మొదలైన ట్రంపోన్మాదం- తెలుగు ఇంజనీర్‌ శ్రీనివాస్‌ బలి

ఫోటోలో హంతకుడు ప్యూరింటన్‌, ో మధ్యన శ్రీనివాస్‌, చివర అలోక్‌ రెడ్డి… కింద చికిత్స పొందుతున్న గ్రిలాట్‌

 

అద్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జాతి విద్వేష మత విద్వేష విధానాల వినాశకర ప్రభావం మొదలైంది. ఈ క్రమంలో తెలుగువాడైన కూచిభోట్ల శ్రీనివాస్‌ అనే ఏవియేషన్‌ ఇంజనీర్‌ మొదటి బలిగా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచి వేసింది. అతని స్నేహితుడైన మేడసాని అలోక్‌ రెడ్డి మరో అమెరికన్‌ యువకుని రక్షణ కారణంగా బతికి బయిటపడ్డాడు. అయితే ఆ విధంగా కాపాడిన ఇయాన్‌ గ్రిలాట్‌ గాయాలపాలై చికిత్స పొందుతున్నాడు. కన్సాస్‌ రాష్ట్రంలోని ఒక బార్‌లో ఇంతటి అమానుషానికి పాల్పడింది ప్యూరింటన్‌ అనే ఒక మాజీ సైనికుడు ఔ. మీరు మా దేశం నుంచి వెళ్లిపోండి అంటూ వివాదం పెట్టుకుని జాతి విద్వేష వ్యాఖ్యలు చేశాడు. దీనికి వారు నిరసన తెల్పుతుండగానే శ్రీనివాస్‌ను కాల్చేశాడు. అలోక్‌ రెడ్డిపై కూడా దాడి చేయగా అక్కడే వున్న గ్రిలాట్‌ అడ్డుపడి కాపాడాడు. ఇది జాతి విద్వేషం కారణంగానే జరిగిందని అమెరికా పోలీసులు అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇది మతద్వేషంతో చేసిన హత్య అని అమెరికా హిందూ ఫౌండేషన్‌ ప్రకటించింది. అలాటి దాడిని అడ్డుకోవడం సరైన పనేనని తాను భావించినట్టు గ్రిలాట్‌ చెప్పారు.
స్వతహాగా తాగుబోతు అయిన ప్యూరింటన్‌ ఈ కాల్పులు జరిపాక తాపీగా వెళ్లి మరో చోట మందుతాగాడు. భారతీయ యువకుడిని కాల్చివేయడం వల్ల కలిగిన ఒత్తిడి నుంచి బయిటపడేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అతనన్నాడు.ఒక గంటలోగా పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. శ్రీనివాస్‌ అలోక్‌ చాలా మంచి వాళ్లని వారానికి రెండు సార్లు వస్తుంటారని అక్కడ బేరర్‌ చెప్పాడు. తాము అధికారికంగానే అక్కడ ఇంతకాలంమేధావలస విధానంలో భారతీయుల సేవలను ప్రధానంగా వుపయోగించుకున్న అమెరికా అద్యక్షుడు ట్రంప్‌
హయాంలో వీసా నిబంధనల సవరణ పేరిట వలసల నిరోధం పేరిట ఉన్న ఫళంగా వెళ్లగొట్టే అన్నాయమైన విధానం ప్రకటించింది.అక్రమ వలసల పేరిట 1.10 కోట్ల మందిని పంపేసే ప్రయత్నం మొదలైంది. కనీసం మూడు లక్షల మంది భారతీయులకు ఇది తక్షణం సమస్యగా మారుతుందని అంచనా. దీనిపై గట్టిగా నిరసన తెలిపే బదులు మోడీ ప్రభుత్వం సన్నాయినొక్కులు నొక్కుతున్నది. తమ వీసా విధానం ఏ దేశమైనా ఇష్ట ప్రకారం పెట్టుకోవచ్చని పరోక్షంగా వంతపాడుతున్నది. ఇప్పుడు ఈ ఘటనపై కూడా ఖండనలు వెలువడినా మూల కారణంగా వున్న విధానాల పైన సమీక్షకు సిద్దంగా లేరు. ఈ హత్యను ఒక హెచ్చరికగా తీసుకోకపోతే వేలాది అమెరికన్‌ భారత కుటుంబాలు వారిపై ఆదారపడిన కుటుంబసభ్యులు ఒక్కసారిగా వీఢినపడతారు. ఈ మత విద్వేషాలు భారత్‌పై అంతర్గతంగానూ ప్రభావం చూపిస్తాయి. దీన్ని సాంకేతికాంశంగా గాక సామాజిక సమస్యగా చూడటం చాలా అవసరం.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *