శభాష్‌ కరీనా! బేటీ కో జై బోల్‌నా

kareena11

ఒకప్పుడు హేమమాలిని,మరొకప్పుడు శ్రీదేవి పురుషాధిక్య చిత్ర ప్రపంచంలో దాన్ని సవాలు చేసి సమానంగా వెలుగొందారంటారు. ఈ నాటి బాలివుడ్‌ను చూస్తే చాలాకాలంగా కరీనా కపూర్‌, కత్రినా కైప్‌ వంటి వారు ఆ పాత్ర నిర్వహిస్తున్నట్టు కనిపిస్తుంది. వారి పాత్రలు నటన ఇతర అంశాలు ఎలా వున్నా అనుకున్నది గట్టిగా ధైర్యంగా చెప్పేస్తుంటారు. సైఫ్‌ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న కరీనా గర్భిణిగానే అందాల ప్రదర్శనలో పాల్గొనడాన్ని రెండు విధాల చూడొచ్చు. ఇదంతా ప్రచారార్బాటమని కొట్టిపారేయొచ్చు. ఒక మహిళ గర్భంతో వుండటం సహజం గనక తన సాధారణ కార్యక్రమాలు ఆపనదసరం లేదని చెప్పొచ్చు. అసలు అందం గురించిన జంకు లేకుండా ఆ స్థితిలో వచ్చి పాల్గొనడమే అభినందనీయం. ఇక మీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని చూయింగ్‌ గమ్‌ ప్రశ్నకు ఆమె సమాధానం చుర్రుమనిపించేలా వుండటం మరింత హర్షనీయం. అమ్మాయిగా నేను అమ్మాయే పుట్టాలని కోరుకుంటాను అని కుండబద్దలుకొట్టి చెప్పారు. అసలు గర్భం kareenaa2222దాల్చినప్పటి నుంచి ఈ దేశంలో ఇదే ప్రశ్న అని విసుక్కున్నారు. మహిళలు మామూలు మనుషులు కాదా. పెళ్లవగానే నటించడం కొనసాగిస్తారా? పిల్లలు పుట్టాక కూడా నటిస్తారా ఇలాటి ప్రశ్నలేమిటో అర్థం కాదు. నేను ఎప్పటిలాగే నటిస్తాను అని తేల్చిచెప్పేశారు. గర్భస్థ శిశుపరీక్షలు భ్రూణ హత్యలు, భార్యను ఆడశిశువును కొట్టి చంపడాలు వదిలేయడాలు చేసే ఈ దేశం జిస్‌ దేశ్‌ మె గంగా బహితీహై అని పాడిన రాజ్‌కపూర్‌ మనవరాలి మాటలైనా ఆలకిస్తే బావుణ్ను.

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *