నోట్ల రద్దు బండారం బహిర్గతం

పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఆర్‌బిఐ ఇచ్చిన అధికారిక నివేదికతో నోట్లరద్దు విషయంలో ప్రధాని మోడీ ఎంత ఏకపక్షంగా వ్యవహరించారో తేలిపోయింది. మరికొన్ని నిజాలు కూడా వెల్లడైనాయి.
మొదటిది- ఈ నిర్ణయం ఆయనే తీసుకున్నారు. ఒక రోజు ముందే ఆర్‌బిఐని అడిగారు. వారు సమస్యలున్నాయని భావించినా అనివార్యంగా అంగీకరించారు. టెర్రరిజం నకిలీ నోట్టు అని చెప్పడం వల్ల ఒప్పుకున్నారు. అప్పుడు డిజిటైజేషన్‌ వూసే లేదు.
రెండవది- 2000 నోట్ల ముద్రణకు 2016 జూన్‌లోనే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ నోట్ల ముద్రణకూ రద్దుకూ సంబంధం లేదు. పాత నిర్ణయం గనకే ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా ఆ ముద్రణ ముగిసేదాక 500 మొదలు కాలేదు. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి ఏదో వ్యూమాత్మక నిర్ణయంగా చెప్పారు.
మూడవది- ఈ నిర్ణయం గురించి ఆరు నెలల ముందుగా కసరత్తు జరిగిందనేది అవాస్తవం. ఆ కసరత్తు 2వేల నోట్టకు సంబంధించింది మాత్రమే
నాల్గవది– మూడు లక్షల కోట్ల మేరకు అసలు బ్యాంకులకు రాకుండా పోతాయన్న అంచనాలు విఫలమైనాయి. మొత్తం వచ్చేశాయి. వచ్చిన వాటిలో మూడు లక్షల కోట్ల మేరకు ఆదాయపు పన్ను కట్టనిదని లీకులు ఇస్తున్నారు. అలా అనుకున్నా వారికి ఐటి నోటీసులు పంపడం తప్ప వెంటనే చేయగలిగింది శూన్యం.ఈ మొత్తం తతంగంలో వేల కోట్ల డబ్బు ప్రభుత్వపరమైందేమీ లేదు.
అయిదు– మోడీ చెప్పిన యాభై రోజులు పోయి ఆరవై రోజుల గడిచాక ఇప్పుడు ఎస్‌బిఐ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య మరో యాభై రోజులు కావాలని అధికారికంగా ప్రకటించారు.
ఆరు- ఎపి తెలంగాణ ముఖ్యమంత్రులు నోట్లరద్దుపై మోడీని ఎ ంతగా పొగుడుతున్నా వారి ఆర్థిక మంత్రులు మాత్రం చాలా సమస్యలు వచ్చాయని ఒప్పేసుకున్నారు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *