అంటుంటారు. ఇప్పుడు రాజకీయాల్లోనూ వీరిద్దరూ చెరో దృవంఅవుతున్నట్టు కనిపిస్తుంది. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తాడనే మాట చాలా కాలంగా వినిపిస్తున్నా నిజం కాలేదు. మోడి ప్రధాని అభ్యర్థి అయ్యాక మాత్రం కలుసుకున్నారు. ఆ తర్వాత జయలలిత మరణంపై స్పందన, రాజకీయ ప్రవేశంపై అభిమానులతో చర్చలు సంకేతాలు నడుస్తూనే వున్నాయి. బిజెపి నేతలు హిందూత్వ సంస్థల ప్రతినిధులు ఆయనను అనేకసార్లు కలుసుకుంటున్నారు. కనుక రజనీ వచ్చినా వారి కలయికలో వుంటారని వూహాగానాలు సాగుతున్నాయి.
కమల్‌ హాసన్‌ కూడా రాజకీయ సంకేతాలు ఇవ్వడమే గాక తన యాత్ర మొదలైపోయిందని ప్రకటించారు. అలా అన్నతర్వాత ఆయన మొదటగా కేరళ మార్క్కిస్టు ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను కలుసుకుని వచ్చారు. వామపక్ష నేతలే తన హీరోలని తనది కాషాయం రంగు కాదని స్పష్టంగా చెప్పేశారు. కమల్‌ చిత్రం సత్యమే శివం విజయం సాధించలేదు గాని ప్రపంచీకరణ అనంతర కాలంలో నేరుగా రాజకీయ సందేశంతో శ్రామికుల ఉద్యమాలను బలపరుస్తూ తీసింది. కనుక ఆయన ఇలా మాట్లాడ్డంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పవన్‌ కళ్యాణ్‌ కూడా 2014లో బిజెపి టిడిపిలను బలపర్చినా గత కొంతకాలంగా ప్రతిసారి కమ్యూనిస్టుల ఉద్యమాలను ప్రస్తావిస్తుండడటం తెలిసిన విషయమే.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *