డా.దేవినేని జగన్‌ మాటలు స్పష్టంగా విన్నారా?

ఎపి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాకు బాగా తెలిసిన వ్యక్తి. బాగా మాట్లాడ్డం అంతకు మించి వాదోపవాదాలు చేయడంలో దిట్ట. అయితే ఆయన సైకియాట్రిలోనూ బాగా ప్రవేశం వున్న వారని అంతగా తెలియదు. ఈ రోజు ఛానళ్లలో పారనోయా అనే మానసిక వ్యాధి గురించి రకరకాలుగా విశదపర్చడం చూసి ఆశ్చర్యపోయాను. జగన్‌ను మాత్రమే గాక ఇతరులను కూడా ఆయన పరీక్షించారేమో నాకు తెలియదు. లేక జగన్‌ తాను ముఖ్యమంత్రినని వూహించుకుంటున్నారన్నట్టే ఉమ కూడా తాను సైకియాట్రిస్టునని వూహించుకుంటున్నారేమో కూడా తెలియదు. పారనోయా అన్నది ప్రపంచమంతటా నియంతలకూ అధికార దాహం తలకెక్కిన వారికి వస్తుంటుంది. నచ్చనివారందరినీ ఆ విధంగా తిట్టిపోయడం కూడా రాజకీయ వ్యాపార మేధా ప్రపంచాలలో జరుగుతూనే వుంటుంది. జగన్‌పై ఎదురుదాడిలో ఉమ ఎప్పుడూ దూకుడుగానే వుంటారు గనక దాన్నేం నేను పెద్ద సమస్యగా తీసుకోను. అది ఆయన లేదా ఆయన పార్టీ వారు చూసుకోవలసిన విషయం.
విశాఖ విమానాశ్రయం రన్‌వేపై ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం, అస్పష్టమైన ఐడెంటిటీ గల సాయుధులు రావడం నిస్పందేహంగా భద్రతా సమస్యే. దాని కొనసాగింపుగా ఆయన రన్‌వేపై కూచోవడం కూడా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన బైఠాయింపును తప్పు పట్టారు గాని ముందు అక్కడ పోలీసులు ఎందుకు ఆటంకపర్చాారనేది చెప్పలేదు.( నా వరకు నేను చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు అనుచితంగా ప్రవర్తించిన నాటి ప్రభుత్వాన్ని కూడా విమర్శించాను. నిమ్స్‌కు వెళ్లి పరామర్శించాను కూడా.)
ఎయిర్‌పోర్టులో జగన్‌ నేను రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రినవుతానని ్‌ అన్నారనేది మొదట ఈనాడులో చదివాను. ఆ వార్తలో వున్న క్లిప్పింగులో చూస్తే మాత్రం వినిపించలేదు. అప్పటినుంచి ఒకటిరెండు సార్లు ప్రయత్నించాను గాని ఎక్కడా ఆ మాటలు స్పష్టంగా లేవు. ఆ సమయంలో అక్కడ వున్న మరో మాజీ ఎంఎల్‌ఎను గట్టిగా అడిగితే ‘ సిఎం అయితే ఇలా చేస్తారా?’ అని జగన్‌ అన్నారని చెబుతున్నారు. దాన్ని ట్విస్టు చేశారని ఆయన ఆరోపణ. ఏదైతేనేం జగన్‌పేరుతో సిఎం అనే మాట కలిసి వినిపించడం మంచిదే కదా అని ఆయన అభిమానులు కొందరి ఆనందం. ఈ రోజు సాయింత్రం ఎన్‌టివిలో జగన్‌ మాటలు సబ్‌ టైటిల్స్‌ వేసి చూపించారు గాని అందులోనూ ఈ ముఖ్యమంత్రినవుతానని అన్నట్టు వేయలేదు.చాలామంది ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు వైఎస్‌ వంటివారు కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని అధికారంలోకి వస్తామని అనడం మాకు తెలుసు.
ఇక్కడ తేలాల్సిందేమంటే 1.జగన్‌ అలా స్పస్టంగా అన్నట్టు ఆధారాలు వుంటే చూపించడం. 2.అది డా.దేవినేని ఉమ చెబుతున్నట్టు పారనోయా కిందకు వస్తుందా అని పరిశీలించడం. 3.గతంలో అలా అన్నవారంతా ఆ కోవలోకే వస్తారా అని కూడా ఆలోచించడం. లేకపోతే ఈ దండగమారి వివాదం ఇలా నలుగుతూనే వుంటుంది. చాలా సమస్యలు పక్కకు పోయి దీనిచుట్టే తిప్పుతూ వుంటారు కూడా.

Facebook Comments

2 thoughts on “డా.దేవినేని జగన్‌ మాటలు స్పష్టంగా విన్నారా?

 • January 28, 2017 at 7:30 am
  Permalink

  this just diverting people from main issue, idiots. Never answer people. really when does this gov. and people leave us alone.

  Reply
 • January 28, 2017 at 7:57 am
  Permalink

  Cbn strategy is simple, you have 10 channels which can flood the screen space and people’s mind space. Use them to spread inconsequential unverified comments. The same media has never cared to show clippings of cash for vote conversations so regularly.cbn never denied that it was his voice. So indirectly accepted that it was his voice. But the same media never cared to show this as regularly as they are showing this inconsequential unverified statement. There is no rationality. this is dual standards.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *