దొరికిపోయిన చంద్రుడు! బదిలీ అయిన శ్రీదేవి

విదియనాడు కనిపించని చంద్రుడు తదియ నాడు తానే కనిపిస్తాడని సామెత. ధర్నాచౌక్‌ ఆందోళన సందర్భంగా ఉద్రిక్తత పెంచేందుకు పోలీసులను ఉపయోగించిన వైనం నిన్ననే చెప్పుకున్నాం. దానికిపోటీగా హౌంమంత్రితో సహా టిఆర్‌ఎస్‌ నాయకులు కమ్యూనిస్టులపై దాడి కేంద్రీకరించారు. స్థానికుల ముసుగులో మఫ్టీ పోలీసులను కూచోబెట్టిన నిజాన్ని దాటేశారు. అయితే మీడియాలో సోసల్‌ మీడియాలో అదే మార్మోగింది. దాంతో అనివార్యంగా ఈ రోజున శ్రీదేవి అనే సిఐని బదిలీ చేశారు. విమర్శలకు స్పందించినట్టు వుండటమే గాక ఆమె అందుబాటులో లేకుండా చేయడానికి కూడా ఇది దారితీయొచ్చు. ఎర్రజెండా గూండాలు అని పతాకశీర్షిక నిచ్చిన అధికార తెలంగాణ పత్రిక కూడా అలాటి ఫోటోలను ప్రచురించలేకపోవడం గమనించదగ్గ విషయం. నిన్ననే చెప్పినట్టు కుర్చీల విధ్వంసాన్ని మాత్రం ప్రచురించి తలలు పగిలిన చేతులు విరిగిన సిపిఎం కార్యకర్తల ఫోటోలు ఒక్కటంటే ఒక్కటైనా ఇవ్వకుండా ఖండనల పరంపరకే పరిమితమైనారు. రక్తం ఎవరిదైనా ఒకటే కదా.. పైగా స్థానికులు కార్యకర్తలను మంచినీళ్లు ఇచ్చి ఆదరిస్తున్న పోటోలు కూడా అన్ని పత్రికల్లో వచ్చాయి. అందుకే చంద్రుడు వెన్నెల్లో చంద్రుడిలా కెసిఆర్‌ ప్రభుత్వం ధర్నాచౌక్‌లో దొరికిపోయింది!

Facebook Comments

One thought on “దొరికిపోయిన చంద్రుడు! బదిలీ అయిన శ్రీదేవి

  • May 16, 2017 at 7:36 pm
    Permalink

    రాజకీయ నాయకులంటేనే ముందు ఒకటి చెప్పి వెనక వేరొకటి చేసేవారని అర్ధం. వారు ఎన్ని అబద్దాలు ఆడినా ఎప్పటికి నిజాలు మాత్రం మాట్లాడే దమ్ము వారికుండదు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *