వెంకయ్య స్వోత్కర్షలో వెల్లడైన సత్యాలు

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్వోత్కర్ష నానాట శ్రుతి మించుతున్నది. అందుకే ఆయన సీనియర్‌ నేత అయినా విమర్శించవలసి వస్తుంది. తెలుగువారిలో ప్రధానులు రాష్ట్రపతులూ జాతీయ ప్రధాన కార్యదర్శులూ అద్యక్షులూ చేసిన వారెందరో వున్నారు. వారితో పోలిస్తే వెంకయ్య నాడూ నేడూ కూడా స్వయం ప్రకాశం కొరవడిన సమన్వయకర్తగానే నెట్టుకొస్తున్నారనేది నిజం. వాజ్‌పేయి అద్వానీల శకంలో రెండేళ్ల కాలం అద్యక్ష పదవి నిర్వహించడం వారి ఆశీస్సులు అండదండల ఫలితం తప్ప ఆంతా స్వంత ప్రతిభే కాదని గుర్తుంచుకోవడం నమ్రత అనిపించుకుంటుంది. కావాలంటే ఆయనకన్నా అధికతర ప్రభావం చూపిన వారి జాబితాను ఇవ్వొచ్చు. తనను తాను పొగుడుకోవడంతో ఆగక చంద్రబాబును కూడా అదేపనిగా పొగడ్డాన్ని సమర్థించుకున్నారు.
ప్రత్కేక హౌదా విషయంలో తానే అడిగానని మరెవరికీ తెలియదని ఢిల్లీ సమావేశంలోా మరోసారి చెప్పుకున్నారు. ప్యాకేజీ వల్ల దాన్ని మించిన లాభం కలిగిందని నిరాధారమైన గొప్పలు పోయారు. ఇవన్నీ ఎంత అవాస్తవాలో అరుణ్‌జైట్లీ బడ్జెట్‌తోనే తేలిపోయింది.
రాజధాని రైతులకు క్యాపిటల్‌ గెయిన్స్‌ టాక్స్‌ మినహాయింపుపై కృతజ్ఞతల ప్రహసనం పేరిట ఢిల్లీకి తీసుకుపోయారు. దీనికి సంబంధించిన సమస్యలు ఫిర్యాదులు మరోసారి చూద్దాం. కాని ఆ సందర్భంలో వెంకయ్య మరో వేదవాక్యం చెప్పారు. ఈ టాక్స్‌ మినహాయింపు చిన్నదేనని బడ్జెట్‌లో అవసరం లేదని అధికారులు తనకు చెప్పినా పట్టుబట్టి చేర్పించారట. అంలే దాని పరిమితి ఏమిటో ఆయన నోటనే చెప్పారన్నమాట. అయితే ఈ ఢిల్లీ పర్యటన తతంగాలు కూడా ఆ ప్రచార యావలో భాగమనే అనుకోవాలి కదా!

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *