తొలి చర్చలో ట్రంప్‌ పై చేయి

us-vote-debate_314a258c-8470-11e6-ad59-fe0cd67003de

అమెరికా అద్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్‌ డెమొక్రటిక్‌ పార్టీల అభ్యర్థులు డోనాల్డ్‌ట్రంప్‌, హిల్లరీ క్లింటన్‌ల మధ్య తొలి సంవాదంలో హిల్లరీనే ఆధిక్యత చూపారనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. స్వతహాగా వివాదాస్పద వ్యాఖ్యలకు పేరొందిన ట్రంప్‌ను ఆమె జాగ్రత్తగా రెచ్చిపోనిచ్చి తాను మాత్రం సంయమనంతో మాట్లాడారు. పన్నులు టెర్రరిజం, వర్ణ దురహంకారం వంటి విషయాలన్నిటిలోనూ ట్రంప్‌ అసహనానికి గురవుతుంటే హిల్లరీ ఉదారవాదిలా కనిపించే ప్రయత్నం చేశారు. నిజానికి అంతర్గతంగానూ అంతర్జాతీయంగా అమెరికా అద్యక్ష భవనంలో ఎవరున్నా విధానాలు పెద్దగా మారవని అందరికీ తెలుసు. అయినా సరే అద్యక్ష ఎన్నికల ప్రచారం పెద్ద సంరంభంగానే జరుగుతుంది. అందులో ముఖాముఖి వాదనలో ఎవరు బాగా మెప్పించారన్న విశ్లేషణ చేస్తుంటారు. ఈ తొలి దఫాలో హిల్లరీకి 67 శాతం, ట్రంప్‌కు 33 శాతం మద్దతు వచ్చినట్టు ఒక సర్వే చెప్పింది. మొదట హిల్లరీకి అనుకూలంగా వున్నట్టు కథనాలు వచ్చినా తర్వాత సర్వేలో మాత్రం ట్రంప్‌కే స్పష్టమైన మొగ్గు కనిపిస్తున్నది.సిఎన్‌బిసి,టైమ్‌ పోల్స్‌లో ట్రంప్‌కు చాలా ఆధిక్యత వుందిదుందుడుకు విధానాలు, దురహంకార వాదనలు చేసే ట్రంప్‌ అభ్యర్థిగా రావడం పాశ్చాత్య దేశాలలో వస్తున్న మితవాద మొగ్గుకు ఒక సూచన. అయితే ఆయన మరీ దారుణంగా మాట్టాడుతున్నారు గనక మొదటి సారి మహిళగా పోటీలో వున్నారు గనక హిల్లరీకి ఒక అవకాశం రావచ్చనే అంచనాలూ వున్నాయి. అమెరికాలో ఒకే పార్టీ వరుసగా మూడో సారి అద్యక్ష భవనంలో వుండటం దాదాపు జరగదు. ఈ సారి కూడా మొదట ట్రంప్‌ గురించే చెప్పినా క్రమేణా హిల్లరీ వైపు మొగ్గు పెరుగుతుందంటున్నారు.మీడియా పూర్తిగా ఆమెనే సమర్థిస్తున్నది. రెండు ప్రముఖ పత్రికలు న్యూయార్క్‌ టైమ్స్‌,,వాషింగ్టన్‌ పోస్లు ఆమే గెలవాలని ట్రంప్‌ అద్యక్షుడైతే హాని అని రాశాయి.. ట్రంప్‌ పన్ను చెల్లింపుల వివరాలు అడిగి హిల్లరీ బాగా ఇరకాటంలో పెట్టారు. అలాగే ఇరాక్‌ యుద్ధాన్ని ఆయన సమర్థించారా లేదా అనేది కూడా సమర్థనలోకి నెట్టింది. కాని అమెరికా విదేశాంగ మంత్రిగా హిల్లరీ వివాదాస్పద ప్రైవేటు మెయిల్స్‌ను వాడటం,వాటిని తొలగించడం వంటి లోపాలు ట్రంప్‌ ప్రస్తావించినప్పుడు ఆమె తనది తప్పే నని ఒక్క మాటతో ఒప్పేసుకుని వాదన నివారించగలిగారు

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *