3 సి ఆద్యుల టీవీ సుభాషితాలు

టీవీ మీడియాను ట్రిబుల్‌ సి మీడియా అంటుంటారు. క్రైమ్‌ క్రికెట్‌ సినిమా అన్న మాట. దీనికి నేను మరో రెండు కలిపి కార్పొరేట్‌, సెలబ్రిటీస్‌ అంటుంటాను. కామన్‌ మ్యాన్‌ అనే సి మిస్సయిపోయిందని చెబుతుంటాను. సరే- తెలుగు వారికి ఈ ట్రిపుల్‌ సి కాన్సెప్ట్‌ను బాగా నూరిపోసి అప్పటి వరకూ వున్న చర్చలు వార్తల సరళిని మార్చివేసిన వారెవరో వీక్షకులకు బాగా తెలుసు. తర్వాత చాలా మంది దాన్నే అనుసరిస్తున్నా ఈ ప్రక్రియకు నాంది పలికింది, నానా బాపతు పంచాయితీలకు స్టూడియోను వేడికగా మార్చింది కూడా అందరూ చూశారు. కొన్నిసార్లు అసభ్యత హద్దులు మీరిన సంచలనాలు కొంప ముంచిన సందర్భాలున్నాయి. ఏ కొద్ది మినహాయింపులో తప్ప చాలా మీడియా సంస్థలు అదే బాణీని అనుసరిస్తున్న మాట నిజమే గాని ప్రారంభ వాచకులకు మాత్రం ఆ ఘనత చెందుతుంది కదా! తమాషా ఏమంటే ఈ మధ్య సదరు ప్రారంభకులు నాందీ ప్రస్తావకులు నీతి శతకాలు వినిపించేస్తున్నారు. నైతికత, అశ్లీలం, అభూత కల్పనల గురించి సూక్తి ముక్తావళి వినిపిస్తున్నారు. మళ్లీ ఇందుకు ఎంచుకుంటున్న వారెవరంటే వారూ వికృత వివాద స్రష్టలుగా పేరొందిన వారే. అదే రీతిలో సోషల్‌ మీడియాపై దాడికి ఒక కార్యక్రమమే నడిపిస్తున్నారు. నీతులు చెప్పడం తప్పులు విమర్శించడం మంచిదే కాని అందులో ఆవగింజంతైనా ఆత్మ విమర్శ వుంటే ఎంత బాగుంటుందో! మూఢ నమ్మకాలపై టీజర్లు వేసి యాడ్లలో వాటినే పొంగిపొర్లించడం కూడా చాలామంది నా దగ్గర ప్రస్తావిస్తుంటారు. ఎప్పటిదాకానో ఎందుకు ఈ మధ్య శిరీష్‌ ఆత్మహత్యను ఎంత పెద్ద జాతీయ సమస్యను మించి పోయినట్టు ఎన్ని గంటలు గంటలు నడిపించారో తెలియదా? తెలుగు టీవీని కొత్త పుంతలు తొక్కించినందుకు అభినందిస్తూనే ఈ మరో పార్శ్యాన్ని కూడా గుర్తుంచుకుని ఇతరులపై మరీ దుమ్మెత్తిపోయడం తగ్గిస్తే బాగుంటుంది కదా!

Facebook Comments

One thought on “3 సి ఆద్యుల టీవీ సుభాషితాలు

  • July 11, 2017 at 1:53 pm
    Permalink

    Sir, Is it TV9? Curious.!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *