ఏకపక్ష పాలనలో మూడేళ్ల తెలంగాణ

ఉద్వేగ భరితమైన ఉద్యమం, ఉద్రేకపూరిత వాతావరణం తర్వాత ఉత్కంఠ నిండిన పరిస్థితులలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర రావు పాలన తీరుతెన్నులేమిటి? మామూలు రాజకీయాల కంటే భిన్నమైన ప్రత్యేకమైన అంశాలేమీ తెలంగాణలో చూడటం లేదు. ి 2014లో టిఆర్‌ఎస్‌ అత్తెసరు ఆధిక్యతతో అధికారంలోకి రాగలిగింది.వచ్చిన రోజునే కెటిఆర్‌ మజ్లిస్‌ నాయకుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇంటికి వెళ్లి రాజకీయ దోస్తి చేసి వచ్చారు. అసెంబ్లీ సమావేశాలను అవమానించారంటూ రెండు ఛానళ్లను ముఖ్యమంత్రి అభిశంసించడం, అనధికారికంగా వాటి ప్రసారాలు నిలిచిపోవడం మలి చర్య. తప్పు చేశాయి గనక క్షమాపణలుచెప్పి మరో అవకాశం ఇద్దామన్న మాటకు కూడా ఒప్పుకోలేదు.(ఇప్పుడైతే వారంతా అధికార పక్షానికి అత్యంత ఆప్తులే) ఇక మూడోది -తననే తిట్టిపోసిన టిడిపి ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాసయాదవ్‌ను చేర్చుకుని మంత్రిని చేశారు కెసిఆర్‌. అలా ఫిరాయింపులు పాలక పక్షం బలాన్ని 64 91కి చేర్చాయి. ఉద్యమ కాలంలో ్ల రాజీనామాలు ఉప ఎన్నికలే వ్యూహంగా నడిపించిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు వారితో రాజీనామా చేయించేందుకు సిద్ధం కానేలేదు.
మారిన నేపథ్యం
తెలుగుదేశం అధినేత ఎపి ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత హైదరాబాదులో తాను పదేళ్లుే వుంటాననిపార్టీని అధికారంలోకి తెచ్చాకే వెళతానని ప్రకటించారు. కోని అనైతికమైన ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి ా పట్టుబడటం రాష్ట్ర రాజకీయ దృశ్యాన్ని కకావికలం చేసింది. సమతుల్యతను దెబ్బతీసింది. తర్వాత పైస్థాయిలో రాజీ కుదిరి చంద్రబాబు వేగంగా విజయవాడ మారిపోయారు. కాేంగ్రెస్‌నుంచికూడా టిఆర్‌ఎస్‌లోకి వలసలు జరిగాయి. టిఆర్‌ఎస్‌ ఏకపక్ష పాలనకు మార్గమేర్పడింది. చెప్పాలంటే ఏకవ్యక్తి పాలనే. కెటిఆర్‌ దాదాపు ద్వితీయ స్తానం చేపట్టడానికి ి మార్గం ఏర్పడింది. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో. వరంగల్‌ , పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ విజయోధృతి దాని దూకుడును పెంచింది.
సంఘాలపై అసహనం
2015లో వామపక్షాలూ కార్మిక సంఘాలూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేశాయి. ఆర్‌టిసి మునిసిపల్‌ కార్మికుల సమ్మె చాలా ప్రభావం చూపింది. కాని ప్రభుత్వౖం కత్తిగట్టి వ్యవహరించింది. ముఖ్యమంత్రి ఉదారంగా జీతాలు పెంచుతారే తప్ప ఉద్యమాలు వుండకూడదన్న ధోరణి ప్రబలింది. ఆశాలు అంగన్‌వాడీల వంటి అలక్షిత ఉద్యోగుల జీతాలు పెంచడం, కొన్ని విభాగాలలో కాంట్రాక్లు సిబ్బందిని పాక్షికంగా ఖాయం చేయడం అంతా స్వాగతించారు. కాని దీని వెనక వున్న దీర్ఘకాల ఉద్యమాలను అపహాస్యం చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి చిత్రాలకు పాలాభిషేకాలు వెగటు పుట్టించాయి.కార్మికులకు సంఘాలు సమరాలు కూడదన్నదే ప్రభుత్వ నిశ్చిత విధానంగా వుంది. చివరకు జెఎసి చైర్మన్‌ ప్రొ.కోదండరాంనే తలుపులు బద్దలుకొట్టి అరెస్టు చేసిన స్థితి. ఈ ధోరణి ధర్నాచౌక్‌నే ఎత్తివేసేఎత్తుగడగా మారింది. కోర్టు ఆదేశాలనీ,స్థానికుల అభ్యంతరాలనీ చెప్పేవన్నీ సాకులే తప్ప ్తసత్యాలు కాదుి
ఇద్దరూ ఇద్దరే
చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాల కారణంగా పెరిగిన అసంతృప్తితో కొందరు తెలంగాణలో బాగా నడుస్తున్నట్టు భ్రమపడటం వాస్తవికత కాబోదు. కొన్ని విషయాల్లో అటూ ఇటూగా వున్నా ఉభయ చంద్రుల మౌలిక పోకడల్లో పెద్ద తేడా లేదు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని రోజూ చెబుతుంటారు. అనేక లెక్కలు చూపిస్తుంటారు. కాని గ్రామీణ తెలంగాణ మరీ ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో వ్యవసాయం దారుణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.అయినా ప్రభుత్వం తన వ్యవసాయ విధానాన్ని సమీక్షించుకోవడానికి సిద్ధం కాదు. గ్రామీణ ఉపాధి హామీ బకాయిల్లో తెలంగాణ ముందుంది.ఆ పథకంపై ముఖ్యమంత్రి స్వయంగా వరంగల్‌ సభలో పరోక్ష విమర్శ చేశారు.
సామాజికాంశాల దాటవేత
టిఆర్‌ఎస్‌ పాలకులకు భూస్వామ్య వ్యవస్థ పట్ల వుండే సానుకూలత వారి సామాజిక విధారంలోనూ ప్రతిబింబిస్తున్నది. ఇంతవరకూ మంత్రివర్గంలో మహిళకు చోటే లేదు. పరువు హత్యలు రాక్షసంగా జరిగినా నివారించేందుకు పాలకపార్టీ చొరవ చూపలేదు.ప్రభుత్వం గిరిజనుల పోడు వ్యవసాయానికి ఎసరు పెట్టింది. రిజర్వేషన్ల పెంపుదల, వెనకబడిన తరగతుల కోసం కమిషన్‌ ఏర్పాటు ప్రచారం చేసుకోవడమే గాని నిధుల విడుదల నామమాత్రం. ఇదే సమయంలోఅగ్రవర్ణ కార్పొరేషన్లకు మరింత ప్రాధాన్యం లభించింది. ముస్లిం రిజర్వేషన్ల పెంపుదలను బిజెపి విమర్శిస్తే ముఖ్యమంత్రి బిసి తర్కంతో వాదిస్తారే గాని హక్కుగా చెప్పరు. లౌకిక తత్వం అంటున్నా బిజెపిని మించిపోయే రీతిలో మతక్రతువులు ఆచారాలు అధికారికంగా అమలు చేస్తారు. ఆంధ్ర ఆధిపత్యం గురించి అంతగా చెప్పిన వారు అక్కడి స్వామీజీలను తెచ్చి అధికార భవనంలో పీఠంపై కూచోబెడతారు. ప్రభుత్వ నిధులతో స్వంత మొక్కులు తీర్చే కొత్త వరవడి తీసుకొస్తారు. అన్నిటికన్నా దారుణం ఏమంటే ప్రసిద్ధి గాంచిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సంస్మరణకు ఒప్పుకోలేదు.
నినాద త్రయం పరిస్థితి
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో నీళ్లు నిధులు నియామకాలు అనేవి ప్రధాన నినాద త్రయం. ఇందులో నీళ్లకు సంబందించి ఉభయ రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవలసి వుంటుంది. కాని ఉన్న మేరకైనా నిర్మాణంలో వున్న ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసే బదులు ప్రభుత్వం పునరాకృతి(రీ డిజైన్‌) పేరిట మొత్తం తిరగడోడింది.వీటికి కావలనిస నిధులు అనుమతులు అన్నీ విమర్శలకు గురవుతున్నాయి. దీనివల్ల కాంట్రాక్టర్లకు తప్ప రాష్ట్రానికి జరిగే మేలు లేదని , ఆలస్యం వల్ల చాలా నష్టమనీ పార్టీలే గాక నిపుణులు కూడా ఘోషిస్తున్నా పట్టించుకోవడం లేదు.. నియామకాలపై చాలా ప్రకటనలు వస్తున్నాయి గాని 2011లో రద్దయిన పరీక్షను కూడా ఇప్పటి వరకూ జరిపింది లేదు. గత ప్రభుత్వాలలో వలెనేకోతలతో నియామకాలు జరిగాయి. ధనిక రాష్ట్రం నిధుల కొరత లేదంటూనే అనేక పథకాలకు కోతలు పెట్టడం, కేటాయించిన విడుదల చేయకపోవడం అలవాటుగా మారింది. ఫీజు రీ ఇంబర్సుమెంటు కూడా తీరని సమస్య కావడంతో విద్యార్తులు ఇబ్బండి పడుతున్నారు. ముఖ్యమంత్రి రోజూ సమీక్షలపై సమీక్షలు జరిపి ఆదేశాలు జారీ చేస్తుంటారు కాని వాటిని అమలు చేసేదెవరు?అన్నీ తన ద్వారానే జరగాలనే తత్వం-.మామూలు విషయాలు పట్టని నిర్లక్ష్యం. సచివాలయమే సజీవత కోల్పోయిన తీరు పాలనపై వున్న ఉపేక్షకు ఉదాహరణ. ఎప్పటికప్పుడు ఏదో కొత్తది కట్టాలనే తాపత్రయం. దాని చుట్టూ ప్రచార కేంద్రీకరణ.
ఎన్నికల ప్రణాళికలో జాబితా చివరన వున్న మిషన్‌ భగీరథ, జిల్లాల విభజన అన్నిటికన్నా పైకి వచ్చేశాయి. మాట్లాడితే మిషన్‌ కాకతీయ భగీరథ, పెన్షన్లు రిజర్వేషన్ల ముచ్చట్టే చెబుతున్నారు తప్ప నిజంగా వాటిని ఇచ్చిన నిధులెన్ని ఎందుకు వెచ్చించారనే వివరాలు లేవు. కేవలం పైపుల తయారీదార్ల కోసం తప్ప అన్ని నీటి వనరులనూ ఒకే వరుసలో పెట్టి లేని సమస్యలు తెచ్చుకోవడమెందుకని చాలామంది అడుగుతుంటారు. చాలా చోట్ల ఇప్పటికీ మంచి నీటి కి కటకటపడాల్సిందే. చెరువుల పూడిక తీత మంచిదైనా కిందిస్థాయి టిఆరెష్‌ కార్యకర్తలకోసమే కామధేనువులా మిషన్‌ కాకతీయ వాడుతున్నారని బలమైన ఆరోపణలున్నాయి. మరో తమాషా ఏమంటే పట్టిసమీలో చంద్రబాబు , మహబూబ్‌నగర్‌లో కెసిఆర్‌ సత్కరించింది ఒకే యజమానినే. స్వాములు ధనస్వాముల విషయంలో ప్రాంతీయ రేఖలు వర్తించబోవని కెసిఆర్‌ నిరూపించుకున్నారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలోనూ తర్వాత కూడా తెలుగు వాళ్లందరినీ కలుపుకుని పోవాలనే రాజకీయ పరిభాషలో మాట్లాడారు. తెలుగు మహాసభలు కూడా తలపెట్టారు. అయితే పరిస్థితులు అడ్డం తిరిగినప్పుడల్లా ్ల సీమాంధ్ర ఆధిపత్యం ఇంకా వలస వాదుల కుట్రలు వంటి తురుపు ముక్కలు పైకి తీస్తుంటారు. గత ప్రభుత్వాలను విమర్శించాల్సినప్పుడల్లా సమైక్య పాలన అంటుంటారు గాని అన్నిచోట్లా ఇలాటి విమర్శలు వుంటాయి. ఇవన్నీ ఏమైనా ఇరు వైపులా ప్రజలు మాత్రం పరస్పర సుహృద్భావం కాపాడుకున్నారు.
టిఆర్‌ఎస్‌ ప్రణాళికలో ఘనంగా చెప్పి ఓట్లు రాబట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, కెజి టు పిజి ఉచిత విద్య వంటివి చాలా దూరంలో వున్నాయి. ముఖ్యమంత్రి పాలనా దక్షత గురించిన గొప్ప మాటలే వినిపిస్తున్నాయి గాని శాంతి భద్రతల వైఫల్యాలు అమానుష నేరాలు అవినీతి పోకడలు అనేకం జరిగాయి. నిత్య సమీక్షలలో తండ్రి, గతంలో చంద్రబాబు నిర్వహించిన హైటెక్‌ పర్యటనల పాత్రలో కెటిఆర్‌ దర్శనమిస్తున్నారు.ఇప్పుడు కూడా మియాపూర్‌లో 700 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ల దుమారం సాగుతుంటే రెవెన్యూ మంత్రి పేరుతో సహా వినిపిస్తుంటే అధికారులపై చర్యతో సరిపెట్టారు. గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులోనూ పోలీసులపై చర్యకు పరిమితమైనారు. ఇదంతా మేడిపండును తలపించే వ్యవహారం.
రాజుకుంటున్న పోరాటాలు
అసాధారణమైన రీతిలో ఇప్పటికీ పలుసార్లు శాసనసభలో అన్ని పార్టీల సభ్యులనూ సస్పెండ్‌ చేశారు. సామాజిక లక్ష్యాలతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనివీరభద్రం మహాజన పాదయాత్ర తలపెడితే ఆరంభానికి ముందే దాన్ని అడ్డుకోవాలని స్వయానా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అయినా రాష్ట్ర వ్యాపితంగా నిరాఘాటంగా సాగిన ఆ పాదయాత్ర బ్రహ్మాండమైన సమీకరణతో సమాప్తమైంది. ప్రతిపక్షాలకు గొప్ప ఆత్మ విశ్వాసమిచ్చింది. లోగా బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా పర్యటించి అనేక అవాస్తవాలు ప్రకటించినా ముఖ్యమంత్రి అంకెలను ఖండించి మోడీపై విశ్వాస పునరుద్ఘాటన చేయడం మరో ప్రహసనం. రేపటి రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికే మద్దతు నివ్వడానికి టిఆర్‌ఎస్‌ సిద్ధంగా వుంది. దేశ రాజకీయామూ మన్ను రాజకీయాలు మాకు సంబంధం లేదు కావలసింది తెలంగాణ అభివృద్ధి మాత్రమే అని కెసిఆర్‌ ప్రకటించడం విజ్ఞతను పరిహసించింది. ఎపికి చేసి మమ్ములను ఉపేక్షిసున్నారని టిఆర్‌ఎస్‌చేసే ఆరోపణ చేస్తున్నా మోడీ అమిత్‌షా ద్వయం రెండు చోట్లా తన స్వంత రాజకీయమే నడిపిస్తున్నది. టిఆర్‌ఎస్‌ టిడిపి వైసీపీ మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలూ బిజెపి పట్ట సానుకూల వైఖరి తీసుకోవడం పెద్ద ప్రతిబంధకంగా మారింది. దీనిపై పోరాడి కేంద్రాన్ని దారికి తేవలసింది,ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని తిరస్కరించవలసింది ప్రజలే. క్రమేణా రాజుకుంటున్న పోరాటాలు ఉద్యమాలు ఆ దిశలోనే వున్నాయని చెప్పొచ్చు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *