వెబ్‌సైట్‌ వివరాలతో వెల్లడైన బండారం

fm-arun-jaitley-with-venkaiah-naidu
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన ప్రకారమే ఇప్పటికి ఆంధ్ర ప్రదేశ్‌కు అన్ని విభాగాల కింద ఇచ్చిన మొత్తం దాదాపు ఎనిమిది వేలకోట్ల మేరకు వుంటుంది. కనీసం మొదటి ఏడు రెవెన్యూ లోటును కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. తాజా ప్రకటనలోనూ దేనీకీ క్వాంటిఫికేషన్‌(సంఖ్యా పరిమాణం) లేనేలేదు. వాస్తవానికి మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రకటనలో ప్రత్యేక హౌదా ఒక అంశమే. మరో ఆరు విషయాలుదానిలో వున్నాయి.1. ప్రత్యేక హౌదా 2. రెండురాష్ట్రాలలోనూ పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు 3.ఒరిస్సాలో కోరాపుట్‌ బోలంగిర్‌ కల్హాంది(కెవికె) లోనూ, యుపి ఎంపిలకు చెందిన బుందేల్‌ఖండ్‌ లోనూ అమలు చేస్తున్న ప్రత్యేక ప్కాకేజీ తరహాను ఎపికి వర్తింపచేయడం 4.పోలవరం పునరావాసం 5. సిబ్బంది ఆర్థిక వనరుల కేటాయింపు 6.14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వరకూ ఆగకుండానే రెవెన్యూ లోటు భర్తీ. ఇవన్నీ చెప్పిన తర్వాత ముగింపులో మన్మోహన్‌ అన్న మాట మరింత ముఖ్యమైనది. ”ఈ చర్యల ద్వారా మేము కేవలం తెలంగాణ ఏర్పాటుకే గాక సీమాంధ్ర సౌభాగ్య సంక్షేమాలకు గట్టిగా కట్టుబడివున్నామని తెలియజేయదలచాము” అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తప్పొప్పులు బిజెపి టిడిపి విశిష్టతల గురించి దండకాలు చదివేబదులు ఈ మాటల స్పూర్తిని గుర్తించడం ముఖ్యం
ప్రత్యేక హౌదా రాకపోవడానికి 14వ ఆర్థిక సంఘానికి ఏ మాత్రం సంబంధం లేదని నేను మొదటి నుంచి ఇంకా చెప్పాలంటే మొదటగా వాదించాను. నిన్న మీడియా గోష్టిలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దాన్నుంచి తగు భాగాలు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ రోజు వెబ్‌సైట్‌లో 2.29, 2.30 పేరాలు పొందుపరుస్తూ ఈ కారణంగానే హౌదా ఇవ్వలేకపోతున్నట్టు వివరణ ఇచ్చారు.
అయితే ఈ పేరాల్లో ఎక్కడా హౌదాను తొలగించాలని గాని, తప్పని గాని లేదు. తమ నిధుల కేటాయింపు సమయంలో మాత్రం మామూలుగానే లెక్క వేసినట్టు మాత్రమే కమిషన్‌ తెల్పింది. ఆర్థిక వెసలు బాటులేని ఈశాన్య రాష్ట్రాలు కొండిపాంత రాష్ట్రాలకు అదనంగా సహాయం ఇచ్చేందుకు మామూలు పద్ధతినే పాటించానని చెప్పింది. అలాగే ఇతర అవసరాలున్న రాష్ట్రాలకు కూడా మామూలు పంపిణీ అయిన తర్వాత అదనంగా కేటాయించినట్టు చెప్పింది. అసలు మామూలుగానే నిధులు లెక్కకట్టేప్పుడు నార్మేటివ్‌ సాధారణ నిష్పత్తి తీసుకోవాలన్నది పద్దతి. అదనం తర్వాత కలుపుతారు. ఎప్పుడూ అనుసరించే ఈ సూత్రాన్ని ఏదో గొప్ప వినూత్న విషయంగా తమకు అవరోధంగా అరుణ్‌జైట్లీ వెంకయ్య నాయుడు వంటి సీనియర్లు చెప్పడం హాస్యాస్పదం. పైగా ఆ కారణంగానే హౌదా ఇవ్వలేకపోయామని ప్రత్యేకంగా చెప్పడం ఇంకా విడ్డూరం.
మన్మోహన్‌ ప్రకటనలోని కెబికె ప్యాకేజీ గురించి గాని, హౌదా కింద వచ్చే ప్రత్యేక రాయితీల గురించి గాని కూడావెబ్‌సైట్‌లో పేర్కొనలేదు. అంలే వాటిని కూడా మినహాయించారన్న మాట.
ప్రత్యేకహౌదాతో సమానమైన సహాయం అనడం బాగానే వుంటుంది గాని ఎలా లెక్క వేస్తారు? 40:60శాతం నిధుల పంపిణీని 90:10శాతంగా చూడటం ప్రతిసారీ జరక్కపోవచ్చు. వ్యవసాయ ప్రధానమైన ఎపిలో పారిశ్రామికీకరణకై హౌదా కింద 100 శాతం ఎక్సయిజ్‌,100శాతం ఐటి, 30 శాతం
పట్టుబడిసబ్సిడీ,3 శాతం వడ్డీ సబ్సిడీ ఇవ్వాల్సి వుంటుంది. దీనికోసం ఏడాదికి 500 కోట్లు ఇస్తామంటే
ఎవరికి ఇవ్వాల్సింది ఎవరికి ఇస్తున్నట్టు? ప్రోత్సహకాలు లేవని ఔత్సాహికులను వెనక్కునెట్టి
బడా గుత్తాధిపతులకే పెద్ద పీట వేయడానికి దారి తీయొచ్చు. నిరుద్యోగ యువత బాధావేదనలు తీరకపోవచ్చు. నిర్లక్ష్యానికి గురవుతున్న రాయలసీమ, ఉత్తరాంధ్రలకు యాభై కోట్ల విదిలింపు తప్ప వేరే ప్రణాళికలుండవు. పోలవరం కేంద్రం బాధ్యత అంటూనే రాష్ట్రానికి అప్పగించడం బాధ్యత లేకుండా చేసుకోవడమా లేక రాజకీయ ఒత్తిళ్ల ఫలితమే కావచ్చు. ్ట 13వ షెడ్యూలులో వున్న కీలకమైన సంస్థలను సమగ్రంగా వేగంగా స్థాపించడానికి చర్యలేవీ. రాజధాని నిధులపైనా నిర్మాణంపైనా అర్థవంతమైన సాయం సమన్వయం లేవు. గతంలో ప్రధాని హామీకే చట్టబద్దత లేదన్న వారు ఇప్పుడు ఫ్రధాని లేనప్పుడు హడావుడిగా అరకొరగా ఏదో ప్రకటన చేసి క్యాబినెట్‌ ఆమోదం కావాలని చెబితే దాన్ని తీవ్రంగా పట్టించుకోవలసిన అవసరం కనిపించదు. అర్ధరాత్రి మీడియాను పిలిచి మరీ ఆహ్వానించాల్సినంత అపురూపమైన అంశాలు అందులో లేవు. హౌదాపై రాజీపడే ప్రసక్తిలేదనే వారు ఈ నిరాకరణను స్వాగతించడానికి హడావుడి ఎందుకు పడినట్టు? ఏదో విధంగా ఈ అధ్యాయాన్ని ముగించాలనే ఆదుర్దా కేంద్ర రాష్ట్రాలకు వుంది. చెప్పాలంటే ప్రభుత్వ నిధుల కన్నా ప్రైవేటు భాగస్వామ్యం విదేశీ సంస్థలతో కలసి వెళ్లడానికి ఎక్కువ ఉత్సాహం వుంది. అమరావతి అందుకు ప్రత్యక్ష సాక్ష్యం
ఈ తాజా పరిణామాలతో ఎపి ప్రజల అసంతృప్తి తారాస్థాయికి చేరడం తథ్యం. దానికి ప్రతిపక్షాలను ఆడిపోసుకుని ప్రయోజనం వుండదు.పవన్‌ కళ్యాణ్‌ ఈ రోజు కాకినాడలో జరిపే సభలోనూ రేపు ప్రతిపక్షాల బంద్‌లోనూ ఈ వాతావరణం అర్థమై పోతుంది.

Facebook Comments

2 thoughts on “వెబ్‌సైట్‌ వివరాలతో వెల్లడైన బండారం

 • September 8, 2016 at 9:50 pm
  Permalink

  మీలో ఇ మధ్య మార్పు నిజంగ సంతోసంగ ఉంది ,ఇప్పుడు మీ వృత్తికి తగ్గ న్యాయం చేస్తున్నారు

  Reply
 • September 26, 2016 at 3:43 pm
  Permalink

  ప్రత్యేక హోదాపై, ఏపీ ప్రజల మనసులను గాయపరించిన వారిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు, ఉపేక్షించరు, వారిని కఠినంగా శిక్షిస్తారు.
  అందరిని కలుపుకొని, సమస్య తీవ్రతను మాట్లాడి, రోడ్డెక్కిపోరాటం చేయాడం మినహా, మరోమార్గం కనిపించడంలేదు.
  ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఎదురయ్యే పరిణామాలకు ప్రజలు, ఎవరికీ భయపడరు.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *