జయహౌ జెఎన్‌యు, ఎబివిపికే డియు

 


jnu-election-embed1-14125570-896858277086600-6650630694063842683-o500085-jnu-polls-bir-bahadurప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఎస్‌ఎప్‌ఐ- ఎఐఎస్‌ఎ కూటమి విజయం సాధించడం కాషాయ శక్తులకు పెద్ద ఆశాభంగమే.. ఇప్పటి వరకూ అద్యక్షుడుగా వున్న ఎఐఎస్‌ఎప్‌ నాయకుడు కన్హయ్య కుమార్‌పై దేశద్రోహ ముద్ర వేసి నానా దుష్ప్రచారాలు చేసినా- పార్లమెంటు వరకూ తీసుకెళ్లినా విద్యార్థులు వామపక్ష భావాలనే ఆదరించడం ఆరెస్సెస్‌ -ఎబివిపి కూటమి చిన్న బోయేలా చేసిందని పత్రికలు రాశాయి. గత రెండేళ్లకంటే ఈ ఏడాదిఎక్కువ మంది విద్యార్థులు ఓటింగులో పాల్గొనడం, అన్ని స్థానాలనూ ఐక్య కూటమి కైవశం చేసుకోవడం రాజకీయంగానూ సంచలనం కలిగించింది. మొహిత్‌ కుమార్‌ పాండ్య(ఎఐఎస్‌ఎ) అద్యక్షుడుగానూ,పిపి అమాల్‌(ఎస్‌ఎప్‌ఐ) ఉపాద్యక్షులుగానూ, కుమారి శత్రుపా చక్రవర్తి(ఎస్‌ఎప్‌ఐ) ప్రధాన కార్యదర్శిగానూ, తాబ్రిజ్‌ హుసేన్‌(ఎఐఎస్‌ఎ)సంయుక్త కార్యదర్శిగానూ విజయం సాధించారు. వీరిలో శత్రుపా చక్రవర్తి అత్యధిక మెజార్టి తెచ్చుకున్నారు.ఇక యూనివర్సిటీలోని 15 కౌన్సిలర్‌స్థానాల్లోనూ ఒక్కటి మాత్రమే ఎబివిపి తెచ్చుకోగలిగింది. వారి మాటలు విని దేశద్రోహ ప్రచారం నెత్తికెత్తుకున్న బిజెపి మొ కూడా ఇది రాజకీయ పరాజయంగా మారింది.
చాలా కాలం తర్వాత ఎస్‌ఎప్‌ఐ ఎఐఎస్‌ఎప్‌లు కలసి పోటీ చేశాయి.అందులోనూ ఎస్‌ఎప్‌ఐ పదేళ్ల తర్వాత విజయం సాధించగలిగింది కన్నయ్య కుమార్‌ గాని ఆయన నాయకత్వంలోని ఎఐఎస్‌ఎప్‌ గాని ఈ సారి పోటీ చేయలేదు. .జెఎన్‌యు విద్యార్థి ఎన్నికలు చాలా భిన్నంగా హౌరాహౌరీగా జరుగుతాయి. అద్యక్ష పదవికి పోటీ చేసే వారు అమెరికా అద్యక్ష ఎన్నికల స్థాయిలో ముందే ప్రసంగాలు చేసి తమ ఎజెండాతో ఆకట్టుకోవాల్సి వుంటుంది.బిజెపి సహాయంతో ఎబివిపి తనకు మొదటి నుంచి పట్టు కొనసాగుతున్న ఢిల్లీ యూనివర్సిటీలోనూ జెఎన్‌యులోనూ భారీగా ఖర్చు చేసింది. ఆప్‌ విద్యార్థి విభాగం స్వరాజ్‌, విద్యార్థి కాంగ్రెస్‌ కూడా గట్టిగానే పోటీ పడ్డాయి. డియులో అయితే ఎబివిపి 1423 అంటూ ప్రోమో కోడ్‌ను ఊబర్‌ క్యాబ్స్‌లో వచ్చేలా చేసింది.అయితే ఇంత చేసినా డియులో నాలుగు ముఖ్యస్థానాలూ కలిగివున్న ఎబివిపి ఈ సారి ఒకటి ఎన్‌ఎస్‌యుఐకి కోల్పోయింది.అలా అక్కడ కూడా కొంత ఓటమి తప్పలేదు. ఈ విజయం తర్వాతనైనా కళ్లు తెరవకపోగా కొందరు మతతత్వ వాదులు దేశ ద్రోహులు గెలిచారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం ఎత్తుకున్నారు.జాతీయ మీడియా మాత్రం వామపక్ష విద్యార్థి సంఘాల ఘన విజయానికి చాలా ప్రాధాన్యతనిచ్చింది. ఎబివిపికే డియు, లాల్‌ సలామ్‌ జెఎన్‌యు అని శీర్షికలిచ్చింది.కన్నయ్య కుమార్‌ కూడా అభినందనలు తెలిపారు. మీరు జెఎన్‌యును మూసి వేయండని ప్రచారం చేస్తే విద్యార్థులు ఎబివిపిని మూసేయమని తీర్పు నిచ్చారు అని ట్వీట్‌ చేశారు.10-vbk-abvp_3005961f

Facebook Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *