ఆదిలోనే అపశ్రుతిగా ఉప ప్రచారం

నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ఆర్‌సిపి అధినేత ప్రతిపక్ష నాయకుడు జగన్‌ ప్రసంగం ఆదిలోనే అవతలివారికి ఒక ప్రచారాయుధాన్ని అందించినట్టయింది. అంబటిరాంబాబు, రోజా వంటి వారు ఎంత అవస్థ పడినా ఎదురు దాడి చేసినా ఎన్నికల ప్రచార ప్రారంభమే అవాంచనీయమైన వ్యాఖ్యలపై అనవసర వివాదంలా పరిణమించిందంటే అందుకు బాధ్యత అద్యక్షులే తీసుకోక తప్పదు. ముఖ్యమంత్రిగా ఎవరైనా వుండొచ్చు. వారిని ఎంతైనా విమర్శించవచ్చు.కాని నడివీధిలో కాల్చివేయడం వంటి మాటలు ముఖ్య స్థానాల్లో వున్నవారిని ఉద్దేశించి వాడటం ప్రజలు హర్షించరు. ఏదో నోరు జారారనుకుంటే తర్వాత సర్దుబాటు చేసుకోవాలి. అలాగాక కావాలని తన వాళ్ల స్థయిర్యం నిలబెట్టడానికే అన్నారనుకుంటే అప్పుడు కూడా పొరబాటే. వరుస కట్టి మంత్రులు పాలక పక్ష నేతలు ఎదురు దాడి చేస్తున్నారంటే అందుకు ఏకైక ఆధారం జగన్‌ నోట వచ్చిన మాటలే. మరి సలహాదారులు, సంప్రదింపులు ఇవన్నీఏమై పోతున్నట్టు? నంద్యాలలో ఎన్నికల పోటీ తీవ్రంగా వుండే మాట నిజం. టిడిపి అనేక విధాల నైతికంగా రాజకీయంగా ఎదురు దెబ్బలు తిన్న మాట నిజం. ఇప్పుడు జగన్‌ మాటలతో రెచ్చిపోయి ఇష్టానుసారం ఆయనపై దండకం చదవడమే పనిగా పెట్టుకుంటే అదీ ఉపయోగం వుండదు. పోటీ తీవ్రతను తక్కువ అంచనా వేసి గెలిచేశామని ఇరు పక్షాల్లో ఎవరు అనుకున్నా పప్పులో కాలేసినట్టే. ఇలాటి సమయంలో సమస్యలపై కేంద్రీకరించి ప్రజలను చైతన్య పర్చవలసిన బాధ్యత రాజకీయ పక్షాలపై వుంది గాని ఒకరిని మించి ఒకరు మాటలు పారేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ప్రజల్లో గౌరవమూ నిలవదు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హౌదాలో వచ్చి పార్టీ మాటలు మాట్లాడినప్పుడు, రోడ్‌ షోలో ప్రశ్నించిన వారిపై విరుచకుపడినప్పుడు కూడా ఇదే చెప్పాను

Facebook Comments

2 thoughts on “ఆదిలోనే అపశ్రుతిగా ఉప ప్రచారం

 • August 5, 2017 at 12:26 pm
  Permalink

  Unfit for CM

  Reply
 • August 5, 2017 at 12:27 pm
  Permalink

  Unfit for CM

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *