మరో ప్రపంచం పిలిచింది!

నవంబర్‌ 8. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం అద్యక్ష ఎన్నిక కోసం అత్యంత వికృతంగా సాగిన పోటీ అటో ఇటో తేలిపోతుంది. దానికి ముందు రోజే ప్రపంచ చరిత్రనే మార్చిన మరో అగ్రరాజ్య మహత్తర విప్లవ శతవార్షికోత్సవం ప్రారంభమవుతుంది. ఇప్పుడా అగ్రరాజ్యం లేదు. కాని దాని ఆరుణారుణ కాంతులు మిగిలే వున్నాయి. అదే అక్టోబర్‌ విప్లవం. పతిత నిర్గతిక ప్రపంచ త్రాతా, వ్యక్తిస్వతస్సిద్ధ స్వాతంత్య్ర దాతా, అని మహాకవులు కీర్తించిన మహావిప్లవం.పాపపంకం నుంచి పద్మాలు పుట్టించి కార్మికస్వర్గాన్ని కలగన్న రష్యా అని కొనియాడిన మహాశక్తికి మూలం అక్టోబర్‌ విప్లవం.మానవ చరిత్రలో ఫ్రెంచి విప్లవం, అమెరికన్‌ విప్లవం, అక్టోబర్‌ రష్యన్‌ విప్లవం మూడూ మహత్తరమైన మార్పులు తెచ్చాయి. కాని ఈ మూడింటిలో మళ్లీ మౌలికంగా చరిత్రను మార్చి మరో ప్రపంచానికి నాంది పలికింది అక్టోబర్‌ విప్లవమే. . దీని వెనక మార్క్స్‌ ఎంగెల్సుల సైద్ధాంతిక బోధనలున్నాయి. మహావ్యూహకర్త లెనిన్‌ నేతృత్వంలో ో బొల్షివిక్కుల సాహసోపేత పోరాటముంది. త్యాగాలున్నాయి.
20 వ శతాబ్డి ప్రారంభం నాటికి సామ్రాజ్యాల ఘర్షణలు పరాకాష్టకు చేరుకున్నాయి.ే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. జారు చక్రవర్తుల నిరంకుశ పాలనలోని రష్యాలో పరిస్థితులు మరీ దిగజారాయి. లెనిన్‌ మొదటి ప్రపంచ యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చి విప్లవం తీసుకురావాలన్నాడు. పెట్టుబడిదారీ పాలక వర్గాలు బలహీనంగా వున్న చోట విజయం సాధించవచ్చునని గొప్ప సూత్రం చెప్పాడు. జారిస్టు రష్యాలో ప్రజావెల్లువలు , కార్మికుల సమ్మెలు వూపందుకున్నాయి. 1917 మార్చి 15న తాత్కాలిక ప్రభుత్వమేర్పడింది. రైల్వే కార్మికులు జారు ప్రయాణిస్తున్న రైలును నిలిపివేసి అధికారం వదులుకుంటున్నట్టు సంతకం చేయించారు. పైన తాత్కాలిక ప్రభుత్వముంటే స్థానికంగా ఎక్కడికక్కడ సోవియట్ల పేరిట కార్మిక కర్షక ప్రతినిధుల పాలనా సమితులు ఏర్పడ్డాయి.1917 ఏప్రిల్‌లో ప్రవాసం నుంచి రష్యా వచ్చిన లెనిన్‌ సర్వాధికారం సోవియట్లకే అని పిలుపునిచ్చాడు. అక్టోబరు 25,26 తేదీలలో(కొత్త క్యాలండర్‌లో నవంబరు7) తెలవారుతుందగా సైనికులు చక్రవర్తుల నివాస భవనమైన వింటర్‌ ప్యాలస్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు గంటల తర్వాత కార్మిక కర్షక సోవియట్ల మహాసభ రష్యాను యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్టు రిపబ్లిక్‌గా ప్రకటించింది.
. వచ్చీ రాగానే చేసిన మొదటి పని శాంతికోసం విజ్ఞప్తి.రెండవది భూస్వాములకు మతసంస్థల చేతుల్లో చిక్కుకున్న భూమినంతటినీ స్వాధీనం చేసుకుంది. ఎనిమిది గంటల పనిదినం ఇంకో ఉత్తర్వు. జారు చక్రవర్తులు రష్యాలో కలుపుకున్న జాతులు కావాలంటే విడిపోవచ్చని అనుమతించడమే గాక ఫిన్లండ్‌ స్వాతంత్రాన్ని గుర్తించింది.ే ఈ శ్రామిక రాజ్యాన్ని మొగ్గలోనే తుంచి వేయడానికి 1918 మార్చిలో ఫ్రెంచి బ్రిటిష్‌ అమెరికా సైన్యాలు చుట్టుముట్టాయి.. ప్రజలే ఆ దిగ్బంధాన్ని ఛేదించి దేశాన్నికాపాడుకున్నారు.
సమాచార సంబంధాలు ఇంతగా లేని ఆ రోజుల్లోనే సోవియట్‌ విప్లవం అన్నిదేశాలనూ ఉర్రూతలూపింది. అమృతబజార్‌ బెంగాలీ పత్రిక రష్యన్‌ అగ్ని పర్వతం అంటూ అభివర్ణించింది.ఆంధ్ర పత్రిక ఎన్నో కథనాలుప్రచురించింది. నాకు బొల్షివిజమొక్కటే మార్గంగా కనిపిస్తుందని లాలాలజపతిరారు రాశారు. . రచయిత ప్రేమ్‌చంద్‌ కూడా నేనిప్పుడు బొల్షివిక్‌ సిద్ధాంతాలను పూర్తిగా నమ్ముతున్నాను అన్నారు.తూర్పు దేశాల్లో స్వాతంత్ర పోరాటాలకు అండగానిలిచేందుకు తాష్కెంట్‌లో ఒక విశ్వ విద్యాలయం స్థాపించారు. ఇదంతా ి బ్రిటిష్‌ పాలకులకు కంగారు పుట్టించి 1919 లోనే బొల్షివిక్‌ భావాలు వ్యాపించకుండా కట్టుదిట్టమైన నిఘాలు నిషేదాలు పెంచారు. . అయినా తెలుగునాట ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవలలో రష్యా విప్లవం గురించి రాశారు.గోర్కీ అమ్మ నవల ే అనువాదమైంది. రవీంద్రనాథటాగూరు వేనోళ్ల కీర్తించారు. నెహ్రూ లాటి వాళ్లకు చాలా అవగాహన వుంది. ా భారతదేశంలోనూ కమ్యూనిస్టు భావాలు వ్యాపించాయి.అప్పటివరకూ కాంగ్రెస్‌ అధినివేశ ప్రతిపత్తి ం మాత్రమే కోరుతుంటే . 1922లో గయ మహాసభలో కమ్యూనిస్టు పార్టీ తరపున సింగారవేలు చెట్టియార్‌ సంపూర్ణ స్వాతంత్రం నినాదం ఇచ్చారు. కమ్యూనిస్టులపై1922లో పెషావర్‌ కుట్రకేసు, 1923లో కాన్పూరు కుట్రకేసు పెట్టారు పాలకులు. సోవియట్‌ ప్రేరణతో ఏర్పడిన కమ్యూనిస్టు అంతర్జాతీయ సంస్థ తరపున తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించారన్నది ౖ అభియోగం. ఇది అక్టోబర్‌ విప్లవ విశ్వస్పూర్తి.
కోట్లమందిపై కొద్దిమంది దోపిడీని అంతం చేయడంతో సోవియట్‌ శరవేగంగా అభివృద్ధి చెందింది.193ంలలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఆకలిదశకం అన్నారు. ఆ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడిన ా సోవియట్‌ ప్రేరణతో ే శ్రీశ్రీ వంటి మహాకవులు పుట్టారు. సోవియట్‌ పురోగతికి జడిసిన ప్రత్యర్థి దేశాలóనేతలు మొదటి యుద్దంలో ఓడిపోయిన జర్మనీని పురికొల్పి హిట్లర్‌ను ఎగదోశారు. జర్మన్‌ పాసిజంపెరగడానికి కారకులైనారు. కాని భస్మాసురుడిలా హిట్లర్‌ మొదట పాశ్చాత్య దేశాలపైనే పడ్డాడు. 1941లో సొవియట్‌పై దాడి చేశాడు. ఇది తమకూ ముప్పు గా మారడంతో బ్రిటన్‌ అమెరికా సోవియట్‌తో మిత్రరాజ్యా కూటlenin111october-propaganda-posterమి ఏర్పాటు చేసుకున్నాయి. ఆ భీషణ యుద్ధం అత్యధికంగా సోవియట్‌ భూభాగంపైనే జరిగింది. రెండుకోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.1710 పట్టణాలు,70 వేల గ్రామాలు నేలమట్టమయ్యాయి. చివరకు వారి శౌర్య పటిమతో 1945లో జర్మనీ భేషరతుగా లొంగిపోయింది.స్టాలిన్‌ నాయకత్వంలో ఆ ప్రజలు ఫాసిజాన్ని ఓడించారు. పాత ప్రపంచాధిపత్యాలు పోయాయి. ో రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యం అంతరించింది. మనమంతా స్వాతంత్రం పొందడానికి దోహదం కలిగింది. యుద్ధంలో ఏ నష్టం లేని అమెరికా చితికిపోయిన ఐరోపా దేశాలకు అప్పులు పెట్టి అగ్రరాజ్యంగా ఎదిగింది.
తర్వాతి యాభైఏళ్ల చరిత్రా అటు అమెరికా కూటమి ఆధిపత్య వ్యూహాలకూ ఇటు సోవియట్‌ శిబిరం ప్రతివ్యూహాలకూ మధ్య జరిగిన ఘర్షణే. దీన్ని ప్రచ్చన్న యుద్ధం అన్నారు గాని నిజానికి ప్రత్యక్ష ఘర్షణే.ఈ క్రమంలో వియత్నాంతో సహా చాలా చోట్ల అమానుష దాడులు చేసింది అమెరికా కాగా భారత దేశంతో సహా నవ స్వతంత్ర దేశాలకు ఆత్మీయ నేస్తంగా అండగా నిలిచింది సోవియట ే్టచైనా క్యూబా ఉత్తర కొరియా తూర్పు యూరప్‌ తదితర దేశాలు సోషలిజం సాధించుకుకోవడంతో సోషలిజం మూడోవంతు ప్రపంచానికి పాకింది.భారతీయ భాషలన్నిటా సాహిత్యం, నిస్వార్థ శాస్త్ర వైజ్ఞానిక సహాయం అందించిన ఘనత దానికే దక్కింది. .
స్టాలిన్‌ కృశ్చేవ్‌ బ్రెజ్నెవ్‌ల నాయకత్వం తర్వాత 1985లో మిహయిల్‌ గోర్చచెవ్‌ ఆగమనం అనంతర పోకడలతో 1991ఆగష్టులో సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నమైంది. ఇందులో వ్యక్తుల పాత్ర సైద్ధాంతిక కోణాలూ కూడా వున్న మాట నిజం. సిద్ధాంతాన్ని అన్వయించడంలో శత్రుశిబిరాన్ని అంచనా వేయడంలో పొరబాట్లు, అంతర్గతంగాక్రమేణా ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఉత్పత్తినాణ్యతనూ పెంచుకోకపోవడం వంటి కారణాలూ వున్నాయి. రోగం కన్నా ప్రమాదకరమైన ఔషదం అన్నట్టు గోర్చచెవ్‌ తెచ్చిన సంస్కరణల దుష్ఫలితాలూ వున్నాయి. ఈ పరిణామలూ అనుభవాలూ గుణపాఠాలూ అన్నీ ఒకే చోట చెప్పుకోడం కుదరనిపని. ఏదేమైనా సోవియట్‌ విచ్చినమైనంత మాత్రాన అక్టోబర్‌ విప్లవ చారిత్రిక ప్రాధాన్యత చెక్కుచెదరదు. ఈ వందేళ్లలోనూ 70 ఏళ్లు అది అద్భుత ప్రభావం చూపింది. కూలిపోయిన తర్వాత పాతికేళ్లలో ప్రపంచం గ్లోబలిపీఠంగా మారడం కనిపిస్తూనే వుంది. చరిత్రాంతం అంటూ సిద్ధాంతాలు చెప్పిన మేధావులు తలలు పట్టుకుంటుంటే మార్క్స్‌ మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాడు. దోపిడీ పీడన అణచివేత వున్నంత కాలం దానికి వ్యతిరేకంగా పోరాటం వుండనే వుంటుంది. ఒక రోగి మరణిస్తే వైద్యశాస్త్రం తప్పుకానట్టే ఒక విప్లవం అది కూడా తొలి విప్లవం గొప్ప ఫలితాల తర్వాత తప్పులతో దెబ్బతింటే ఆ సిద్ధాంతమే తప్పయిపోదు. మారిన పరిస్థితుల్లో ఆ నూతన అధ్యయనానికి ఆచరణకూ అక్టోబర్‌ విప్లవ శతవార్షికోత్సవం మార్గదర్శి అవుతుందని ఆశిద్దాం.శాపనార్తాలు పెట్టేవారిని పక్కకునెట్టిచారిత్రిక యదార్థతత్వం అన్వేషిద్దాం. చరిత్రవెనక్కు తిరుగుతుందని/ధరిత్రి బల్లపరుపుగా వుందని/ నరుడు మళ్లీ వానరుడవుతాడని/ నమ్మని ఆశావాదులం / ఆశయం ఎప్పటికీ అరుణోదయం. (ఆంద్రజ్యోతి ఎడిట్‌పేజి, గమనం 3.11.16)

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *