టిఆర్‌ఎస్‌ ప్లీనరీ ప్లానర్స్‌

టిఆర్‌ఎస్‌ ప్లీనరీలో మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షుడుగా ఎన్నికవుతారనే దానిపై ఎవరికీ సందేహాలు లేవు గనక అది పెద్ద వార్తేమీ కాదు. ఇన్నేళ్లు గడిచినా ఆయన ఇష్టప్రకారం జరిగే నియామకాలు తప్ప అత్యున్నతస్థాయిలోనూ కమిటీలు, ఇతర బాధ్యతలూ స్థిరపడకపోవడం రాజకీయ లోపమే. పైగా రాష్ట్రావతరణ తర్వాత ఇతర పార్టీల నుంచి తీసుకున్నవారికి పెద్ద పీట వేయడం కూడా కనిపిస్తున్న వాస్తవం. ఈసారి అదనంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు వూహాగానాలతో ఒక విధంగా రంగం సిద్ధం చేశారు. అంటే పార్టీలోనూ వారసత్వ ప్రక్రియ పూర్తవుతుందన్న మాట. మహారాష్ట్ర తమిళనాడు అనుభవాలు చూసిన తర్వాత కెసిఆర్‌ ఈ విషయంలో ఎలాటి రిస్కు తీసుకోరని అర్థమై పోయింది. ఇక ప్లీనరీ ప్రసంగాన్ని పరికిస్తే కొత్తదనమేమీ లేదు. రైతులకు నగదు బదిలీ పథకాన్ని వృత్తిదారులకు వసతులనూ వివరించడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. పదేపడే చప్పట్టు గట్టిగా లేవని విసుక్కున్నారు. పథకాలకు అంతర్గత స్పందనే అంత బలహీనంగా వుంటే బయిటనుంచి ఓట్ల వాన కురుస్తుందని ఎలా అనుకుంటున్నారో తెలియదు.

.రైతాంగానికి ఎరువులు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రినాటకీయంగా, ఆకస్మికంగా ప్రకటించారు. ఇది ప్రతిపక్షాలను నివ్వెరపోయేట్లు చేసిందని మీడియాలో కథనాలు హోరెత్తించారు. నాలుగేళ్ళపాటు రూ.4వేల కోట్ల చొప్పున రుణమాఫీ పథకం అయిపోయిందని చెప్పారుగనుక, ఐదవ ఏట అంటే ఎన్నికల సంవత్సరంలో ఆ మొత్తాన్ని ఎరువుల పేరిట రైతులకు బదలాయించటం ఈ ప్రకటన సారాంశమని నేను మొదట్లోనే విశ్లేషించాను . వివరాలు కావాలి గనుక వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని అన్నప్పటికీ వాస్తవంలో ఎన్నికల కోణం అందరికీ తెలిసిందే. పైగా ఈ మొత్తం అందించేందుకు, నిర్వహించేందుకు గ్రామాల స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలంటూ ో టిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల పెద్ద వ్యవస్థ ప్రభుత్వ వ్యయంతో ్ల ఏర్పడుతుంది. అలాగే ఈ సహాయం పెద్ద రైతులకు కూడా అందించటం జరుగుతుందని చెప్పినమాట కూడాో నిజమని తేలింది. పైగా కెసిఆర్‌ఉపాధి హామీ పథకం వల్ల రైతాంగానికి కూలీలు దొరకడం లేదన్నట్టు వ్యాఖ్యలు చేయడం విచిత్రం. వాస్తవానికి వారికి ఇవ్వాల్సిన బకాయిలు రెండు తెలుగుద రాష్ట్రాల్లోనూ పేరుకుపోయాయి. . వృత్తిదారులకు ఆధునిక క్షౌరశాలలు, వాషింగ్‌ మెషిన్లు వంటివి ఇస్తామన్నది కూడా ఈ తరహాలోనే ఉభయతారకంగా చేసిన ఆలోచన. . సంక్షేమ పథకాలు స్వాగతించినా, పేరుకుపోయిన మౌలిక సమస్యలకు వ్యవస్థాగత అంశాలకు అవి పరిష్కారం చూపలేవు. ప్రత్యేకించి తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఇతర రాజకీయ ప్రసంగాలు ప్రచారాలు కన్నా దాన్ని పరిష్కరించడం కోసం నిజమైన చర్యలు చేపడితే మంచిది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *