చస్తారు, చచ్చిపోతారు.. టి ఆర్‌ఎస్‌ మంత్రులకు ఇదేం భాష?

ప్రతిపక్షాలు తనపై కుట్ర పన్నుతున్నాయని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేకసార్టు ఆరోపించింది. చివరకు వారే మఫ్టీ పోలీసులను స్థానిక నిరసనకారులుగా చూపించినట్టు అంగీకరించారు. ఈ ఉదంతంలో ఎవరిది కుత్సితమో తేలిపోయింది. ఆ సందర్భంగా జరిగిన లాఠిచాచ్జిలో 99 శాతం మంది వామపక్ష కార్యకర్తలే గాయపడ్డారు. తీవ్రంగా నెత్తురోడారు. అందుకు విచారించకపోగా ఎర్రజండాల గూండాయిజం అని జెండానే అవమానించే పతాక శీర్షికనిచ్చాడు పూరాశ్రమంలో ప్రగతిశీల విద్యార్థి నాయకుడుగా పనిచేసిన ఒక సంపాదక మహాశయుడు. సరే ఇప్పుడు వారి ముఖ్యమంత్రిని సంతోషపెట్టడానికి అలా చేశాడని సరిపెట్టుకుందాం. కాని బాధ్యతగల మంత్రుల మాటేమిటి? పోలీసులు చేసిన నిర్వాకానికి హౌం మంత్రి సిగ్గుపడాలి. ఒకవేళ ఆయన శాంతిభద్రతలు చూడటం లేదనుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి గారే సవరించుకోవాలి. కాని ఘటన వెంటనే హౌంమంత్రి నాయని నరసింహారెడ్డి అన్నదేమిటి? రెచ్చిపోతే చచ్చిపాతారని బెదిరించారు. కార్మిక సంఘమైన హెచ్‌ఎంఎస్‌ నాయకుడు నాయని చాలా సార్లు ధర్నాలు చేశారక్కడ. కాని నిగ్రహం లేదు.ఇక మరో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌.. పిసికితే చచ్చిపోతావ్‌ బిడ్డా అని రేవంత్‌ రెడ్డిని హెచ్చరిస్తారు. ఏం భాష ఇది? రేవంత్‌ మాటలు బాగుండకపోవచ్చు గాని ఈ చచ్చిపోతావ్‌ బిడ్డా అని అధికారిక కార్యక్రమాల్లో అదరగొడతారా? తలసాని ఒకప్పుడు కెసిఆర్‌నే ఇలా దూషించడం మాతో సహా అందరికీ తెలుసు. అదంటే ఉద్యమాలు వివాదాల కాలం. ఇప్పుడు అధికార బాధ్యతల్లో వుండి ఇలా మాట్లాడ్డం మరీ దారుణం. ఇంత రణం ఇక్కడ చేసినా మరుసటి రోజు నల్దొండలో మంత్రి జగదీశ్వరరెడ్డి మనుషులకూ మాజీ మంత్రి కోమటిరెడ్డి వర్గానికి మధ్య సంకుల సమరం జరిగిందే.. దీన్నింట్టి తెలిసేదేమిటి? ఏకచ్చత్రం కదులుతుందని కదా!ఎవరికైనా ఎక్కడైనా అంతే మరి.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *