కాస్ట్రో నాయకత్వం- క్యూబా విప్లవం

అమెరికా ఖండంలో తొలిసారిగా ఆ దేశానికి అతి సమీపంలో విప్లవ సాధనకు నాయకత్వం వహించిన వ్యక్తి ఫిడెల్‌ కాస్ట్రో. అంతేగాక మిగిలిన చాలా సోషలిస్టు దేశాలలో ఎదురుదెబ్బలు తగిలినా అచంచలంగా కొనసాగుతున్న దేశం అది. 1961 నుంచి ఆంక్షలతో వేధించిన అమెరికా అద్యక్షుడు బారక్‌ ఒబామానే చివరకు సందర్శించాల్సి వచ్చింది. obit_fidel_castro-1 fidel-castro_289d0314-b3a5-11e6-aa81-69e46120af64
కొలంబస్‌ 1492లో క్యూబాలో అడుగుపెట్టినపుడు అక్కడ ఆర్వాక్‌ ఇండియన్లు జీవిస్తుండేవారు. 1511 నాటికి అక్కడ స్పెయిన్‌ సామ్రాజ్యవాదులు స్థావరం ఏర్పరచుకున్నారు. తమ చక్కెర అవసరాల నిమిత్తం క్యూబాలో చెరకు పంటను బాగా వ్యాప్తి చేశారు. ఇందుకోసం భారీ ఎత్తున నల్లజాతి బానిసలను దిగుమతి చేసుకున్నారు. దొంగలను, నేరస్థులను కూడా పంపేవారు. పీడనకు బానిసత్వానికి వ్యతిరేకంగా స్థానిక ప్రజానీకం పెద్ద ఎత్తున ప్రతిఘటన సాగించారు. 1867 నుంచి 1878 వరకూ జరిగిన ఈ పోరాటం ఫలితంగా 1886లో బానిసత్వం నిర్మూలించ బడింది. 1895లో కవి జోస్‌ మార్టి నాయకత్వంలో సాగిన ప్రతిఘటనోద్యమం అంతిమంగా స్పానిష్‌ నియంతృత్వానికి సమాధి కట్టింది. కాని ఆ స్థానంలో అమెరికా పెత్తనం మొదలైంది. స్పెయిన్‌ను ఎదుర్కోవడానికి సహకరించినట్టు కనిపించే అమెరికా 1889లో చేసుకున్న ఒప్పందం ప్రకారం క్యూబాను తన ఉపగ్రహ దేశంగా చేసుకుంది. అమెరికన్ల విలాసాలకు కూడా దాన్ని ఒక స్థావరంగా చేసుకున్నారు. 1902 వరకూ ఆ దీవులను ప్రత్యక్షంగా ఆక్రమించుకున్న అమెరికా తర్వాత పరోక్ష పెత్తనం సాగిస్తూ వచ్చింది.ఇందుకోసం 1901లో ప్లాట్‌ సవరణ చేసింది. 1933లో సైనికాధికారి ఫ్లూజినికో బాటిస్టా తదితరులతో కూడిన బృందం అద్యక్షుడు గ్రెడో మచాదోను కూలదోసి సైనిక కుట్రతో అధికారం వశపరుచుకుంది. 1940లో బాటిస్టా అద్యక్షుడై ఒక అవినీతికర నియంతృత్వ రాజ్యాన్ని స్థాపించాడు.
బాటిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యూబాలో ప్రజా ఉద్యమం రోజు రోజుకు రాజుకోసాగింది. అందులో ప్రముఖమైంది – యువ విప్లవకారుల్ని సమీకరించి ఫైడల్‌ కాస్ట్రో నిర్వహించిన సాయుధ పోరాటం!
కాస్ట్రో జూలై 26, 1953న శాంటియాగో డి క్యూబా లోని మన్‌కాడా ఆయుధాగారం మీద తన 82 మంది అనుచరులతో దాడి చేశాడు. ఆయుధాగారాన్ని కొల్లగొట్టి ప్రజలకు పంచిపెట్టి బాటిస్టాకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించాలని కాస్ట్రో ప్రయత్నం. ముట్టడిలో కాస్ట్రో అనుచరులు అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించినప్పటికి ముట్టడి వైనం ముందుగానే తెలియడంవల్ల కాస్ట్రోతో సహా అతని అనుచరులు బంధించబడ్డారు. వారిలో చాలా మంది దాcastroరుణంగా వధించబడగా, కొందరిని జైళ్ళలో బంధించారు. కాస్ట్రోకు మాత్రం పదిహేను సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
‘మన్‌కాడా’ ముట్టడి కేసులో కాస్ట్రోను న్యాయస్థానంలో హాజరుపరిచినపుడు ”ననిర్దోషిత్వాన్ని చరిత్రే నిరూపిస్తుంది.” అనే తన ప్రసంగంలో 1940 రాజ్యాంగాన్ని పున్ణప్రతిష్టించడం, శాసన నిర్మాణం, కార్యనిర్వాహక న్యాయాధికారాలను స్వాధీనపరచుకోవడం, భూమిని రైతులకు పంచియివ్వడం, లాభాల పంపకం ప్రాతిపదికగా వ్యవసాయక, పారిశ్రామికాభివృద్ధి, బాటిస్టా ముఖ్య అనుచరుల ఆస్థుల ఆక్రమణలన్నింటిని తమ ఉద్యమ దృక్పథాలను విశదపరచి దానిని జులై 26 విప్లవంగా అభివర్ణించాడు. ఈ ఉపన్యాసం ఓటమి చెందిన విప్లవాన్ని మలుపు తిప్పి విజయపథాన నడపడానికి దోహదపడింది.
‘మన్‌కాడా’ ముట్టడి తర్వాత బాటిస్టా ప్రభుత్వం మరింత క్రూరమైన నిర్బంధకాండ సాగించింది. కాగా, ఫైడల్‌ కాస్ట్రో అనుచరులు, ప్రజా సోషలిస్టు పార్టీ, వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రజల్లో సాంఘిక చైతన్యాన్ని కలిగించి ప్రజల్ని పోరాటాలకు ముమ్మరం చేశాయి. మరోవైపు కాస్ట్రో బృందం విడుదల కోరుతూ దేశ వ్యాప్తంగా నిరసనోద్యమం సాగింది. ప్రజల వత్తిడికి తట్టుకోలేని ప్రభుత్వం 1955లో వారిని విడుదల చేసింది.
కాస్ట్రో కొద్ది మంది అనుచరులతో మెక్సికోకు తరలిపోయాడు. అక్కడ బాటిస్టా నిరంకుశ పాలన నిర్మూలనకు కావలసిన నిర్మాణాత్మకమైన ఆలోచనలతో పటిష్టమైన, సుశిక్షితమైన ఉద్యమకారుల తయారీ జరిగింది. 1956 చివరికల్లా కాస్ట్రో విప్లవ పున్ణప్రారంభానికి సిద్ధపడ్డాడు. ఈలోగా ‘జులై 26 విప్లవం’ అనుబంధ విప్లవ సంస్థల ఆవిర్భావానికి దారితీయడంలో క్యూబాలో రంగం సిద్ధమైంది.
1956, నవంబరు 24న రాత్రి కాస్ట్రో నాయకత్వంలోని 82 మంది ఉద్యమకారులను తీసుకొని ‘గ్రాన్మా’ అనే చిన్న నౌక మెక్సికోలోని టక్స్‌ ఫాన్‌ రేవు నుంచి క్యూబా దిశగా సాగింది. మార్గంలో బీభత్సమైన తుఫాన్‌ ఎదుర్కొని డిసెంబరు 2న క్యూబాలోని ఓరియంట్‌ తీరాన్ని తాకిన కాస్ట్రో అనుయాయుల్ని కొన్ని రోజులలోనే ప్రభుత్వ సేనలు ముంచెత్తారు. మొదట శాంటియాగోలో తిరుగుబాటు చేసి అనంతరం మాంజానిలోని ఆక్రమించి, ఓరియంట్‌లోని ప్రజల్ని సమీకరించాలన్న కాస్ట్రో ప్రణాళిక భగమైంది. ఈ ఉపద్రవాన్ని ఛేదించుకొని బయట పడగల్గింది. కేవలం కాస్ట్రో, రావుల్‌ కాస్ట్రో, చేగువెరా తదితరులు ఇరవై మంది మాత్రమే! ఆయుధాలు, సరకులు అన్నీ పోగా మిగిలిన వాళ్ళు ఓరియంట్‌లోని ”సియారోమాయెస్త్ర” పర్వత సాణువుల్లోకి ప్రవాసం వెళ్ళిపోయారు. ఇక్కడి నుండి ప్రారంభమైంది అసలు సమరం! సియారోమాయెస్త్రా విప్లవకారుల స్థావరమైంది.
కాస్ట్రో బృందం ఆ పర్వత ప్రాంత రైతులను, కూలీలను సమీకరించుకొంటూ చైతన్యీకరించుకొంటూ, బలాన్ని పుంజుకొంటూ బాటిస్టా కిరాయి సైనికుల మీద తరచూ దాడులు చేయడం ప్రారంభించాడు.
.సిరామయోస్త్రలోని రెండేళ్ళ ప్రవాస జీవితం విప్లవకారుల రాజకీయ, సాంఘిక తత్వములో సమూలమైన అభ్యుదయకరమైన మార్పు తెచ్చింది. ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమకారులు గ్రామీణులకు విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటూ ముందుకు సాగారు. గ్రామీణులకు ఉద్యమకారులకు మధ్య సజీవ సంబంధమేర్పడింది.ఆ ప్రజల అండదండల్ని ఆలంబనగా తీసుకునే కాస్ట్రో చివరి ప్రయత్నం చేశాడు. నవంరు 1958 నాటికి విప్లవకారుల కార్యక్రమం తుదిరూపు దాల్చింది.
జనవరి, 1 1959 నూతన సంవత్సర శుభోదయాన విప్లవసేన కదిలింది. ఫైడెల్‌ కాస్ట్రో, రావుల్‌కాస్ట్రోల నాయకత్వంలో శాంటియాగో డి క్యూబా మీద విరుచుకుపడింది. అదే రోజు ఉదయాన, చె-గువెరా కామిలో సేన సియోన్‌ ప్యూగోస్‌ శాంటాక్లారా నగరాన్ని ఆక్రమించుకుని, హవానా దిశగా పురోగమించింది.
బాటిస్టా తప్పించుకుని పారిపోయాడు. అతని అనుచరులు పారిపోవడంలో కూడా అతన్నే అనుసరించారు.1959 నూతన సంవత్సర దినాన క్యూబా సోషలిస్టు దేశంగా అవతరించింది. అమెరికాతో గల సైనిక ఒప్పందాలను రద్దు చేసిన కాస్ట్రో దాని అస్తులను కూడా స్తంభింపచేశాడు. ఆ విప్లవ విజయాన్ని సహించలేని అమెరికా 1961 జనవరి లో క్యూబాతో దౌత్య సంబంధాలు తెంచుకోవడమే కాక దానితో ఎలాటి సంబంధాలు పెట్టుకోరాదని దారుణమైన ఆంక్షలు విధించింది.మరోవైపు సోవియట్‌ సోషలిస్టు శిబిరం క్యూబాతో సంఘీభావం ప్రకటించి సహాయసహకారాలు అందించింది. అంతర్జాతీయ నేతగా ప్రతిష్ట పొందిన కాస్ట్రో ఏ దశలోనూ సోవియట్‌లేదా చైనాకు తోకగా వ్యవహరించలేదు. తన దేశ పరిస్థితులకు అనుగుణమైన స్వతంత్ర విధానంతో అలీన దేశాల కూటమిలో భాగస్వామిగా ముఖ్యపాత్ర వహిస్తూ వచ్చారు. సోవియట్‌ తూర్పుయూరప్‌ ఆర్థిక కూటమి కామెకాన్‌ తో ఆర్థిక ఒప్పందాలు దాని అభివృద్ధికి సహాయపడ్డాయి.. ఈ కాలంలో 1961లో అమెరికాలో కెనడీ హయాంలో సంభవించిన మిసిలీ సంక్షోభం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించినా క్యూబా దాన్ని జయప్రదంగా అధిగమించింది. క్యూబా ప్రధాన ఉత్పత్తి అయిన పంచదారను తీసుకుని అందుకు బదులు ఇతర ఉత్పత్తులు అందజేస్తూ సోవియట్‌ యూనియన్‌ ప్రధాన వ్యాపార భాగస్వామిగా వ్యవహరించింది.
కాస్ట్రో గొప్ప పరిపాలనా దక్షుడు. విద్య వైద్య రంగాలలో గొప్ప అభివృద్ధి సాధించారు. నిరాడంబరుడు కూడా. ఆయన ప్రసంగాలు గంటల తరబడి సాగినా ప్రజలు ఆలకించేవారు. రచయితగా చివరి వరకూ రాస్తూనే వున్నారు. కాస్ట్రో భారత దేశానికి కూడా గొప్ప మిత్రుడుగా వున్నారు.
1990 లో గోర్బచెవ్‌ అధికారంలోకి వచ్చి ఆత్మ వినాశకర మార్గాన్ని ప్రతిపాదించిన తర్వాత కూడా సోషలిజం మౌలిక సూత్రాల నుంచి వైదొలగడానికి నిరాకరించిన క్యూబా సోవియట్‌ విచ్చిన్నం తర్వాత మరిన్ని కష్టాల పాలైంది. ఆర్థిక వ్యవస్థ తాలూకూ ప్రధాన ప్రాతిపదిక దెబ్బతిన్నప్పటికి అమెరికాకు తలవంచడానికి క్యూబా సిద్ధపడలేదు. తన రాజకీయ వాతావరణం మారిపోతున్నదని గ్రహించిన కాస్ట్రో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.దేశంలో” ప్రత్యేక పరిస్థితి” ప్రకటించి వున్న వనరునలు పరిమితంగా వినియోగించుకునేలా ప్రజలను చైతన్య పరచింది.కాస్ట్రో నాయకత్వం.ఆయనపై 600 హత్యా ప్రయత్నాలు చేసింది సిఐఎ. ఐసెన్‌ హౌవర్‌ నుంచి ఒబామా ఇప్పుడు ట్రంప్‌ విజయం వరకూ ప్రత్యక్షంగా చూసిన కాస్ట్రో ఆధిపత్యానికి ఎన్నడూ తలవంచలేదు. చివరకు వారే దిగివచ్చి సంబంధాలు పెట్టుకున్నారు. ్యహ్యూబా
హ్యూగో చావేజ్‌ నాయకత్వాన వెనిజులాలోనూ ఇతర లాటిన్‌ అమెరికా దేశాలలోనూ ప్రగతిశీల ప్రభుత్వాలు ఏర్పడటానికి కాస్ట్రో అండగా నిలిచారు. చావేజ్‌కు కాన్సర్‌ వచ్చినప్పుడు క్యూబాలోనే చికిత్స పొందారు. 2008లో బాధ్యతలు విరమించిన కాస్ట్రో అతిధులను కలుసుకుంటూ రచనలు చేస్తూ తుది శ్వాస విడిచారు.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *