బాబా-బాబు-బియాని- నమో- అరుంధతి- బిగ్‌ డీల్‌ నోట్ల బజార్‌

kishore_biyani_3072336g modi_ramdev_12092013 bl03_bank_sbi-biya_2231599f

పోస్టాఫీసుల్లోనూ, బ్యాంకుల్లోనూ సిబ్బంది తప్పు చేశారంటూ సిబిఐ తనిఖీలు జరిపిస్తున్న ప్రభుత్వం ఏకంగా ఒక ప్రైవేటు వ్యాపార సంస్థకు నోట్ల బట్వాడా అధికారం ఎలా ఇస్తుంది? ఆ సంస్థను ఎవరు నియంత్రిస్తారు? తప్పులు చేయకుండా ఎవరు ఆపుతారు? బిగ్‌బజార్‌ ఔట్‌లెట్లలో డెబిట్‌ కార్డుల ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఎందుకు కల్పించార/? 115 పట్టణాలలోని 258బిగ్‌ బజార్‌ షోరూముల్లో రోజుకు దాదాపు పాతిక ముప్పై కోట్ల నగదు సమకూర్చడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌ పర్సన్‌ అరుంధతీ రారు తీసుకున్న నిర్ణయం వెనక ప్రభుత్వం వుండి తీరాల్సిందే కదా.బిగ్‌ బజార్‌లో బాబా రామ్‌దేవ్‌ పతంజలిఉత్పత్తులు, బాబా శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌ ఆర్ట్‌ఆఫ్‌ లివింగ్‌ ఉత్పత్తులు ఎక్కువగా వుంటాయి.దీని అసలు యాజమాన్యం కిషోర్‌ బియాని ఆధ్వర్యంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌. ఇక్కడ మరో కిటుకు ఫ్యూచర్‌ గ్రూపులో చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థ గత నెలలోనే భాగస్వామ్యం తీసుకోవడం.రాజస్థాన్‌ బిజెపి ప్రభుత్వం కూడా గత ఏడాదే ఫ్యూచర్‌ గ్రూపుతో అన్నపూర్ణ భండార్‌ పేరిట ఒక ఒప్పందం చేసుకుని చౌక ధరల దుకాణాలకు నేరుగా సరఫరాలు చేయిస్తున్నది. నోట్లరద్దుతో చిల్లర దుకాణాలు ఇబ్బంది ఎ దుర్కొంటున్న పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బిగ్‌ బజార్‌కు ఈ నోట్ల సరఫరా అదనపు అవకాశం అవుతుంది. 2015లోనే బాబా రాందేవ్‌,శ్రీశ్రీలు కూడా దాంతో ఒప్పందం చేసుకున్నారు.
నగదు లావాదేవీల స్తంభన వల్ల బాగా లాభపడిన పేటిమ్‌తో కూడా ఫ్యూచర్‌ గ్రూపు అవగాహనకు వచ్చే అవకాశం వుంది. ఇదే గ్రూపునకు చెందిన ప్యాంటాలూమ్స్‌లో ఆదిత్య బిర్లా గ్రూపునకు 1200 కోట్ల పెట్టుబడులున్నాయి.ే నరేంద్రమోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ గ్రూపునుంచే 25 కోట్లు ముట్టాయని ఐటి దాడులలో దొరికిన పత్రాలలో నమోదై వుంది.
ఇప్పుడు మళ్లీ మోడీ దగ్గరకు వస్తే అటు శ్రీశ్రీశ్రీ తోనూ ఇటు బాబా రాందేవ్‌తోనూ ఆయన సాన్నిహిత్యం అందరికీ తెలుసు. ఇదే నోట్లరద్దులోనూ బిగ్‌ బజార్‌ డీల్‌కు ద్వారాలు తెరిచి వుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేగాక చిన్న వ్యాపారాలను దెబ్బతీసి కార్పొరేట్‌ మాల్స్‌ను ప్రోత్సహించడం, ఆన్‌లైన్‌పేరిట దేశీయ బ్యాంకుల పాత్ర తగ్గించడం ప్రభుత్వ ఎజెండా వుంది. ఇన్నిటి ఫలితమే బిగ్‌ డీల్‌. దీనిపై సోషల్‌ మీడియాలోనూ కొన్ని పత్రికల్లోనూ చర్చ జరుగుతున్నది గాని మన బడా మీడియా గప్‌చిప్‌.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *