ఉదయం సంక్షోభంలోనూ దాసరి బాధ్యత

 

దర్శక దర్శనం పేరిట దాసరి నారాయణరావుపై రాసిన నా గమనంను చాలా మంది మెచ్చుకున్నారు. అందులో ఆయనకు చాలా సన్నిహితంగా మెలిగిన వారూ వున్నారు. ఉదయం ప్రారంభించడం కూడా ఆయన సాహసికతకు ఒక ఉదాహరణ అని రాశాను. నిజమే. దర్శకులకే గాక సంపాదకులకు కూడా స్టార్‌హౌదా తెప్పించింది దాసరి. దాన్ని ఆస్వాదించించి ఎబికె ప్రసాద్‌. అయితే తర్వాత అది దెబ్బతినిపోవడం వెనక కూడా దాసరి పాత్ర వుందని చెప్పక తప్పదు. ఒక పత్రికా నిర్వహణకు అవసరమైన ఆర్థిక క్రమశిక్షణ కేంద్రీకరణ లేకుండా పోయాయి. ఆ నిధులను సినిమాల వైపు మళ్లించడమూ జరిగింది. ఉత్తరోత్తరా సంక్షోభం పెరిగి మాగుంట కుటుంబం చేతుల్లోకి వెళ్లింది. వారి వ్యాపార వ్యవస్థకూ ఈ మీడియా సూత్రాలకు మధ్యలో ఎలాటి వైరుధ్యం వచ్చిందో అప్పుడు కథలుగా చెప్పుకునేవాళ్లు. నిజానికి అప్పటికి ఆ పత్రిక తీరుతెన్నుల్లోనూ మార్పు వచ్చింది. సారా వ్యతిరేక ఉద్యమం ఏదోకుట్ర అయినట్టు, కేవలం ఉదయంను దెబ్బతీయడానికే ఈనాడు దాన్ని పెంచినట్టు చేసే వాదన పూర్తిగా సరికాదు. పైగా అది ఉద్యమంలో పాల్గొన్న వారి చైతన్యాన్ని నాటి కదలికను అవమానించడం అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం నిషేదం ఎత్తివేసిన తర్వాత ఆ పత్రిక దాన్ని ప్రధానంగా తీసుకోని మాట నిజం. కాని అసలు సారా వ్యతిరేకోద్యమమే రామోజీ ప్రేరేపితమని, ఆ ఒక్క కారణంతోనే ఉదయం మూత పడిందని అనడం వాస్తవాలతో పొసిగేది కాదు. ఇంతకూ ఉదయం విషయంలోఏం జరిగిందో తెలుసుకోవాలంటే నాటి వ్యవస్థాపక సంపాదకుడు ఎబికె ప్రసాద్‌ స్వయంగా చెప్పిన మాటలు వినవచ్చు.(ఆడియోలో కొంత సాంకేతిక సమస్య వుంటుంది. ఉదయం మూత పడటం వల్ల కలిగిన అతి పెద్ద నష్టం ఏమిటంటే పాత్రికేయుల వృత్తి భద్రత అనేది గాలిలో దీపంలా మారింది.అభద్రత అస్థిరత పెరిగాయి. తర్వాత ఆంధ్ర పత్రిక, కొత్తగా వచ్చిన విజేత,ఆ తర్వాత కొన్ణాళ్లకు ఆంధ్రజ్యోతి ఇలా జరిగింది. కొన్ని నామమాత్రంగా నడుస్తున్నాయి గాని సిబ్బంది బాధలు చెప్పడానికి లేదు. ఈ పరిణామంలో ఎవరి బాధ్యత ఎంతో బేరీజు వేసుకోవచ్చు గాని కేవలం కుట్ర సిద్ధాంతాలు నిలబడవు.

you may follow total interview elsewhare for more details.

 

 

 

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *