ఖైదీ 150లో రాజకీయ మిస్సింగ్స్‌, కమ్యూనిజం ప్రస్తావన తొలగింపు

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెంబర్‌ 150 పై సాధారణ సమీక్ష తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి. మొదటిది -భూ సేకరణ వంటి సమస్య తీసుకున్నా ఎక్కడా రాజకీయాలు గాని ప్రభుత్వ పాత్ర గాని చూపించకపోవడం. (నిజానికి ఠాగూర్‌ చిత్రంలోనూ ఈ ధోరణి వుంది.) తను రాజకీయాల్లో వున్నాను గనక లేనిపోని వివాదాలు వద్దని తనపైనా విమర్శలు రావచ్చని ఆయన అనుకుని వుండాలి. కేరళలోని పాల్ఘాట్‌ జిల్లా పల్లచ్చిమాడిలో కోకాకోలా కంపెనీ కోసం జల సమృద్ధమైన భూములు తీసుకుంటున్నప్పుడు ఆ వూరు మొత్తం చేసిన తిరుగుబాటు నేపథ్యంలోనే కత్తి కథ తయారైంది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌ రెండు చోట్లా వివిధ రూపాలల్లో భూ సేకరణలు వాటిపై పోరాటాలు సాగుతున్నాయి. అయితే ఖైదీలో ఎక్కడా ఈ ప్రస్తావన గాని సూచన గాని లేదు. రైతు రుణమాఫీ ప్రస్తావన మాత్రం వుంది. ఒక్క సన్నివేశంలో హౌం మంత్రికి చెప్పడానికి వెళ్లడం మినహా ప్రభుత్వం పాత్రను రాజకీయాలను లేకుండా చేశారు.
కోకాకోలాకు సంబంధించింది కావడం అదనపు సమస్య. ఏమంటే చిరంజీవి గతంలో కోకాకోలాకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేశారు.ఆ రోజుల్లో దానిపై విమర్శలు వస్తే సమర్థిస్తూ మరిన్నియాడ్స్‌ చేశారు.కనుక వాటిని తీసుకోలేరు.
ఈ రెండు ఒకరకమైతే కత్తిలో కమ్యూనిజం గురించి వున్న ప్రస్తావనలు ఎందుకు తీసేసినట్టు? హీరో అతని చెల్లెలు కమ్యూనిస్టు సాహిత్యం చదవడం, మాట్లాడ్డం వుంటుంది. చాలా కమర్షియల్‌ చిత్రాల్లోనూ విప్లవ కర సంభాషణలుంటాయి.కాని ఈ చిత్రంలో వున్నవి తీసేయడం ఆశ్చర్యమే.

స్వతహాగా కమ్యూనిస్టు అభిమానులైన పరుచూరి సోదరులు రీమేక్‌లో ఈ డైలాగులు తాముగా తీసేసి వుంటారని అనుకోలేము. బహుశా మెగా ఫ్యామిలీ ఆదేశాల మేరకే అవి తప్పిపోయాయి

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *