అత్యాచారం..అన్ని వ్యవస్థల అన్యాయం

rape111

ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో కామాంధుడూ మోసగాడైన ఒక పెద్దమనిషికి బలైన 14 ఏళ్ల బాలిక పట్ల మొత్తం సమాజం ఎంత మానవతా రహితంగా ప్రవర్తించిందో తల్చుకుంటే తలతిరిగిపోతుంది.

మొదటిది-ఆ దుర్మార్గుడు ఎలా లోబర్చుకున్నాడో లేక బలాత్కరించాడో గాని అనేకసార్లు అత్యాచారం చేసి ఆమెను గర్భవతిని చేశాడు.
రెండవది- ఇది తెలిసిన తర్వాత పేదలైన ఆ తలిదండ్రులు గర్భస్రావం కోసం ప్రయత్నిస్తే ఆమె వయస్సుచాలదంటూ చట్టం అడ్డుపడింది.

మూడవది- ప్రత్యేక కేసు కింద మినహాయింపు కోరుతూ కోర్టుకు వెళితే ఎడతెగని జాప్యంతో వారాలు గడిచిపోయి చివరకు గర్భస్రావం చేయలేని స్థితి ఏర్పడింది

నాల్గవది- ఈ మొత్తం కాలంలో చుట్టు పక్కల వాళ్లు ఆ కుటుంబాన్ని చేరదీయకపోగా అవమానిస్తూనే వచ్చారు.
bar-girl
అయిదవది-ఎలాగో అన్నీ భరించి ఆ తలిదండ్రులు కాన్పు కోసం వెళితే మొదట పరీక్షించిన మంత్రసాని ఈమె అత్యాచారానికి గురైందని తెలిసి వెళ్లగొట్టింది. చివరకా అమ్మాయి ఆంబులెన్సులోనే ప్రసవించింది.

ఆరవది-ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ ప్రతినిధులు రాజకీయవేత్తలు ఆమెను సందర్శించలేదు. 25 వేలు సాయం చేసి చేతులు దులుపుకున్నారు.
ఏడవది-ఇదే సమయంలో గోరక్షణ పేరుతో అఖ్లక్‌ఖాన్‌ను హత్య చేసిన కేసులో నిందితుడు చనిపోతే ప్రభుత్వం పదిలక్షలు పరిహారం ఇచ్చింది!
ఎనిమిదవది- సాయం చేయలేదు గాని ఆ పుట్టిన బిడ్డను తమకు ఇస్తుందేమోనని ఆశతో చాలామంది పిల్లలు లేని దంపతులు క్యూ కట్టారు.
తొమ్మిదవది- ఏమైతేనేం- బిడ్డను మేమే పెంచుకుంటామని చెప్పి ఆ కుటుంబం అందరినీ పంపేసింది
పది- అయితే ఇందులో సమస్య కూడా వుంది.కోర్టులో కేసు విచారణలోవుంది గనక బిడ్ద వుండటం అవసరమే.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *