అరెస్టుల మధ్యనే ప్రత్యేకహౌదా ప్రతిధ్వని- సినీజనం మద్దతు- నోరుజారిన సుజన-


చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందస్తు ఆంక్షలు ఆటంకాలతో ప్రత్యేకహౌదా ఉద్యమానికి మరింత వూపునిచ్చినట్టు కనిపిస్తుంది. విశాఖపట్టణంలో అడుగడుగునా ఆంక్షలు విధించినట్టు అరెస్టులు సాగుతున్నట్టు దాదాపు అన్ని పత్రికలూ ఛానళ్లూ కథనాలిస్తున్నాయి. ఈ దఫా ప్రజల ఆగ్రహావేదనలను అంచనా వేయడంలో ప్రభుత్వం విపలమైంది. విశాఖ పట్టణంలో ఆర్కేబీచ్‌లో కొందరు యువకులు మౌన దీక్ష మొదలుపెట్టారు. ఉడా పార్కు దగ్గర సాయింత్రం దీక్ష జరుగుతుందని మెసేజ్‌లు అందుతున్నాయి. నటుడు శివాజీ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు సంధించారు. తమ్మారెడ్డి భరద్వాజ సంపూర్ణేశ్‌ బాబు వంటి వారు ఇప్పటికే విశాఖ చేరుకోగా పోలీసులు అరెస్టు చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్టు కొనసాగిస్తున్నారు. పోలవరంలో రాయపాటి సాంబశివరావు కాంట్రాక్టు కోసం ప్రత్యేకహౌదా తాకట్టు పెట్టినట్టు ఆయన పేర్కొన్నారు. రాజమౌళి, రానాలు కూడా మద్దతు సూచించే ట్వీట్టు పెట్టారు. మరో వైపున కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రత్యేక హౌదా ముగిసిపోయిందని ప్రకటించారు. అంతటితో ఆగక జల్లికట్టును ప్రస్తావించి ఎవరైనా కావాలంటే కోడిపందేలు పందుల పందాలు పెట్టుకోవచ్చని నోరు జారారు. సినీ రచయియ చిన్నికృష్ణ అది మీకే వర్తిస్తుందంటూ ఎదురుదాడి చేశారు. విశాఖలోనే గాక విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు పలు చోట్ల హౌదా ఆందోళనలు జరుగుతుంటే అరెస్టులు చేస్తున్నారు.మంత్రులు అచ్చెం నాయుడు వంటివారు జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆయన కాన్వారుని ఆడ్డుకున్నారు.ఈ పరిస్థితుల్లో సాయింత్రం ఏ విధమైన ఆందోళన జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *