దావోస్‌: ట్రంప్‌ సంకోచం- చంద్రబాబు సంతోషం

దావోస్‌లో జరిగే అంతర్జాతీయ ఆర్థిక తిరణాల వంటి వరల్డ్‌ ఎకనామిక్‌ పోరమ్‌ సమావేశాలకు ఈ సారి అమెరికా అద్యక్ష విజేత డోనాల్డ్‌ ట్రంప్‌ హాజరు కావడం లేదు. అగ్ర కంపెనీల సిఇవోలు, ఆర్థిక వేత్తలు, అధినేతలు హాజరయ్యే ఈ సమావేశం అనధికారిక చర్చలకూ మంతనాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. మామూలుగా అక్కడ అమెరికాకు పెద్ద పీట వుండగా ఈ సారి ట్రంప్‌ గైర్‌ హాజరు కాకపోవడానికి అదే కారణమని ఆయన సహాయకులొకరు చెప్పారు. అలాటి కుబేరుల కూటమికి హాజరు కావడం వల్ల తమ దేశ ప్రజలకు తప్పు సంకేతాలు వెళ్లవచ్చని విరమించుకున్నట్టు ఆ ప్రతినిధి అనధికారికంగా చెప్పారు. మొత్తంగానే ఈ సారి అంతర్జాతీయ ఆర్థిక ఒడుదుడుకులు బ్రెగ్జిట్‌, చైనాకు కొన్ని చిక్కులు వంటివి ప్రధానంగా చర్చను ఆక్రమించనున్నాయి. చైనా అద్యక్షుడు సీ జిన్‌పింగ్‌ సమావేశాలను ప్రారంభించడమే గాక ప్రపంచీకరణ అందరినీ కలుపుకొని పోయేలా సమ్మిళిత స్వభావంతో వుండాలనే సందేశం సిద్ధం చేసుకున్నారు. చైనా రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నది గాని మూడో స్థానంలో వున్నట్టు చెప్పబడిన ఇండియా ఆ స్థానం కోల్పోయింది. ఐఎంఎఫ్‌ తాజా నివేదిక మన అభివృద్ధి రేటుఅంచనాను 7.5 నుంచి 6.6. శాతానికి తగ్గించి వేసింది. xi-jinping_650x400_81479708656అతి వేగంగా అభివృద్ధి చెందే దేశం హౌదా కోల్పోయిన ఇండియా తరపున వందమంది సిఇవోలు దర్శకులు ఇతరులు హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ,నిర్మలా సీతారామన్‌లతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రతినిధి వర్గాన్ని తీసుకుని వెళ్లారు. షరా మామూలుగా దీన్ని తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటుంటే ప్రతిపక్షాలు చప్పరిస్తున్నాయి. క్రమం తప్పకుండా దావోస్‌ వెళ్లే చంద్రబాబుకు అక్కడ సంబంధాలు బాగుండొచ్చు.అలాగే ఐఎంఎఫ్‌ ప్రపంచబ్యాంకులకు ఆయన ఇష్టుడు గనక కొన్ని ఈవెంట్స్‌లో మాట్లాడొచ్చు గాని అదంతా అలంకార ప్రాయమే.అసలు ఇండియాకే ప్రాధాన్యత లేకుండా పోతే అందులోని విభజితాంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వాధినేతకు ఎదో పెద్ద స్థానం వున్నట్టు చెప్పడం అర్థం లేని విషయం. అంతర్జాతీయ మీడియా ఇచ్చే నివేదికల్లో ఇండియా గురించి గాని చంద్రబాబు గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నది లేదు. ఆఖరుకు బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక కూడా చంద్రబాబు దావోస్‌ పర్యటన వార్త ఇస్తూ ఇది ఇతChandrababu-Naidu-Getting-Ready-to-Lead-India-for-the-3rd-Time-at-Davosరులు పంపింది ప్రచురిస్తున్నట్టు నోట్‌ పెట్టింది! మరే ముఖ్యమంత్రి వెళ్తున్నట్టు సమాచారం కూడా లేదు. తమ కంపెనీల భవిష్యత్తు గురించి వారు ఆందోళన పడుతుంటే రాష్ట్రానికి ఏదో వొరుగుతుందని చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదం. వ్యక్తిగతంగానూ ప్రభుత్వ పరంగానూ సంబంధాలు పెరగొచ్చు గాని ఒరిగేది వుండదు. దీనిపై విమర్శలకు స్పందించిన తెలుగుదేశం ప్రతినిధులు మాత్రం ఏదో చాలా జరగబోతున్నట్టు సోషల్‌మీడియాలో వూదరగొడుతున్నారు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *