అడుగు పడని అమరావతికి రెండేళ్లు!

ఆంధ్ర ప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగి డిసెంబరు 31కే రెండేళ్లు పూర్తయినా అడుగు ముందుకు పురోగతి మృగ్యం. 2014 డిసెంబరు 31న క్యాపటల్‌ి రిజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సిఆర్‌డిఎ- క్రిడా) ఏర్పడింది. తాత్కాలికమో శాశ్వతమో తెలియని సచివాలయ భవనం మినహా కట్టడం పూర్తయింది లేదు, కనీసం వాటి నిర్మాణ ప్రణాళికలు సిద్ధమై టెండర్లు పిలవడం గాని,బిల్డర్‌ ఎంపిక గాని పూర్తయింది లేదని ప్రజాశక్తి సవిరమైన కథనం ఇచ్చింది. రాజధానికి ఎవరో అడ్డం పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన శిష్యులు ఆరోపిస్తుంటారు గాని వ్ణాస్తవానికి ప్రభుత్ప అస్పష్టత నాయకుల అత్యాశలే ఆటంకమవుతున్నాయి. ఆ ఆలస్యం ఉద్దేశపూర్వకమనీ, ఎన్నికల నాటికి ఇదే ఎజెండాగా వుంటేనే మంచిదని టిడిపి ఆలోచిస్తున్నట్టు కూడా సందేహాలున్నాయి. మొత్తం అంచనా వ్యయం 65 వేల కోట్లు కాగా కేంద్రం ఇచ్చిన 2500 కోట్టు కూడా పూర్తిగా ఖర్చయినట్టు కనిపించదు. ముఖ్యమంత్రి ఆధ్వర్యాన ఒక మాష్టర్‌ ప్లాన్‌ను ఎంపిక చేసిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. స్విస్‌ ఛాలెంజ్‌ టెండర్‌, కన్సార్టియం ఎంపిక కూడా ఏకపక్షంగా జరగడంతో కోర్టులో వీగిపోయింది. రాజధాని మాట అటుంచి వ్యాపార నగర మాష్టర్‌ డెవలపర్‌ ఎంపిక కూడా చెల్లకుండా పోయింది. 2017 నాటికి సగం పనులు పూర్తవుతాయని 2018లో ప్రత్యక్ష పాలన మొదలవుతుందని చెప్పిన మాటలు నిజమయ్యే అవకాశమే కనిపించడం లేదు. మొత్తం ఖర్చు 65 వేలకోట్లలో 15 వేలు కేంద్రం ఇస్తే అందులో 9 వేలు హైకోర్టు, వివిధ కార్యాలయాల నిర్మాణానికి వెచ్చించనున్నట్టు చెప్పారు.
వాస్తవానికి అప్పట్లో అమరావతిలో భవనాలు సదుపాయాల నిర్మాణంతో పాటు ఉద్యోగ కల్పన,, నిరుద్యోగభృతి, పెన్షన్‌, గృహ నిర్మాణం తదితర వాగ్డానాలు గుప్పించారు. గ్రామకంఠాల సమస్య పరిష్కారానికి క్రిడా కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ అద్యక్షతన ఏర్పాటైనకమిటీ కూడా ఎలాటి పరిష్కారం ఖరారు చేసింది లేదు. చుట్టుపక్కల నందిగామ, కంచిక చర్ల, గుడివాడ,గన్నవరం, తెనాలి,సత్తెనపల్లి తదితర చోట్ల అభివృద్ధి కేంద్రాలు(గ్రోత్‌ సెంటర్లు) హబ్‌లు కారిడార్లు ఏవేవో వినిపించాయి.ఇప్పటికీ అవన్నీ కాగితాలపైన వుండిపోవడమే గాని వాస్తవరూపం దాల్చింది లేదు.
వీటన్నిటికన్నా దారుణమేమంటే రైతులకు ప్లాట్టు పంపిణీ పేర లాటరీలు వేసి నెంబరు ఇచ్చారే గాని స్థలాలు ఇచ్చింది లేదు.లేఔట్‌ కూడా వేయలేదని రైతులు వాపోతున్నారు. సమగ్రమైన రీజయనల్‌ ప్లాన్‌కూడా తయారు కాలేదు గనక ఒకప్పటి ఉడా ప్లానునే అనుసరిస్తున్నారు. అయితే ప్రైవేటు (విద్యా) సంస్థల వెంటబడి మరీ స్థలాలు కేటయించారు. రోడ్డు వేస్తానన్న కాంట్రాక్టరు కూడా తోకపీకడంతో 2దీ నడిచింది లేదు. ఇదీ మూడు శంకుస్థాపనల తర్వాత అమరావతి ప్రోగ్రెస్‌ రిపోర్టు. ఇలా ఏ పనులు జరగనప్పుడు హామీలు అమలు కానప్పుడు అది భ్రమరావతే అనడంలో తప్పేముంది? అయినా అక్కడ విశ్వనగరం వస్తుందని మనం నమ్మాలి. విమర్శిస్తే ఉన్మాదులు టెర్రరిస్టులు రాక్షసులూ అయిపోతారు జాగ్రత్త

Facebook Comments

One thought on “అడుగు పడని అమరావతికి రెండేళ్లు!

  • January 2, 2017 at 12:15 am
    Permalink

    Good article sir. I like your postings. Happy new year 2017 sir. I am ysrcp supporter but I like always your articles and your opinion.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *